ఆలేరు: ఆలేరులో ఆస్తిపన్ను బకాయిదారులపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. రెడ్ నోటీసులు జారీ చేసినా బకాయిల చెల్లింపునకు యజమానులు ముందుకు రాకపోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. బుధవారం ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో విఘ్నేశ్వర కాటన్ మిల్లుతోపాటు సెల్‌టవర్ షెడ్‌లకు మున్సిపల్ చట్టం ప్రకారం సిబ్బంది తాళాలు వేశారు. కాటన్ మిల్లు యజమాని 2022 నుంచి 2026 వరకు దాదాపు రూ.3,41,463లక్షలు, సెల్‌టవర్ షెడ్‌కు సంబంధించి రూ.36,818 ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నోటీసులు ఇచ్చినా యజమానుల నుంచి స్పందన రాకపోవడంతో మిల్లు, సెల్‌టవర్ షెడ్‌లకు తాళాలు వేసినట్లు చెప్పారు. ఈనెల 31వ వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను చెల్లించకపోతే నిబంధనల ప్రకారం ఆస్తుల జప్తు చేయనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.
ఫ ఆలేరులో కాటన్ మిల్లు, సెల్ టవర్ షెడ్డుకు తాళం


