వందశాతం పన్నులు వసూలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వందశాతం పన్నులు వసూలు చేయాలి

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

రామన్నపేట : ఆర్థిక సంవత్సరం ఈనెల చివరి నాటికి గ్రామ పంచాయతీల్లో వందశాతం వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. బుధవారం రామన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పన్నుల వసూలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా పన్ను వసూలు లక్ష్యం పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ నర్సరీ, ఫారెస్ట్‌ నర్సరీ, ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆసుపత్రిలో శానిటేషన్‌ మెరుగు పడకుంటే సదరు కాంట్రాక్టర్‌ లైసెన్స్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేయాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్‌ గరిక సత్యనారాయణ, తహసీల్దార్‌ లాల్‌బహదూర్‌శాస్త్రి, ఎంపీడీఓ ఎ.రాములు, ఎంపీఓ రవూఫ్‌అలీ, ఆసుపత్రి సూపరిండెంట్‌ శ్వేతప్రియాంక, ఏపీఓ పి.వెంకన్న, టీఏ ప్రవీన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement