● రూ.లక్ష ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
భువనగిరి : మండలంలోని వడపర్తి గ్రామం వద్ద సోమవారం ఆటోను డీసీఎం ఢీకొనడంతో బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన కేతమ్మ, ఆమె ఇద్దరు కుమారులు నరేష్, సురేష్ మృతిచెందారు. ముగ్గురి మృతదేహాలకు మంగళవారం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో బీఎన్ తిమ్మాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


