
మేజర్ లీగ్ క్రికెట్-2025 టోర్నీలో ఎంఐ న్యూయర్క్(MI New York) తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం ఫ్లోరిడా వేదికగా లాసెంజెల్స్ నైట్‌రైడర్స్‌తో జరిగిన డూఆర్‌డై మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూయర్క్ టీమ్ ఘన విజయం సాధించింది.
ఈమ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కరేబియన్ ఆటగాడు 44 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా రూథర్‌ఫోర్డ్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. మిగితా నైట్‌రైడర్స్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూయర్క్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు పొలార్డ్ రెండు, ఇషాన్ అదిల్, కెంజిగె చెరో వికెట్ తీశారు. అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని న్యూయర్క్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.
ఓపెనర్ మోనాంక్ పటేల్ (56), కెప్టెన్ నికోలస్ పూరన్ (62 నాటాట్) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. నైట్‌రైడర్స్ బౌలర్లు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు. ఎంఐ న్యూయర్క్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లో గెలిచి రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా సీటెల్ ఓర్కాస్ టీమ్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అప్పుడే పూరన్ సేన నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.