నల్లగొండ టూటౌన్ : చండూరులో బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని గురువారం బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు వినతి పత్రం అందజేశారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ రోజున బీజేపీ జిల్లా అధ్యక్షులపై దాడి చేసిన నల్లగొండ డీఎస్పీపై, ఉగాది సందర్భంగా నల్లగొండలో బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా ఇన్‌చార్జ్ ఉదయ్ ప్రతాప్, పాశం శ్రీనివాస్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, పిన్నింటి నరేందర్‌రెడ్డి, శాంతిస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.


