భూదాన్‌పోచంపల్లి : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తేనే తాము ఎంచుకొన్న లక్ష్యాన్ని సాధిస్తారని ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కన్‌ఫ్లూఝెన్స్–2026 వేడుకల్లో భాగంగా గురువారం రెండో రోజు విద్యార్థులకు స్పోర్ట్స్, అథ్లెటిక్స్, డ్యాన్స్, పాటలు, కవి సమ్మేళనం పోటీలతో పాటు ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సుచిత్ర చంద్రబోస్‌తో పాటు ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్, సినీ గాయని గీతామాధురి, సినీ గేయరచయిత అనంత్ శ్రీరాం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గడ్డం మోహన్‌రావు వ్యవహరించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సుచిత్ర చంద్రబోస్ మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్నవారు ఏ రంగంలోనైనా రాణించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు క్షణికావేశంలో తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంగా మార్చుకోవద్దని సూచించారు. యాంకర్ రష్మి గౌతమ్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాలని అన్నారు. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం మాట్లాడుతూ.. మహిళలు శక్తి స్వరూపిణి అని, వారికి సాధించే సామర్థ్యం ఉంటుందని అన్నారు. సింగర్ గీతామాధురి మాట్లాడుతూ.. చదువును మించిన ఆయుధం మరొకటి లేదని అన్నారు. ఆశ, ఆశయం ఉంటే విజయం మనదే అని పేర్కొన్నారు. సినిమాలను ఎంటర్‌టైన్‌మెంట్‌గానే చూడాలి తప్ప నిజజీవితానికి అన్వయించుకోద్దని సూచించారు. అనంతరం వారిని కళాశాల నిర్వాహకులు శాలువాలు కప్పి మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ విద్యాలయాల జాయింట్ సెక్రటరీ వీఎస్‌ఆర్ శర్మ, మల్టీజోనల్ అధికారి రజిని, స్టేట్ ఆఫీసర్ నిర్మల, జోనల్ అధికారిణి విద్యాంజలి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీలత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, అధ్యాపకులు, అధ్యాపకయేతర బృందం పాల్గొన్నారు.
మాట్లాడుతున్న
యాంకర్ రష్మి గౌతమ్
మాట్లాడుతున్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం
విద్యార్థులకు బహుమతులు
అందజేస్తున్న గాయని గీతామాధురి
ఫ సినీ కొరియోగ్రాఫర్
సుచిత్ర చంద్రబోస్
ఫ దేశ్‌ముఖిలోని సాంఘిక సంక్షేమ
సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాలలో స్పోర్ట్స్, కల్చరల్ మీట్
ఫ న్యాయ నిర్ణేతలుగా హాజరైన
సినీ ప్రముఖులు


