ఆలేరు రూరల్ : మండల వ్యాప్తంగా నిషేధిత జాబితాల్లో చేర్చిన పేదల ఇళ్లు, భూములను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని తహసీల్ధార్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. మండలంలో 1,600లకుపైగా ఇళ్లు, భూములు నిషేధిత జాబితాల్లో చేర్చడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఇదే సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిషేధిత జాబితాలో చేరిన ఇళ్ల బాధిత మహిళలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది పేదల ఇళ్లు కూల్చుకోవడానికేనా అని ప్రశించారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే సమాదానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్, గ్యాదపాక నాగరాజు, కుండె సంపత్, కందుల శంకర్, రామ్‌నర్సయ్య, ఆరుట్ల లక్ష్మిప్రసాద్‌రెడ్డి, శోభన్‌బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తల, ఇళ్లు, భూముల బాధితులు, మహిళలు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత


