సంస్థాన్ నారాయణపురం: ఉత్తరాలను బట్వాడా చేసేందుకు పోస్టుమెన్ బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈసంఘటన సంస్థాన్‌నారాయణపురం మండలం దేవిరెడ్డిబంగ్లా వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వేల్ గ్రామ పోస్టుమెన్‌గా బూస వెంకటేశ్వర్లు గుప్త(60) పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం ఉదయం దేవిరెడ్డిబంగ్లా గ్రామంలో ఉత్తరాలు బట్వాడా చేసి, తిరిగి ఎర్రగుంట గ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈక్రమంలో హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వేగంగా వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు గుప్త అక్కడికక్కడే మృతి చెందాడు. కుంటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగన్ తెలిపారు. కాగా.. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


