గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎఫ్‌ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలీసులే ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేశారు. గరిడేపల్లి ఎస్‌ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంసర్వారం గ్రామానికి చెందిన కాంతయ్య రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కీతవారిగూడెం గ్రామం వద్ద మరో బైక్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతయ్యను పోలీసులు హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతయ్య వద్ధకే పోలీసులు వెళ్లి అతడిచ్చిన ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్‌ఐఆర్ కాపీని కాంతయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎఫ్‌ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా బాధితులకు సత్వర పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌ఐ తెలిపారు.


