ఫ హాజరైన త్రిదండి శ్రీరామచంద్ర
రామానుజ జీయర్ స్వామి
మిర్యాలగూడ : పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో శనివారం శ్రీమహాలక్ష్మి యాగం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాగం సందర్భంగా టీకే శ్రీనివాసన్ శిష్య బృందం ప్రవేశ బలి, వాస్తు హోమం, ఆరాధనలు నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు సంప్రదాయబద్ధంగా పసుపు దంచే కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 27న నిర్వహించనున్న ప్రధాన యాగానికి మిర్యాలగూడ పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని యాగం నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్‌తో పాటు మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, కోశాధికారి గందె రాము, బండారు కుశలయ్య, మాధవి, చిలుకుల రవికుమార్, రేపాల పురుషోత్తంరెడ్డి, ప్రసాద్, కారంపొడి జానకి, రాఘవాచార్యులు, గూడూరు శ్రీనివాస్, గుడిపాటి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.


