సమాన దూరంలో ట్రిపుల్‌ఆర్‌ నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

సమాన దూరంలో ట్రిపుల్‌ఆర్‌ నిర్మించాలి

Mar 28 2026 7:15 AM | Updated on Mar 28 2026 7:15 AM

చౌటుప్పల్‌ : ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు ఇష్టానుసారంగా కాకుండా సమాన దూరంలో నిర్మించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనల మేరకు కాకుండా ఒక ప్రాంతంలో 28కిలోమీటర్లు, మరో ప్రాంతంలో 50కిలోమీటర్ల దూరంలో నిర్మించడం ఏమాత్రం సరికాదన్నారు. శుక్రవారం ఆయన చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం సొమ్ముతో స్థానికంగా చిన్నపాటి ప్లాట్‌ను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. రైతులకు పరిహారంగా మూడు రెట్లు ఇవ్వాలని, లేకుంటే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సరైన పరిహారం చెల్లించి రైతులను అన్ని విధాలుగా ఒప్పించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు పల్లె శేఖర్‌రెడ్డి, బచ్చనగోని గాలయ్య, భాస్కర్‌, సుధాకర్‌, సంజీవ, రాములు, అంజయ్య, కృష్ణ, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement