4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

Mar 13 2026 9:08 AM | Updated on Mar 13 2026 9:08 AM

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

భువనగిరిటౌన్‌ : జిల్లాలో రబీకి సంబంధించి సుమారు 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వెల్లడించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణపై సివిల్‌సప్లయ్‌, అగ్రికల్చర్‌, కోఆపరేటివ్‌, మెప్మా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్‌ మిషన్లు, ప్యాడీ క్లీనర్‌ వంటివి అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరతలేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్‌ సప్లయ్‌ డీఎం హరికృష్ణ, సివిల్‌ సప్లయ్‌ రోజారాణి , వ్యవసాయ అధికారి రమణారెడ్డి, రవాణాశాఖ అధికారి సాయి కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement