జనగణనలో తప్పులకు తావుండొద్దు | - | Sakshi
Sakshi News home page

జనగణనలో తప్పులకు తావుండొద్దు

Mar 27 2026 9:55 AM | Updated on Mar 27 2026 9:55 AM

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సాక్షి, యాదాద్రి : జనగణనపై పూర్తి అవగాహన కలిగి ఉండి తప్పులకు తావులేకుండా చూడాలని కలెక్టర్‌, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్‌ జయంతి సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో జనగణన –2027 ఫేస్‌ – 1 గృహ గణన నిర్వహణలో భాగంగా టెక్నికల్‌ అసిస్టెంట్లు, జనాభా లెక్కల చార్జ్‌ క్లర్క్‌ లకు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. జనగణన ప్రక్రియలో ప్రతి వివరాన్ని కచ్చితంగా నమోదు చేయాలని, అలాగే టెక్నికల్‌ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని, కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement