
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో ఇవాళ (జులై 10) రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎం న్యూయార్క్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఎంఐ చివరి ఓవర్‌లో గట్టెక్కి ఛాలెంజర్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడిన యూనికార్న్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది.
డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో (4-0-19-2) అదరగొట్టిన బౌల్ట్, ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి ఎంఐను విజయతీరాలకు చేర్చాడు.
THE FINISHER OF MI NEW YORK - TRENT BOULT 🥶
- 22*(13) in the Eliminator in MLC...!!!! pic.twitter.com/vKw5wcr8aD— Johns. (@CricCrazyJohns) July 10, 2025
132 పరుగుల స్వల్ప ఛేదనలో 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బౌల్ట్.. 13 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 22 పరుగులు చేసి ఎంఐని గెలిపించాడు. ఈ ప్రదర్శనలకు గానూ బౌల్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. జులై 11న జరిగే ఛాలెంజర్ మ్యాచ్‌లో ఎంఐ టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.
మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. వర్షం దోబూచుల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఎంఐ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌల్ట్ సహా రుషిల్ ఉగార్కర్ (3.1-0-19-3), కెంజిగే (4-0-43-2), ట్రిస్టన్ లూస్ (4-0-32-1), పోలార్డ్ (2-0-11-1) రాణించడంతో యూనికార్న్స్‌ను 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ చేసింది.
62 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన చేతులెత్తేసిన యూనికార్న్స్‌ను జేవియర్ బార్ట్‌లెట్ (44), బ్రాడీ కౌచ్ (19) ఆదుకొని గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరి మినహా యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో కూపర్ కన్నోలీ (23), హమ్మద్ ఆజమ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ఎంఐ తొలుత ఆడుతూ పాడుతూ విజయం సాధించేలా కనిపించింది. అయితే మాథ్యూ షార్ట్ (4-0-22-3), హసన్ ఖాన్ (4-0-30-4) ఒక్కసారిగా విజృంభించడంతో కష్టాల్లో పడింది. 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
గెలుపుకు ఇంకా 25 పరుగులు కావాల్సిన తరుణంలో బౌల్ట్ బ్యాట్ ఝులిపించి ఎంఐను విజయతీరాలకు చేర్చాడు. అతనికి లూస్ (8), కెంజిగే (3 నాటౌట్) సహకరించారు. ఎంఐ ఇన్నింగ్స్‌లో మొనాంక్ పటేల్ (33), డికాక్ (33) రాణించారు. పూరన్ (1), పోలార్డ్ (5) విఫలమయ్యారు.