యాదగిరిగుట్ట: యాదగిరి కొండపైకి వెళ్లేందుకు మొదటి ఘాట్ రోడ్ సమీపంలో జరుగుతున్న ఎంట్రీ ఫ్లై ఓవర్ పనులను కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై, ప్రస్తుతం పనులు ఏయే దశలో ఉన్నాయో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు సురక్షితంగా ప్రయాణించేలా పనులను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్‌అండ్‌బీ శాఖ అధికారి సరిత, సంబంధిత శాఖల అధికారులున్నారు.


