తొలిరోజు 18 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు 18 మంది గైర్హాజరు

Mar 15 2026 5:14 AM | Updated on Mar 15 2026 5:14 AM

భువనగిరి : జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం 50 కేంద్రాల ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. తొలిరోజు తెలుగు పరీక్షకు మొత్తం 8,921 హాజరు కావాల్సి ఉండగా 8,903 మంది హాజరయ్యారు. 18 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాలకు రావడంతో సందడి కనిపించింది. భువనగిరి జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో పరీక్ష కేంద్రాలను పలువురు అధికారులు తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు భువనగిరి పట్టణంలో విజ్ఞాన్‌ హైస్కూల్‌, మరో అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి మాంటిస్సోరీ, మథర్‌థెరిస్సా హైస్కూల్‌లో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. డీఈఓ సత్యనారాయణ జిల్లాలోని పలు కేంద్రాలను తనిఖీ చేశారు.

ఫ పదో తరగతి పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement