కోదాడరూరల్ : ద్విచక్రవాహనాన్ని డీసీఎం ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని రామిరెడ్డిపాలెం రోడ్డు క్రాసింగ్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన అజ్మీర యశ్వంత్ అలియాస్ సన్నీ(14), గుండెపంగు రాకేష్ స్నేహితులు. చదువు మధ్యలో ఆపేసి ఇంటివద్దే ఉంటున్నారు. ఇద్దరు కలిసి లారీ ఆఫీస్ సమీపంలోని ఓ హోటల్లో భోజనం కోసం వెళ్లి పార్శిల్ తీసుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కోదాడ నుంచి కొరబండవైపు వెళ్తున్న డీసీఎం వీరి బైక్‌ను ఢీకొట్టింది. యశ్వంత్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేష్‌కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు.
ఫ యువకుడు మృతి, మరొకరికి గాయాలు


