ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్‌

Mar 23 2026 10:02 AM | Updated on Mar 23 2026 10:02 AM

సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత ఆరోపించించారు. ఆదివారం భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రజలను మరోసారి వంచించే విధంగా రేవంత్‌రెడ్డి సర్కార్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామన్న ప్రభుత్వం రెండు పంటలకు కూడా ఇవ్వలేకపోతుందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో రైతు బంధు పంటకాలంలో పెట్టుబడిగా రైతుల చేతికి అందిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు బీమాకు మంగళం పాడిందన్నారు. కరెంట్‌ కోతలతో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ మాత్రమే అని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, ఏవీ కిరణ్‌, రచ్చశ్రీనివాస్‌రెడ్డి, ఏనబోయిన ఆంజనేయులు, చెన్నామహేశ్‌, సుబ్బురు బీరు మల్లయ్య, అతికం లక్ష్మీనారాయణ గౌడ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement