తిరుమలగిరి(సాగర్): శ్రీరామనవమి సందర్భంగా తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలను శుక్రవారం రాత్రి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎద్దుల పందేలకు ఆదరణ పెరగడంతో ఎక్కడ పోటీలు నిర్వహించినా ఔత్సాహికులు అధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్న ఎద్దుల పందేలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో మార్కెట్ యార్డులో కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కాంసాని చంద్రశేఖర్, సర్పంచ్ పగడాల పున్నమ్మసైదులు, దేవస్థానం చైర్మన్ శాగం నాగిరెడ్డి, నాయకులు శాగం పెద్దిరెడ్డి, నాసర్‌రెడ్డి, డీఎస్పీ శంకర్‌రెడ్డి, చవ్వా బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


