పశుగ్రాసం.. శాసీ్త్రయ సాగుతో ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

పశుగ్రాసం.. శాసీ్త్రయ సాగుతో ప్రయోజనం

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

పెద్దవూర: పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకు వచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం. జీర్ణంకాని భాగం ఎక్కువే. శాసీ్త్రయ పద్ధతిలో నాణ్యమైన పశుగ్రాసం అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక పాల ఉత్పత్తి సాధించవచ్చు. పశుగ్రాసం సాగు ఖర్చు కూడా తగ్గించవచ్చు. డెయిరీ ఫామ్స్‌ నిర్వహణ వ్యయంలో 70శాతం వరకు పశువుల మేతకే సరిపోతుంది. దీంతో మేత ఖర్చును తగ్గిస్తే అంతమేరకు లాభాలు పెంచుకునే అవకాశం ఉంది. అలాగే పాలశీతలీకరణ అధికారులు పాలు సప్లయ్‌ చేసే రైతులకు 50 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు అందిస్తారు. పశుసంవర్థక అధికారులు సైతం 50శాతం రాయితీపై విత్తనాలు ఇవ్వనున్నారు. పశువుల కాపరులు వీటిని సద్వినియోగం చేసుకుని పశుగ్రాసం సాగు చేస్తే గడ్డి కొరత తీరుతుందని పెద్దవూర మండల పశువైద్యాధికారి నులక నాగార్జున్‌రెడ్డి సూచిస్తున్నారు.

సాగు విధానం

ఫ పశుగ్రాసం విత్తనాల్లో ప్రధానమైనవి సూపర్‌ నైపర్‌, కో1, కో 2, ఎస్‌ఎస్‌జీ–825 రకాలు.

ఫ 85శాతం పచ్చిమేతను ఈ రకాల ద్వారా తీర్చుకోవచ్చు.

ఫ ఒకసారి నాటితే 4 నుంచి 5 ఏళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు.

ఫజనవరి నుంచి ఆగస్టు వరకు విత్తనాలు విత్తుకోవచ్చు.

ఫ అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆమ్ల గుణాలున్న నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది.

ఫ పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు తోటలు, కూరగాయ పంటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.

ఫ ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం. మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు.

ఫ దుక్కిలో 4 నుంచి 5 టన్నుల కంపోస్టు ఎరువు, 22 కిలోల యూరియా, 16 నుంచి 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి.

ఫ విత్తిన 45 రోజుల తర్వాత ఎకరాకు 22 కిలోల యూరియా వేయాలి. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది.

ఫ అధిక విస్తీర్ణంలో సాగు చేసి సైలే జీ లేదా ఎండి గడ్డి రూపంలో నిల్వ చేసి వాడుకోవచ్చు.

పాల దిగుబడి ఎక్కువే

పశుగ్రాసాల సాగుకు తక్కువ శ్రమ పెట్టుబడి అవసరం అవుతుంది. విత్తనాలు నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుంది. పచ్చిమేలు రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి. సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చిమేత వలన పాల దిగుబడులు 25 శాతం వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. దాణా అవసరం లేకుండా కేవలం పచ్చిమేత ద్వారా 5 నుంచి 6 లీటర్ల పాల దిగుబడి సాధించవచ్చు. పచ్చి మేతలో కాల్షియం, భాస్వరం వంటి మాంసకత్తులతో పాటు ఏ, డీ, ఈ విటమిన్లు, పిండి, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు.

ఫ మెళకువలు పాటిస్తే అధిక పాల దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement