బావిలో పడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బావిలో పడి మహిళ మృతి

Mar 29 2026 6:44 AM | Updated on Mar 29 2026 6:44 AM

హుజూర్‌నగర్‌ : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి చెందింది. ఈ ఘటన హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోహన్‌ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. బూరుగడ్డ గ్రామానికి చెందిన మాడుగుల కుసుమ (39) మేకలు మేపేందుకు పొలానికి వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న బావిలో పడిపోయింది. మధ్యాహ్నం బంధువులు ఆమెకు ఫోన్‌ చేసినా ఎంతకూ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి పొలం వద్దకు వెళ్లి చూడగా కుసుమ బావిలో పడి మృతిచెంది ఉంది. ఈ విషయమై ఆమె భర్త మాడుగుల పరుషురాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ మృతి

మిర్యాలగూడ టౌన్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మ య్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన బెజవాడ చంద్రమ్మ తన మనుమరాలు బెజవాడ చందన(10)తో కలసి గురువారం రాత్రి రోడ్డుదాటుతుండగా వాడపల్లి నుంచి మిర్యాలగూడ వస్తున్న మోటార్‌ సైకిల్‌ ఢీకొట్టింది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో మిర్యాలగూడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చందన పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య శనివారం తెలిపారు.

మినీ శిల్పారామంలో

నృత్య ప్రదర్శన

భువనగిరి: మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు చెందిన నాట్య గురువు నళిని శిష్య బృందం కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. కళాకారిణులు నైరా, లాస్య, మీనాక్షి, అక్షయ, స్నేహ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement