నేడు సాగర్‌కు బౌద్ధప్రతినిధుల రాక
నాగార్జునసాగర్ (హాలియా) : నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని శనివారం ఉదయం 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు సందర్శించనున్నారని బుద్ధవనం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఈ బృందంలో శ్రీలంక దేశ బౌద్ధమత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్‌సెనేవి, వియత్నాం బౌద్ధ సంఘం ఉపాధ్యక్షుడు తిచ్‌నహత్‌తు, శ్రీలంక దేశపు ఉన్నతస్థాయి పీఠాధిపతి అగ్గరహేరాక సపమహాతేరో, సౌత్‌కోరియాగ్లోబల్ పీస్ అంబాసిడర్ మున్‌యోగ్ జోలతోపాటు పలుదేశాల బౌద్ధప్రతినిధులు ఉంటారని వెల్లడించారు.


