
ముంబై క్రికెట్ ఆసోయేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేదం ఎదుర్కొన్న మాజీ క్రికెటర్ అంకిత్ చవాన్(Ankeet Chavan)ను తమ అండర్-14 జట్టు ప్రధాన కోచ్‌గా ఎంసీఎ నియమించింది. ఐపీఎల్-2013 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడినప్పుడు అజిత్ చండిలా, ఎస్ శ్రీశాంత్‌తో పాటు చవాన్ స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డాడు.
దీంతో అతడిపై బీసీసీఐ(BCCI) జీవితకాల నిషేదం విధించింది. కానీ 2021లో చవాన్ పై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఏడు సంవత్సరాలకు తగ్గించింది. దీంతో అతడు తిరిగి క్రికెట్‌లో వచ్చేందుకు అవకాశం లభించింది. అంకిత్ ప్రస్తుతం ముంబైలో కర్ణాటక స్పోర్ట్స్ క్లబ్ తరపున క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు.
ఈ క్రమంలో లెవల్-1 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో.. ఇప్పుడు ముంబై అండర్-14 హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాడు. చవాన్ తన కెరీర్‌లో 18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 20 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 13 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. హెడ్‌కోచ్‌గా ఎంపికైన అనంతరం చవాన్ స్పందించాడు.
"నాకు ఇది రెండో ఇన్నింగ్స్. నా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చేంందుకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. నాపై నమ్మకం ఉంచినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
కోచింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. అండర్-14 స్థాయిలో, ఆటగాళ్ల ఆటను మెరుగుపరచడంలో నావంతు కృషి చేస్తాను" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చవాన్ పేర్కొన్నాడు. మరోవైపు ముంబై సీనియర్ జట్టు హెడ్‌కోచ్‌గా ఓంకార్ సాల్వి కొనసాగనున్నాడు.
చదవండి: IND vs ENG: ఇలాంటి తప్పెలా చేశావు గిల్?.. యువీ తండ్రి అసంతృప్తి!