breaking news
ankeet chavan
-
12 ఏళ్ల కిందట స్పాట్ ఫిక్సింగ్.. కట్ చేస్తే! ఇప్పుడు ఆ జట్టు హెడ్ కోచ్‌గా
ముంబై క్రికెట్ ఆసోయేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేదం ఎదుర్కొన్న మాజీ క్రికెటర్ అంకిత్ చవాన్(Ankeet Chavan)ను తమ అండర్-14 జట్టు ప్రధాన కోచ్‌గా ఎంసీఎ నియమించింది. ఐపీఎల్-2013 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడినప్పుడు అజిత్ చండిలా, ఎస్ శ్రీశాంత్‌తో పాటు చవాన్ స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డాడు.దీంతో అతడిపై బీసీసీఐ(BCCI) జీవితకాల నిషేదం విధించింది. కానీ 2021లో చవాన్ పై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఏడు సంవత్సరాలకు తగ్గించింది. దీంతో అతడు తిరిగి క్రికెట్లో వచ్చేందుకు అవకాశం లభించింది. అంకిత్ ప్రస్తుతం ముంబైలో కర్ణాటక స్పోర్ట్స్ క్లబ్ తరపున క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు.ఈ క్రమంలో లెవల్-1 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో.. ఇప్పుడు ముంబై అండర్-14 హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాడు. చవాన్ తన కెరీర్లో 18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 20 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 13 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. హెడ్‌కోచ్‌గా ఎంపికైన అనంతరం చవాన్ స్పందించాడు."నాకు ఇది రెండో ఇన్నింగ్స్. నా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చేంందుకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. నాపై నమ్మకం ఉంచినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.కోచింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. అండర్-14 స్థాయిలో, ఆటగాళ్ల ఆటను మెరుగుపరచడంలో నావంతు కృషి చేస్తాను" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చవాన్ పేర్కొన్నాడు. మరోవైపు ముంబై సీనియర్ జట్టు హెడ్‌కోచ్‌గా ఓంకార్ సాల్వి కొనసాగనున్నాడు.చదవండి: IND vs ENG: ఇలాంటి తప్పెలా చేశావు గిల్?.. యువీ తండ్రి అసంతృప్తి! -
'ఆ క్రికెటర్లపై నిషేధాన్ని తొలగించం'
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషులుగా బయటపడిన క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ పునరాగమన ఆశలపై బీసీసీఐ నీళ్ల చల్లింది. వీరిపై అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించబోమని బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని వెల్లడించింది. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్, చవాన్ బోర్డు జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చండీలాపై ఆరోపణలు బోర్డు ఇంకా విచారిస్తోంది. కాగా ఇటీవల ఢిల్లీ కోర్టు ఈ ముగ్గురు ఆటగాళ్లతో సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో మళ్లీ క్రికెట్ ఆడాలనే కోరికను నిషేధిత ఆటగాళ్లు వ్యక్తం చేశారు. శ్రీశాంత్‌పై నిషేధం తొలగించాలని కేరళ క్రికెట్ సంఘం బీసీసీకి విన్నవించింది. అయితే శ్రీశాంత్, చవాన్లపై నిషేధం ఎత్తివేసే ప్రశ్నలేదని బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ స్పష్టం చేశారు. బీసీసీఐ క్రమశిక్షణ సంఘం తీసుకున్న నిషేధిత నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు. చట్టపరమైన చర్యలకు, బోర్డు క్రమశిక్షణ చర్యలకు సంబంధం లేదని ఠాకూర్ అన్నారు. -
అగాధానికి... అంకిత్ చవాన్
27 ఏళ్ల చవాన్ 2008-09 సీజన్లో తొలిసారిగా ముంబై జట్టు తరఫున కెరీర్‌ను ఆరంభించాడు. 2012-13 సీజన్లో ముంబై 40వ సారి రంజీ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర వహించి నంబర్‌వన్ స్పిన్నర్‌గా మారాడు. పంజాబ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 23 పరుగులకు 9 వికెట్లు తీసిన చవాన్‌ను సచిన్ సైతం ప్రశంసించాడు. దేశవాళీ వన్డే, టి20ల్లో ముంబై తరఫున కచ్చితంగా ఆడేవాడు. దీంతో ఐపీఎల్ తొలి సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడినా 2011 నుంచి రాజస్థాన్ జట్టుతో ఉన్నాడు. -
స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్, చవాన్లపై జీవితకాల నిషేధం
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది. స్పీడ్‌స్టర్, బ్రేక్ డాన్సర్ ఎస్.శ్రీశాంత్, అంకిత్ చవాన్ ఇద్దరిపైనా బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. క్రికెట్ మ్యాచ్‌లను స్పాట్ ఫిక్సింగ్ చేసినందుకు వీరిద్దరిపైనా శాశ్వతంగా వేటు వేశారు. ఇక ఇదే కేసులో అమిత్ సింగ్‌పై ఐదేళ్ల నిషేధం, అలాగే మరో క్రికెటర్ సిద్దార్థ త్రివేదిపై ఏడాది నిషేధం విధించారు. హర్మీత్ సింగ్‌ను పూర్తిగా విడిచిపెట్టగా.. అజిత్ చండిలా విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.