పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి

Mar 11 2026 9:21 AM | Updated on Mar 11 2026 9:21 AM

భువనగిరిటౌన్‌ : పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపాలిటీలోని సింగన్నగూడెంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావుతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, మిగిలిన పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట హౌసింగ్‌ ఏడీ శ్రీరాములు, సంబంధిత అధికారులు ఉన్నారు.

రేపు శిక్షణ కార్యక్రమం

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న సర్పంచులు, మున్సిపల్‌ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా కార్యక్రమంపై మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కార్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై గురువారం ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు భాస్కర్‌ రావు, వెంకారెడ్డి, అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement