పెన్‌పహాడ్ : గంజాయి తరలిస్తున్న వ్యక్తులను గురువారం పెన్‌పహాడ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలంలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద పెన్‌పహాడ్ ఎస్‌ఐ గోపికృష్ణ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పెన్‌పహాడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు ఈశ్వర్, పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామానికి చెందిన బొమ్మకంటి గోపి, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన చింతల వెంకటేష్ స్కూటీపై అటుగా వెళ్తూ పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారు. స్కూటీని తనిఖీ చేయగా అందులో గంజాయి లభ్యమైంది. నాలుగు రోజుల క్రితం ఒడిశా సరిహద్దుల్లో రెండు కేజీల గంజాయి కొనుగోలు చేసి, అందులో కొంత వారు తాగి, మిగిలిన గంజాయిని సూర్యాపేటలో విక్రయించడానికి వెళ్తున్నట్లు పట్టుబడిన ముగ్గురు ఒప్పుకున్నారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, స్కూటీ, 1.700 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ గోపికృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
1.700 కేజీల గంజాయి, స్కూటీ,
రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం


