Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Ap Police Rudely Against Yoga Teachers1
లోకేష్‌ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసు జులుం

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజూ కొనసాగింది. ఆ సమయంలో మంతత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్‌ చేస్తూ నిన్నటి నుంచి 1,056 మంది యోగా టీచర్లు సీఎం నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అయినా కలిచి తమ గోడును వినిపించాలని వాళ్లు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. యోగాసనాలు వేస్తూ నిరసనలతో లోకేష్‌ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. అయితే..ఇవాళ మళ్లీ నిరసనకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రి లోకేష్‌ ఆదేశాలతో పలువురిని అరెస్ట్‌ చేయగా.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమ వద్ద నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని, దురుసుగా ప్రవర్తించారని యోగా టీచర్లు వాపోయారు.

Actor Vijay Is TVK Official Chief Minister Candidate For TN Polls2
టీవీకే సీఎం అభ్యర్థిగా నటుడు విజయ్‌

తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌(Joseph Vijay Chandrasekhar) పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.శుక్రవారం ఉదయం చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయంలో విజయ్‌ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజయ్‌ పేరును సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అటుపై ఎన్నికల దాకా గ్రామగ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్‌ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది.అంతేకాదు.. తాజాగా అమిత్‌ షా చేసిన ఆంగ్ల భాష కామెంట్లు.. తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే పేర్కొంటూ ఖండించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. అలాగే.. ఎలక్టోరల్‌ రివిజన్‌ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీవీకే తప్పుబట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమేనని ఆరోపించింది.

Trump Big Beautiful Bill Impact on Millions Of NRIs3
ట్రంప్‌ మెగా బిల్లు: ఎన్నారైలకు బిగ్‌ అలర్ట్‌

ట్రంప్‌ కలల బిల్లు.. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్‌ సంతకం తర్వాతనీ ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నారైలపై ఎంతంగా ప్రభావం చూపించనుందో ఓ లుక్కేద్దాం.. నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్‌కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1% పన్ను విధించనున్నారు.నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది.అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడినవాళ్లు ఇంకా నగదు మార్గాన్నే నమ్ముకుంటున్నారనేది గుర్తించాల్సిన విషయం. ఉదాహరణకు.. నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది.భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లో తగ్గుదలబిగ్ బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful Bill) ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తానికే గణనీయంగా ఉండనుంది. రెమిటెన్స్ (Remittance) అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం.2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్‌లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం (inflation) పెరగడానికి దారితీయవచ్చు. అదే సమయంలో..రెమిటెన్స్‌లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ముఖ్యంగా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు. అయితే.. డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది.ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. వలసలకు ఇక గడ్డు కాలమే?ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు(Asylum Applications) భారీ రుసుములు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్‌లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్‌ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.పెట్టుబడి ప్రణాళికల్లో మలుపులు!కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్‌లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్‌తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్‌లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ(Rush) అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంప్లయన్స్ భారముఎన్నారైలు బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెచ్చి పెట్టింది. ఎటువంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే అవకాశం ఉంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై నియంత్రణ ఉంటుంది. తద్వారా పాస్‌పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే దానిపై మరింత పర్యవేక్షణ ఉంటుంది. పన్ను రీఫండ్‌లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి — NRIs కు కాదు. అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ ప్రయోజనాలను పొందలేరు.కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై (NRIs) కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ (compliance) భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు కాగితాలు, సమయం, ఖర్చు పెరుగుతాయి.ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్‌లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది. ఏంటీ బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు చెబుతున్నారాయన.పన్ను కోతలు2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది.కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.టిప్పులు, ఓవర్‌టైమ్‌పై పన్ను మినహాయింపుటిప్ ఆదాయం పై పన్ను రద్దు, ఓవర్‌టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపుపిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు.కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.1% రెమిటెన్స్ పన్నుఅమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్‌ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.వలస నియంత్రణ కఠినతరంICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలుతక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బసౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.లాభాలు ఎవరికీ?కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక శక్తి రంగం నష్టపోతాయి.ప్రతిపక్షాల అభ్యంతరాలుడెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును "సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం" అని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు.

Ktr Respond To Kcr Health Condition4
మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్‌

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. కేసీఆర్‌ ఆరోగ్యం బాగుందని చెప్పారు. బ్లడ్‌ షుగర్‌, సోడియం లెవల్స్‌ సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా నిన్న సాయంత్రం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండనున్నారని చెప్పారు. కేసీఆర్‌ ఆరోగ్యం గురించి ఆరాతీస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. Sri KCR garu was admitted in the hospital last evening for routine health checkups. Just to monitor his Blood sugar and low Sodium levels, his doctors have advised a few days of admissionNo serious health concerns at all. All his vitals are normalI thank all those who have…— KTR (@KTRBRS) July 4, 2025

Nithiin Starrer Thammudu Movie Review and Rating In Telugu5
తమ్ముడు మూవీ రివ్యూ

టైటిల్‌: తమ్ముడునటీనటులు: నితిన్‌, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్‌ తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్నిర్మాత : దిల్‌ రాజు, శిరీష్‌దర్శకత్వం: శ్రీరామ్‌ వేణుసంగీతం: అజనీష్‌ లోకనాథ్‌సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడివిడుదల తేది: జులై 4, 2025నితిన్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా ఏళ్లు అయింది. భారీ అంచనాలు పెట్టుకున్న రాబిన్‌ హుడ్‌ కూడా నితిన్‌ని నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో పవన్‌ కల్యాణ్‌ ఆల్‌ టైం సూపర్‌ హిట్‌ ‘తమ్ముడు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం నితిన్‌ని హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? లేదా? రివ్యూ (Thammudu Movie Review)లో చూద్దాం.కథజై (నితిన్‌) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేకపోతాడు. దానికి కారణం.. చిన్నప్పుడు తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ( లయ) విషయంలో చేసిన ఒక చిన్న తప్పు! ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది. అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్ర ( వర్ష బొల్లమ) తో కలిసి వైజాగ్‌ వస్తారు. అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగు జాతర వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో జై అక్కడికి వెళ్తాడు. అక్కడ బిజినెస్‌మెన్‌ అజార్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు? అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది? ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి? చివరకు అది నెరవేరిందా లేదా? అక్క విషయంలో జై చేసిన తప్పు ఏంటి? చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే...అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. చాలా రొటీన్ స్టోరీ. కానీ దర్శకుడు తనదైన స్క్రీన్‌ప్లేతో తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాకి కీలకమైన అక్క- తమ్ముడు సెంటిమెంట్‌ను ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతిదీ మన ఊహకి అందేలా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండకపోవడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి.ఫ్యాక్టరీ ప్రమాదం సన్నివేశంతో చాలా ఎమోషనల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. విలన్ పరిచయం సీన్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. భారీ ఎలివేషన్‌తో విలన్‌ను పరిచయం చేసి.. ఆ తరువాత కథని హీరో వైపు మళ్లించాడు. ఆర్చరీలో బంగారు పథకమే లక్ష్యం గా ఉన్న జై... అక్క విషయంలో చేసిన తప్పుని పదేపదే గుర్తు తెచ్చుకోవడం... కోచ్ చెప్పిన మాటతో అక్క కోసం వెళ్ళడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అంబరగొడుగు నేపథ్యం సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఊహించింది తెరపై జరుగుతుంటే కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వెల్ వరకు కథనం సోసోగానే సాగుతుంది. అజార్వాల్ గ్యాంగ్ నుంచి ఝాన్సీ ఫ్యామిలీని జై ఎలా రక్షించాడు? అనేదే సెకండాఫ్ స్టోరీ. అయితే మధ్య లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గా సాగుతుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్‌ సినిమాకు ప్లస్‌ పాయింట్‌గా నిలిచింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.ఎవరెలా చేశారంటే..జై పాత్రలో నితిన్ (Nithiin) చక్కగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. అయితే ఆయన ఈ సినిమాలో హీరో అనడం కంటే... కీలక పాత్రధారి అని చెప్పడం బెటర్. రత్నం పాత్రకి సప్తమి గౌడ న్యాయం చేసింది. ఝాన్సీగా లయ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. చిత్రగా వర్ష బొల్లమ్మ బాగా నటించింది. మిగతావాళ్లందరూ తమ పాత్రలతో మెప్పించారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Tamil Nadu Ajith Kumar Case Spine Chilling Details Out6
‘ఎంత నరకం అనుభవించాడో..’! పోస్టుమార్టం నివేదికలో షాకింగ్‌ విషయాలు

తమిళనాడులో సంచలనం రేపిన అజిత్‌ కుమార్‌ (29) కస్టడీ డెత్‌(Custodial Death) కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో విచారణ పేరుతో అజిత్‌ను పోలీసులు ఎంతగా చిత్రహింసలకు గురి చేసి చావుకి కారణం అయ్యారో తేటతెల్లమైంది.తమిళనాట సంచలనం సృష్టించిన అజిత్‌ కుమార్‌ కేసు పోస్టుమార్టం నివేదికలో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. భౌతికంగా అతనిపై పదే పదే అత్యంత పాశవికంగా పోలీసులు దాడి చేయడం వల్ల ముఖ్య అవయవాలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బల ధాటికి అంతర్గతంగా రక్తస్రావం జరిగి అజిత్‌ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఇండియాటుడే కథనం ప్రకారం.. అజిత్‌ కుమార్‌ మృతదేహంపై 44 గాయాలు ఉన్నాయి. అందులో 30 చోట్ల కండరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. గుండె, కాలేయంలో పెటెచియల్ హీమరేజ్‌లు (చిన్న రక్తస్రావ మచ్చలు) కనిపించాయి. ఇవి సాధారణంగా యాక్సిడెంట్‌లలో, ఉద్దేశపూర్వకంగా కొట్టిన సందర్భాల్లోనూ కనిపించవట. అలాంటిది.. అజిత్‌ ఒంట్లో ఈ మచ్చలు కనిపిస్తున్నాయంటే పోలీసులు ఎంతంగా హింసించారో అర్థవుతోంది.అలాగే బాటన్లు, రాడ్లు, కర్రలతో తల, ఇతర భాాగాలపై పదే పదే కొట్టడం వల్ల అజిత్‌కు బలంగా గాయాలయ్యాయి. మెదడుతో పాటు అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తల చర్మం కింద గాయాలు (సబ్‌స్కాల్ప్ కంట్యూషన్స్), పుర్రెపై నీలిమచ్చలు (ఎక్కైమోసిస్), అలాగే రెండు సెరిబ్రల్ లోబుల్లో రక్తస్రావం (హీమరేజ్) అయ్యింది. కళ్లు, ముక్కు, నోరు, చెవులు, ప్రైవేట్‌ భాగాల్లో కారం చల్లినట్లు ఆనవాలు లభించాయి. ఈ పోస్టుమార్టం నివేదికను బట్టి అజిత్‌ కుమార్‌ను పోలీసులు ఉద్దేశపూర్వకంగా.. అత్యంత క్రూరంగా హింసించారో స్పష్టమవుతోందని నివేదిక పేర్కొంది. ఏం జరిగిందంటే.. తమిళనాడు శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపం మడపురంలోని ప్రసిద్ధ భద్రకాళియమ్మన్‌ ఆలయానికి జూన్‌ 27న వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు.. కారులో ఉంచిన తమ నగలు, డబ్బు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆలయంలో వెళ్లే ముందు కారు తాళాలను ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న అజిత్‌కుమార్‌(27)కి ఇచ్చామని, అతని మీదే అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు విచారణ పేరుతో అతన్ని పిలిపించుకుని ప్రశ్నించి వదిలేశారు. ఆ మరుసటిరోజు కూడా రమ్మని చెప్పి.. పీఎస్‌కు కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో తానే దొంగించానని అజిత్‌ అబద్ధం చెప్పాడు. నగలు ఎక్కడ దాచానో చూపించానని ఆలయానికి తీసుకెళ్లి.. అక్కడ పోలీసుల కాళ్ల మీద పడి తాను తప్పు చేయలేదని, వదిలేయాలని వేడుకున్నాడు. కానీ, పోలీసులు అతన్ని మళ్లీ టార్చర్‌ చేశారు. అజిత్‌ అపస్మారక స్థితిలోకి జారుకోగా.. చెన్నై ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.బాధిత కుటుంబాన్ని ఓదార్చిన విజయ్‌ఈ ఘటన ప్రజాగ్రహానికి కారణమైంది. ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడం కలకలం రేపింది. నెట్టింట ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అజిత్ కుమార్ కస్టడీ మృతి కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు కూడా ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి: “ఇది స్టాలిన్ పాలనలో పోలీసు అరాచకానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి ఓదార్చారాయన. మరోవైపు శివగంగై ఉదంతంపై నిరసనకు టీవీకే పార్టీకి పోలీసులు అనుమతించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ. ఈ ఘటన ఇటు తమిళనాడుతో పాటు అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసు తీవ్రత దృష్ట్యా CB-CID నుంచి CBIకి బదిలీ చేశారు. పోలీసుల చర్య క్షమించరానిదని పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ (MK Stalin).. దర్యాప్తులో ఎటువంటి సందేహాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అజిత్ కుటుంబానికి ₹50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, భూమి మంజూరు చేశారు. ఈ ఘటనపై జులై 8వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రమే తన పౌరుడిని చంపింది అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. నాకు భద్రత ఇవ్వండిఅజిత్‌ కుమార్‌ను ఆలయానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులు జరిపిన దాడిని అక్కడి ఉద్యోగి శక్తీశ్వరన్‌ రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోనే విపరీతంగా వైరల్‌ అయ్యింది. అంతేకాదు ఈ కేసులో ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షి కూడా ఆ ఉద్యోగినే. దీంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనకు భద్రత కల్పించాలని కోరుతున్నారాయన. అరెస్టైన పోలీసుల్లో ఒకరు గుండాలతో, రౌడీ షీటర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతని నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ శక్తీశ్వరన్‌ డీజీపీకి లేఖ రాశారు.#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025

Good news for central government employees 4 percent DA will hike7
ఉద్యోగులకు త్వరలో తీపికబురు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరువు భత్యం (డీఏ) 4 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 59 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రానుండగా ఆగస్టు లేదా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పండుగ సీజన్‌కు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.సీపీఐ డేటా ఆధారంగా..డీఏ లెక్కింపునకు ఆధారమైన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) 2025 మేలో 0.5 పాయింట్లు పెరిగి 144కు చేరింది. గత మూడు నెలల్లో సూచీ స్థిరమైన పెరుగుదలను చూపించింది. ఇది మార్చిలో 143, ఏప్రిల్లో 143.5, మేలో 144గా ఉంది. ఇండెక్స్ ఇదే జోరును కొనసాగించి జూన్‌లో 144.5కు పెరిగితే ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ 12 నెలల సగటు 144.17కు చేరుకుంటుందని అంచనా. 7వ వేతన సంఘం ఫార్ములాను ఉపయోగించి డీఏను సర్దుబాటు చేసినప్పుడు ఇది సుమారు 58.85% రేటుగా మారుతుంది. దాంతో 2025 జులై నుంచి 59 శాతం డీఏకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: పాత వాహనాలపై నిషేధం ఎత్తివేత7వ వేతన సంఘం డీఏ పెంపు ఫార్ములాడియర్నెస్ అలవెన్స్‌ను ఏడాదికి రెండుసార్లు జనవరి, జులైలో సవరిస్తారు. గత 12 నెలల్లో ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ డేటా సగటు ఆధారంగా ఈ డీఏను లెక్కిస్తారు. ఇందుకోసం ఉపయోగించే ఫార్ములా కింది విధంగా ఉంటుంది.డీఏ(%) = [(గత 12 నెలల సగటు సీపీఐ ఐడబ్ల్యూ- 261.42)/261.42]*100దాని ప్రకారం..డీఏ(%) = [(144.17-261.42)/261.42]*100=58.85 శాతం.ఇక్కడ, 261.42ను గతేడాది గణాంకాల ప్రకారం లెక్కింపునకు మూల విలువగా పరిగణిస్తారు. పై ఫ్యార్ములాలో మైనస్‌ వ్యాల్యూ వస్తుంది. దీన్ని సవరించి దనాత్మకంగా లెక్కిస్తారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఈసారి డీఏ పెరుగుదలను 4 శాతంగా అంచనా వేశారు.

Even after scoring 269 runs, Yograj Singh is unhappy with Shubman Gill8
ఇలాంటి తప్పెలా చేశావు గిల్‌?.. యువీ తండ్రి అసంతృప్తి!

టీమిండియా కెప్టెన్‌, డ‌బుల్ సెంచూరియాన్ శుబ్‌మ‌న్ గిల్‌( Shubman Gill)పై మాజీ క్రికెటర్‌ యువ‌రాజ్ తండ్రి యోగ‌రాజ్ ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశాడు. ఎడ్జ్ బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో గిల్ ట్రిపుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశం కోల్పోవడం ప‌ట్ల యోగ‌రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఈ మ్యాచ్‌లో గిల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 269 ప‌రుగులు చేశాడు. తన మొదటి ట్రిపుల్ సెంచరీకి 31 ప‌రుగుల దూరంలో శుబ్‌మ‌న్ నిలిచిపోయాడు. ఇంగ్లండ్ పేస‌ర్ జోష్ టాంగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి త‌న వికెట్‌ను కోల్పోయాడు."యువ‌రాజ్ సింగ్(Yuvraj Singh) త‌న కెరీర్‌లో ఏమి సాధించాడో, దానిని ఆట‌గాళ్ల‌కు శిక్ష‌ణ రూపంలో అందించ‌డం చాలా సంతోషంగా ఉంది. శుబ్‌మ‌న్ గిల్‌, అభిషేక్ శ‌ర్మ‌, అర్ష‌దీప్ సింగ్ వంటి యువ ఆట‌గాళ్లను యువ‌రాజ్ త‌న శిక్ష‌ణ‌తో రాటుదేల్చాడు. ఈ మ్యాచ్‌లో శుబ్‌మ‌న్ 200 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను 250 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండాలని నేను కోరుకున్నాను.250 ప‌రుగుల మార్క్ చేరుకున్నాక ట్రిపుల్ సెంచ‌రీ చేసి ఆజేయంగా ఉండాల‌ని ఆశించాను. కానీ గిల్ అంత‌లోనే గిల్ ఔట్ కావ‌డంతో నేను బాధ‌ప‌డ్డాను. యువ‌రాజ్ కూడా నిరాశ‌చెందాడు. అంత‌ భారీ స్కోర్ సాధించాక అలా ఔట్ కావ‌డం పెద్దం నేరం. రెండు వందులు అవ్వొచ్చు, మూడు వంద‌లు అవ్చొచ్చు ఏదైనా కానీ నాటౌట్‌గా ఉంటే మ‌న త‌ప్పిదాల‌ను సరిదిద్దుకోవ‌చ్చు.ఇక శుబ్‌మ‌న్ గిల్ కోసం చాలా మంది చాలా విష‌యాలు మాట్లాడారు. వారంద‌రికి ఒక్క విష‌యం చెప్పాల‌నకుంటున్నాను. దయచేసి మీరు క్రికెటర్ కాక‌పోతే, ఆ విష‌యం గురించి మాట్లాడకండి. గిల్ ఒక టాప్ క్లాస్ ప్లేయ‌ర్. గిల్‌కు 400 పరుగులు చేసే సత్తా కూడా ఉంది" అని ఎన్ఐకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యోగ‌రాజ్ పేర్కొన్నాడు.చదవండి: 'ఇదంతా అత‌డి వ‌ల్లే'.. గిల్‌ డబుల్‌ సెంచరీ వెనక మాస్టర్‌ మైండ్‌

Lalit Modi Vijay Mallya singing together Video Viral9
ఇంటర్నెట్‌ను ఈ వీడియో కుదిపేయకపోతే మంచిదే!

విజయ్‌ మాల్యా-లలిత్‌ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు. ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక నేరగాళ్లుగా పరాయి దేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తులు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ పార్టీలో తెగ ఎంజాయ్‌ చేస్తూ గడిపిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. I Did It My Way అంటూ అలనాటి అమెరికన్‌ సింగర్‌ ఫ్రాంక్ సినాత్రా(Frank Sinatra) పాడిన ప్రసిద్ధ గీతాన్ని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ-పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కలిసి ఆలపించారు. లండన్‌లో గత ఆదివారం తన నివాసంలో లలిత్‌ మోదీ ఇచ్చిన పార్టీలో ఇది జరిగింది. ఈ విలాసవంతమైన పార్టీ వీడియోను ఈ వీడియోను లలిత్ మోదీ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పైగా ముందుగానే ఏం జరుగుతుందో ఊహిస్తూనే.. “Controversial for sure. But that’s what I do best” అంటూ సందేశం ఉంచారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను లలిత్‌ మోదీ తన నివాసంలోనే నిర్వహించారట. ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని ఆయన తెలిపారు. వాళ్లలో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్ గేల్ కూడా ఉన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను కుదిపేయకపోతే మంచిదే. వివాదాస్పదమైతే ఏముంది... అదే నా స్టైల్! అంటూ లలిత్‌ మోదీ చివర్లో సందేశం ఉంచారు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi)గేల్‌ గతంలో ఐపీఎల్‌ ఆర్సీబీ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. గేల్‌ సైతం తన మాజీ బాస్‌లు లలిత్‌ మోదీ, మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “We living it up. Thanks for a lovely evening” అని రాశారు. లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్‌కు కావలసిన నిందితుడు. 2017లో లండన్‌లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ ఇద్దరూ చట్టపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ.. తరచూ ఇలా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తుండడం, పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తుండడం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

Modi calls Trinidad and Tobago PM Bihar ki Beti for her Buxar roots10
ఎవరా 'బీహార్‌ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్‌ ప్రధానికి ప్రత్యేక స్థానం

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్‌ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్‌ ఆప్‌ స్పెయిన్‌లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్‌ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్‌(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్‌ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్‌ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్‌కి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఆ విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఈ కరేబియన్‌ దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్‌ కా భేటి అని సగర్వంగా చెప్పారు. ఆ ప్రధాని పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ఆ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. స్నేహం చిగురించింది ఇలా..అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్‌లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్‌(సంగీతం), భైతక్‌(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు. ఇక​ ఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917ల మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్‌ జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్‌ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అ‍న్నారు.ఎవరీ కమలా పెర్సాద్‌..కమలా పెర్సాద్‌ బిస్సేసర్‌ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.ఇక ఈ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో భారతదేశంలోని జోధ్‌పూర్‌ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago... We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c— ANI (@ANI) July 4, 2025 (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement