మహిళలకు దకే్కవి ఎని్న! | - | Sakshi
Sakshi News home page

మహిళలకు దకే్కవి ఎని్న!

Mar 27 2026 9:55 AM | Updated on Mar 27 2026 9:55 AM

మహిళలకు ఏ నియోజకవర్గం రిజర్వు అవుతుందోనని చర్చ

ఆశల పల్లకీలో మహిళా నాయకులు

అంతటా పునర్విభజన ముచ్చటే..

సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతోపాటు మహిళా రిజర్వేషన్‌ అంశం చర్చనీయాంశంగా మారింది. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలుకు కేంద్రం సిద్ధంగా ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో రెండు నియోజకవర్గాలు పెరుగనున్నాయన్న చర్చ కొనసాగుతోంది. మహిళలకు అసెంబ్లీ స్థానాలు రిజర్వు చేస్తే జిల్లాలో కనీసం ఒక స్థానం మహిళలకు రిజర్వు కానుంది.

లాభ నష్టాలు బేరీజు

మహిళా రిజర్వేషన్‌ అమలు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంతో ముడిపడి ఉంది. దీంతో జిల్లాలోని ఎమ్యెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మహిళా నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఆశావహులు నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. రిజర్వేషన్‌ తమకు అనుకూలంగా రాకుంటే ప్రత్యామ్నాయం ఏమిటన్న కోణంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. ఎప్పటినుంచో ఎమ్మెల్యే పదవిపై ఆశపడుతున్న నేతలు పునర్విభజన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి నుంచే ప్రయత్నాలు

ఎమ్మెల్యే టికెట్‌ కోసం మహిళా నాయకులు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు నియోజకవర్గం మార్పులు, మరో రెండు కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కానున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్‌ వంటి అంశాలపై ముందు చూపుతో ఉన్నారు. మహిళా రిజర్వేషన్‌ అమలైతే భువనగిరి ఎమ్మెల్యే కుమార్తె కుంభం కీర్తిరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే సతీమణి బీర్ల అనిత, మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్‌ తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించడానికి సానుకూలంగా ఉన్నారు. జనరల్‌ మహిళా రిజర్వుడు స్థానాల్లో పోటీకి మాజీ ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండ్రు శోభారాణితోపాటు మరికొందరు అసెంబ్లీ పీఠంపై కన్నేశారు. ఒక వేళ మహిళా జనరల్‌ రిజర్వేషన్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు రిజర్వు అయితే మరికొందరు కొత్తవారు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

విలీన మండలాలు, గ్రామాలు మళ్లీ ఎటు?

పాత రామన్నపేట నియోజకవర్గాన్ని ముక్కలుగా విడగొట్టారు. గుండాల, ఆత్మకూర్‌(ఎం) మండలాలను ఆలేరు నియోకవర్గంలో, రామన్నపేటను నకిరేకల్‌ నియోజకవర్గంలో, వలిగొండను భువనగిరి నియోజకవర్గంలో విలీనం చేశారు. భువనగిరి నియోజకవర్గంలో ఉన్న రామన్నపేటలోని కొన్ని గ్రామాలు, చౌటుప్పల్‌ మండలం, చిట్యాల మండలంలోని కొన్ని గ్రామాలు, బొమ్మలరామారం మండలంలోని సగం గ్రామాలు విడగొట్టారు. అయితే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే పైనున్న గ్రామాలు మళ్లీ ఎందులోకి వెళ్తాయోనన్న చర్చ తెరపైకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement