భూదాన్‌పోచంపల్లి: రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆశా కార్యకర్తలు భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేశారు. ఆశా డే సందర్భంగా విధులు బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. నెలనెలా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశాకార్యకర్తలు రాధిక, అలివేలు, సైదమ్మ, కవిత, శారద, జ్యోతి, నవ్య, బాలమణి, చంద్రకళ, అరుణ, నాగమణి, మనోహర, పద్మ, విమల, భార్గవి, సంతోష, లింగమణి పాల్గొన్నారు.


