యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. మహిళ భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులను నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవాన్ని నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు పూజలు, నిత్యకల్యాణాన్ని విశేషంగా జరిపించారు. సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి.


