నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలోని బీఈడీ ఒకటి, మూడవ సెమిస్టర్ ఫలితాలు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డిలు బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 2,601 మందికి 1,982 మంది ఉత్తీర్ణత సాధించారు. 619 మంది ప్రమోట్ అయ్యారు. మూడవ సెమిస్టర్‌లో 2,713 మంది విద్యార్థులకు 2,440 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 269 మంది ప్రమోటయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అవసరం
భువనగిరి : విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మనోహర్ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గది, వంట సామగ్రిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకునేందుకు వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. మానసిక ఒత్తిడి, పరీక్షల భయం బారిన పడకుండా టెలిమానసను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ యాకయ్య, వార్డెన్ ముజాయిద్దీన్, వైద్యులు మురళీమోహన్, సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు.


