సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్ ఫార్మా కంపెనీలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో గ్యాస్ లీకై ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో నాగరాజు, అంజయ్య, వినోద్, లక్ష్మయ్య అనే నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద విషయంపై కంపెనీ యాజమాన్యం బయటకు రానివ్వడం లేదని కంపెనీ ఎదుట సమీప ప్రాంతాల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కాలుష్యంతో సమీప ప్రాంతాల వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శ్వాస సంబంధ వ్యాధులతో తరచూ అనారోగ్యం పాలవుతున్నామన్నారు. కంపెనీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఫ నలుగురు కార్మికులకు ఆస్వస్థత


