
400 పరుగులు చేయగల సత్తా నీకుంది: యోగ్‌రాజ్
టీమిండియా కెప్టెన్, డబుల్ సెంచూరియాన్ శుబ్‌మన్ గిల్( Shubman Gill)పై మాజీ క్రికెటర్ యువరాజ్ తండ్రి యోగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం పట్ల యోగరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో గిల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269 పరుగులు చేశాడు. తన మొదటి ట్రిపుల్ సెంచరీకి 31 పరుగుల దూరంలో శుబ్‌మన్ నిలిచిపోయాడు. ఇంగ్లండ్ పేసర్ జోష్ టాంగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు.
"యువరాజ్ సింగ్(Yuvraj Singh) తన కెరీర్‌లో ఏమి సాధించాడో, దానిని ఆటగాళ్లకు శిక్షణ రూపంలో అందించడం చాలా సంతోషంగా ఉంది. శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లను యువరాజ్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ 200 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను 250 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండాలని నేను కోరుకున్నాను.
250 పరుగుల మార్క్ చేరుకున్నాక ట్రిపుల్ సెంచరీ చేసి ఆజేయంగా ఉండాలని ఆశించాను. కానీ గిల్ అంతలోనే గిల్ ఔట్ కావడంతో నేను బాధపడ్డాను. యువరాజ్ కూడా నిరాశచెందాడు. అంత భారీ స్కోర్ సాధించాక అలా ఔట్ కావడం పెద్దం నేరం. రెండు వందులు అవ్వొచ్చు, మూడు వందలు అవ్చొచ్చు ఏదైనా కానీ నాటౌట్‌గా ఉంటే మన తప్పిదాలను సరిదిద్దుకోవచ్చు.
ఇక శుబ్‌మన్ గిల్ కోసం చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. వారందరికి ఒక్క విషయం చెప్పాలనకుంటున్నాను. దయచేసి మీరు క్రికెటర్ కాకపోతే, ఆ విషయం గురించి మాట్లాడకండి. గిల్ ఒక టాప్ క్లాస్ ప్లేయర్. గిల్‌కు 400 పరుగులు చేసే సత్తా కూడా ఉంది" అని ఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.
చదవండి: 'ఇదంతా అతడి వల్లే'.. గిల్ డబుల్ సెంచరీ వెనక మాస్టర్ మైండ్