breaking news
MI New York
-
ఎంఎల్సీ ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. ఫైనల్లో మ్యాక్స్‌వెల్ సేన చిత్తు
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్ విజేతగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ అవతరించింది. డల్లాస్ వేదికగా ఇవాళ (జులై 14) జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ వాషింగ్టన్ ఫ్రీడంను 5 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఎంఎల్‌సీలో ఎంఐకు ఇది రెండో టైటిల్. 2023 సీజన్లో ఈ జట్టు తొలిసారి టైటిల్ చేజిక్కించుకుంది. ఓవరాల్‌గా పొట్టి క్రికెట్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ఇది 13వ టైటిల్.ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు సాధించిన టీ20 టైటిళ్లు..MI CLT20 2011 విజేతMI IPL 2013 విజేతMI CLT20 2013ని గెలుచుకుందిMI IPL 2015ను గెలుచుకుందిMI IPL 2017ను గెలుచుకుందిMI IPL 2019 గెలిచుకుందిMI IPL 2020ని గెలుచుకుందిMI WPL 2023ని గెలుచుకుందిMINY 2023లో MLC గెలుచుకుందిMIE ILT20 2024 గెలుచుకుందిMICT SA20 2025 గెలుచుకుందిMI WPL 2025ని గెలుచుకుందిMINY MLC 2025 గెలుచుకుందిఈ సీజన్లో ఎంఐ న్యూయార్క్ నికోలస్ పూరన్ నేతృత్వంలో బరిలోకి దిగింది. పూరన్ ఎంఐ ఫ్రాంచైజీల తరఫున మూడో టైటిల్ సాధించాడు. ఎంఐ ఫ్రాంచైజీలకు అత్యధిక టైటిళ్లు అందించిన ఘనత రోహిత్ శర్మకు దక్కుతుంది. రోహిత్ ముంబై ఇండియన్స్‌కు 6 టైటిళ్లు అందించాడు. హర్మన్‌ప్రీత్ కౌర్ 2, రషీద్ ఖాన్, హర్భజన్ సింగ్ ఎంఐ ఫ్రాంచైజీలకు తలో టైటిల్ అందించారు. ఈ సీజన్లో వెటరన్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఎంఐ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. పోలార్డ్‌కు ఆటగాడిగా ఇది 17వ టీ20 టైటిల్. ప్రపంచ క్రికెట్లో పోలార్డ్, డ్వేన్ బ్రావో మాత్రమే ఆటగాళ్లుగా 17 టైటిళ్లు సాధించారు.కాగా, ఈ సీజన్లో ఎంఐ అనూహ్య రీతిలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి, చివరికి టైటిల్‌నే సొంతం చేసుకుంది. అదృష్టం కొద్ది ప్లే ఆఫ్స్‌కు చేరిన ఎంఐ.. వరుసగా ఎలిమినేటర్, ఛాలెంజర్, ఫైనల్లో విజయాలు సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ ఏడాది ఎంఐ ఫ్రాంచైజీలకు ఇది మూడో టీ20 టైటిల్. ఈ యేడు ఎంఐ సౌతాఫ్రికా టీ20 లీగ్, మహిళల ఐపీఎల్, తాజాగా మేజర్ లీగ్ క్రికెట్ టైటిళ్లను సాధించింది.ఫైనల్ విషయానికొస్తే.. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డికాక్ (77) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటి ఎంఐకి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఎంఐ ఇన్నింగ్స్‌లో మొనాంక్ పటేల్ 28, తజిందర్ డిల్లాన్ 14, పూరన్ 21, పోలార్డ్ 0, బ్రేస్‌వెల్ 4, కన్వర్జీత్ సింగ్ 22 (నాటౌట్), ట్రిస్టన్ లస్ 2, బౌల్ట్ 1 (నాటౌట్) పరుగులు చేశాడు. వాషింగ్టన్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 3, నేత్రావల్కర్, మ్యాక్స్‌వెల్, జాక్ ఎడ్వర్డ్స్, హోలాండ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్ చివరి వరకు గెలుపు కోసం పోరాడింది. రచిన్ రవీంద్ర (70), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్), జాక్ ఎడ్వర్డ్స్ (33) వాషింగ్టన్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. చివరి ఓవర్లో వాషింగ్టన్ గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. 22 ఏళ్ల కుర్ర పేసర్ రుషి ఉగార్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాక్స్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లను సైలెంట్ చేసి ఎంఐకి అద్భుత విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో ఉగార్కర్ మ్యాక్స్‌వెల్‌ను (15) ఔట్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా ఎంఐ రెండోసారి ఛాంపియన్‌షిప్‌ను చేజిక్కించుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో మిచెల్ ఓవెన్, ఆండ్రియస్ గౌస్ డకౌటై నిరాశపరిచారు. ఎంఐ బౌలర్లలో బౌల్ట్, ఉగార్కర్ తలో 2 వికెట్లు తీయగా.. కెంజిగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
పొలార్డ్ విధ్వంసం.. దంచికొట్టిన పూరన్.. ఫైనల్లో ఎంఐ న్యూయార్క్
మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC) టోర్నమెంట్లో ఎంఐ న్యూయార్క్ జట్టు ఫైనల్ చేరింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ టీ20 టోర్నీ చాలెంజర్ మ్యాచ్‌లో భాగంగా శనివారం ఎంఐ న్యూయార్క్- టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్ ఆదిలోనే ఓపెనర్ స్మిత్ పాటిల్ (9) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయితేజ ముక్కామల్ల (1).. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభమ్ రంజానే (1), మార్కస్ స్టొయినిస్ (6) పెవిలియన్‌కు వరుస కట్టారు.రాణించిన డుప్లెసిస్..బ్యాట్ ఝులిపించిన అకీల్ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf Du Plesis) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 42 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో రాణించాడు. అతడికి తోడుగా స్పిన్నర్ అకీల్ హుసేన్ బ్యాట్ ఝులిపించాడు.కేవలం 32 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అకీల్ నాటౌట్‌గా నిలవగా.. డొనొవాన్ ఫెరీరా (20 బంతుల్లో 32 నాటౌట్) దంచికొట్టాడు. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది.ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో ట్రిస్టస్ లస్ మూడు వికెట్లు కూల్చగా.. రుషిల్ ఉగార్కర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ ఆరంభంలోనే క్వింటన్ డి కాక్ (6) రూపంలో కీలక వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ మైకేల్ బ్రేస్‌వెల్ (8) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.పూరన్ ధనాధన్‌ఈ క్రమంలో మరో ఓపెనర్ మోనాంక్ పటేల్ (49) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. నికోలస్ పూరన్ (Nicholas Pooran) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 36 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 52 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. Pooran goes down the ground. Pooran goes out of the ground. 🙌#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/MWrsE5HOyC— MI New York (@MINYCricket) July 12, 2025పొలార్డ్ విధ్వంసంమరోవైపు.. సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సూపర్ కింగ్స్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. సునామీ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు- 47 పరుగులు)తో విరుచుకుపడి.. పూరన్‌తో కలిసి ఎంఐ న్యూయార్క్‌ను విజయతీరాలకు చేర్చాడు. పూరన్, పొలార్డ్ ధనాధన్ దంచికొట్టడంతో 19 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఎంఐ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా మేజర్ లీగ్ క్రికెట్లో రెండోసారి ఫైనల్ల్లో అడుగుపెట్టింది.DeathTaxesPollard smashing it 🆚 the Super Kings 💥#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/qdvYfEWnnm— MI New York (@MINYCricket) July 12, 2025 కాగా టెక్సాస్ సూపర్ కింగ్స్- వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరగాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో టెక్సాస్ జట్టు (14)తో పోలిస్తే పాయింట్ల పరంగా మెరుగ్గా ఉన్న వాషింగ్టన్ (16) నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో చాలెంజర్ రూపంలో సూపర్ కింగ్స్‌కు మరో అవకాశం లభించగా.. ఎంఐ జట్టు చేతిలో భంగపాటే ఎదురైంది.మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన ఎంఐ న్యూయార్క్ జట్టు.. తాజాగా సూపర్ కింగ్స్‌పై కూడా గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డల్లాస్‌లో ఆదివారం (జూలై 13) టైటిల్ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
రసవతర్త పోరులో ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన బౌల్ట్
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో ఇవాళ (జులై 10) రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎం న్యూయార్క్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఎంఐ చివరి ఓవర్లో గట్టెక్కి ఛాలెంజర్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడిన యూనికార్న్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది.డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో (4-0-19-2) అదరగొట్టిన బౌల్ట్, ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి ఎంఐను విజయతీరాలకు చేర్చాడు. THE FINISHER OF MI NEW YORK - TRENT BOULT 🥶- 22*(13) in the Eliminator in MLC...!!!! pic.twitter.com/vKw5wcr8aD— Johns. (@CricCrazyJohns) July 10, 2025132 పరుగుల స్వల్ప ఛేదనలో 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బౌల్ట్.. 13 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 22 పరుగులు చేసి ఎంఐని గెలిపించాడు. ఈ ప్రదర్శనలకు గానూ బౌల్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. జులై 11న జరిగే ఛాలెంజర్ మ్యాచ్‌లో ఎంఐ టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. వర్షం దోబూచుల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఎంఐ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌల్ట్ సహా రుషిల్ ఉగార్కర్ (3.1-0-19-3), కెంజిగే (4-0-43-2), ట్రిస్టన్ లూస్ (4-0-32-1), పోలార్డ్ (2-0-11-1) రాణించడంతో యూనికార్న్స్‌ను 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ చేసింది. 62 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన చేతులెత్తేసిన యూనికార్న్స్‌ను జేవియర్ బార్ట్లెట్ (44), బ్రాడీ కౌచ్ (19) ఆదుకొని గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరి మినహా యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో కూపర్ కన్నోలీ (23), హమ్మద్ ఆజమ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ఎంఐ తొలుత ఆడుతూ పాడుతూ విజయం సాధించేలా కనిపించింది. అయితే మాథ్యూ షార్ట్ (4-0-22-3), హసన్ ఖాన్ (4-0-30-4) ఒక్కసారిగా విజృంభించడంతో కష్టాల్లో పడింది. 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. గెలుపుకు ఇంకా 25 పరుగులు కావాల్సిన తరుణంలో బౌల్ట్ బ్యాట్ ఝులిపించి ఎంఐను విజయతీరాలకు చేర్చాడు. అతనికి లూస్ (8), కెంజిగే (3 నాటౌట్) సహకరించారు. ఎంఐ ఇన్నింగ్స్‌లో మొనాంక్ పటేల్ (33), డికాక్ (33) రాణించారు. పూరన్ (1), పోలార్డ్ (5) విఫలమయ్యారు. -
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన పోలార్డ్
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (జులై 6) జరిగిన తొలి మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కీరన్ పోలార్డ్ ఆల్‌రౌండ్ షోతో ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌లో అదరగొట్టిన పోలీ.. 36 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి ఎంఐకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆతర్వాత బౌలింగ్‌లో ఓ మ్యాచ్ విన్నింగ్ ఓవర్ (చివరి 2 ఓవర్లలో 21 పరుగులు కావాల్సి తరుణంలో 19వ ఓవర్లో వికెట్ తీసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు) వేసి ఎంఐ గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ గెలుపుతో ఎంఐ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ సీజన్లో ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో మూడో విజయం సాధించి, సియాటిల్ ఓర్కాస్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీపడుతుంది. ఓర్కాస్ ఇవాళే తమ చివరి మ్యాచ్‌లో ఓడి తమ విజయాల సంఖ్యను మూడు వద్దే ముగించింది. ప్రస్తుతం ఓర్కాస్, ఎంఐ తలో 6 పాయింట్లతో ఉన్నప్పటికీ ఎంఐకు ఇంకో మ్యాచ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎంఐ ఆ మ్యాచ్‌లో ఓడినా, భారీ తేడాతో ఓడకపోతే ఓర్కాస్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఎంఐ రేపు జరుగబోయే మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడంతో తలపడనుంది. కాగా, ఈ సీజన్లో టెక్సస్ సూపర్ కింగ్స్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ ఫ్రీడం ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.మ్యాచ్ వివరాల్లోకి వెళితే..తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. పోలార్డ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. పూరన్ 30, మొనాంక్ పటేల్ 13, డికాక్ 0, తజిందర్ డిల్లాన్ 2, బ్రేస్‌వెల్ 18, జార్జ్ లిండే 13, బౌల్ట్ 7, కెంజిగే 1 పరుగు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 3, హోల్డర్, కోర్నే డ్రై తలో 2, సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. ఎంఐ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎంఐ బౌలర్లలో బౌల్ట్, లిండే, ఉగార్కర్ వికెట్లు తీయనప్పటికీ పొదుపుగా తమ కోటా ఓవర్లు పూర్తి చేశారు. కెంజిగే, పోలార్డ్ తలో వికెట్ తీశారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఉన్ముక్త్ చంద్ (59 రిటైర్ట్ ఔట్) హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ చాలా నిదానంగా ఆడాడు. ఇదే నైట్‌రైడర్స్ కొంపముంచింది. ఉన్ముక్త్ 48 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఆండ్రీ ఫ్లెచర్ 9, అలెక్స్ హేల్స్ 21, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 29, రసెల్ 9 (నాటౌట్), హోల్డర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. -
నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసిన ఎంఐ న్యూయార్క్.. ప్లే ఆశలు సజీవం
మేజర్ లీగ్ క్రికెట్-2025 టోర్నీలో ఎంఐ న్యూయర్క్(MI New York) తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం ఫ్లోరిడా వేదికగా లాసెంజెల్స్ నైట్‌రైడర్స్‌తో జరిగిన డూఆర్‌డై మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూయర్క్ టీమ్ ఘన విజయం సాధించింది.ఈమ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కరేబియన్ ఆటగాడు 44 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు.ఓవైపు వికెట్లు పడుతున్నా రూథర్‌ఫోర్డ్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. మిగితా నైట్‌రైడర్స్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూయర్క్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు పొలార్డ్ రెండు, ఇషాన్ అదిల్, కెంజిగె చెరో వికెట్ తీశారు. అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని న్యూయర్క్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.ఓపెనర్ మోనాంక్ పటేల్ (56), కెప్టెన్ నికోలస్ పూరన్ (62 నాటాట్) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. నైట్‌రైడర్స్ బౌలర్లు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు. ఎంఐ న్యూయర్క్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లో గెలిచి రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా సీటెల్ ఓర్కాస్ టీమ్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అప్పుడే పూరన్ సేన నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. -
చరిత్ర సృష్టించాడు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్, కెప్టెన్‌గా రికార్డు
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf Du Plesis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. నలభై ఏళ్ల వయసు దాటిన తర్వాత.. పొట్టి ఫార్మాట్లో రెండు శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. మేజర్ లీగ్ క్రికెట్-2025లో భాగంగా డుప్లెసిస్ ఈ ఫీట్ నమోదు చేశాడు.ఎంఎల్సీ-2025 (MLC)లో డుప్లెసిస్ టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం డల్లాస్‌లో జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్.. ఎంఐ న్యూయార్క్ జట్టుతో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.రెండు శతకాలుఓపెనర్ డుప్లెసిస్ శతక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 53 బంతుల్లో ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్స్‌ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. నలభైవ పడిలో అడుగుపెట్టిన తర్వాత డుప్లెసిస్‌కు ఇది రెండో టీ20 సెంచరీ.ఎంఎల్‌సీలో భాగంగా ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కో జట్టుపై డుప్లెసిస్ 100 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నలభై ఏళ్లు దాటిన తర్వాత రెండు టీ20 శతకాలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ వయసులోనూ ఫిట్‌గా ఉంటూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటమే గాక.. సెంచరీలతో అలరిస్తూ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ సౌతాఫ్రికా దిగ్గజం.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్‌తో పాటు డొనోవాన్ ఫెరీరా (20 బంతుల్లో 53) రాణించడంతో సూపర్ కింగ్స్ 223 పరుగుల చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. సూపర్ కింగ్స్ బౌలర్ల దెబ్బకు 184 పరుగులకే పరిమితమైంది. ఎంఐ బ్యాటర్లలో కీరన్ పొలార్డ్ (70) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో మూడు కీలక వికెట్లు తీసిన అకీల్ హొసేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. నండ్రీ బర్గర్, మార్కస్ స్టొయినిస్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.నలభై ఏళ్లు దాటిన తర్వాత టీ20 ఫార్మాట్లో శతకాలు బాదింది వీరే..ఫాఫ్ డుప్లెసిస్- 43 ఇన్నింగ్స్‌లో- రెండు శతకాలుజుబేర్ అహ్మద్- 4 ఇన్నింగ్స్‌లో- ఒక శతకంఇమ్రాన్ జనత్- 15 ఇన్నింగ్స్‌లో- ఒక శతకంగ్రాహమ్ హిక్- 23 ఇన్నింగ్స్‌లో- ఒక శతకంపాల్ కాలింగ్‌వుడ్- 29 ఇన్నింగ్స్‌లో- ఒక శతకం.బాబర్ ప్రపంచ రికార్డు బద్దలుఇక రికార్డుతో పాటు మరో ఘనతను కూడా డుప్లెసిస్ తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్‌గా టీ20లలో అతడికి ఇది ఎనిమిదో సెంచరీ. ఈ క్రమంలో మైకేల్ క్లింగర్ (7 శతకాలు), బాబర్ ఆజం (7 శతకాలు) పేరిట ఉన్న సంయుక్త వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు మేజర్ లీగ్ క్రికెట్లో అత్యధికంగా మూడు శతకాలు బాదిన క్రికెటర్‌గానూ డుప్లెసిస్ నిలిచాడు.చదవండి: ఒక్కడిపైనే ఆధారపడొద్దు.. రెండో టెస్టులో అతడిని తప్పక ఆడించండి: అజారుద్దీన్ -
డుప్లెసిస్ ధనాధన్ శతకం.. ఫెరీరా మెరుపు హాఫ్ సెంచరీ.. ఎంఐకి ఓటమి
టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf Du Plesis) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. ఎంఐ న్యూయార్క్ జట్టుతో మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 103 పరుగులు బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి సూపర్ కింగ్స్‌ను గెలిపించాడు.మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC-2025)లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ ఎంఐ న్యూయార్క్ జట్టుతో తలపడింది. డల్లాస్ వేదికగా సోమవారం ఉదయం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్ చేసింది.డుప్లెసిస్ ధనాధన్ శతకం.. ఫెరీరా మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మిత్ పటేల్ మూడు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్ సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.డుప్లెసిస్‌కు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ సాయితేజ ముక్కామల్ల (18 బంతుల్లో 25), మార్కస్ స్టొయినిస్ (22 బంతుల్లో 25) రాణించగా.. డొనోవాన్ ఫెరీరా (Donovan Ferreira) మెరుపు హాఫ్ సెంచరీ (20 బంతుల్లో 53) సాధించాడు. సేవేజ్ రెండు పరుగులతో డుప్లెసిస్‌తో కలిసి అజేయంగా నిలిచాడు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో టెక్సాస్ సూపర్ కింగ్స్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 223 పరుగులు సాధించింది. ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే, రుషిల్ ఉగార్కర్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ 184 పరుగులకే కుప్పకూలింది.పొలార్డ్ అర్ధ శతకం వృథాఓపెనర్ క్వింటన్ డికాక్ (35), ఆరో నంబర్ బ్యాటర్ మైకేల్ బ్రేస్‌వెల్ (26) ఫర్వాలేదనిపించగా.. కీరన్ పొలార్డ్ అర్ధ శతకం (39 బంతుల్లో 70)తో అలరించాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. ఫలితంగా 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఎంఐ న్యూయార్క్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది. తద్వారా సూపర్ కింగ్స్ చేతిలో 39 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.సూపర్ కింగ్స్ బౌలర్లలో.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అకీల్ హుసేన్ మూడు వికెట్లతో చెలరేగగా.. నండ్రీ బర్గర్, మార్కస్ స్టొయినిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఈ సీజన్లో సూపర్ కింగ్స్‌కు ఏడింట ఇది ఐదో విజయం కాగా.. ఎంఐ న్యూయార్క్ మాత్రం ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచింది. సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. ఎంఐ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది.𝐇𝐔𝐋𝐊 unleashed! 💥#TSKvMINY#WhistleForSuperKings#MLC2025pic.twitter.com/PX1OdzIdu1— Texas Super Kings (@TexasSuperKings) June 30, 2025 చదవండి: నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్ -
ఉత్కంఠ పోరు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన హెట్‌మైర్
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ-2025లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం సియాటిల్ ఓర్కాస్, ఎంఐ న్యూయర్క్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్ష్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 3 వికెట్ల తేడాతో సియాటిల్ ఓర్కాస్ విజయం సాధించింది.కరేబియన్ ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సియాటిల్ను గెలిపించాడు. చివరి ఓవర్లో ఓర్కాస్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో క్రీజులో హెట్‌మైర్‌తో పాటు జస్దీప్ సింగ్ ఉన్నాడు. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కిరాన్ పొలార్డ్‌కు న్యూయర్క్ కెప్టెన్ పూరన్ అప్పగించాడు.తొలి రెండు బంతుల్లో స్ట్రైక్‌లో ఉన్న జస్దీప్ సింగ్ ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. జస్దీప్ మూడో బంతికి సింగిల్ తీసి హెట్‌మైర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతి డాట్ కాగా.. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో చివరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి.స్ట్రైక్‌లో ఉన్న హెట్‌మైర్ ఫైన్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాది తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. హెట్‌మైర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫలితంగా 238 పరుగుల లక్ష్యాన్ని సియాటిల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.తద్వారా మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా సియాటిల్ ఓర్కాస్ రికార్డులెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఎంఐ న్యూయర్క్ పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్లోనే వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై న్యూయర్క్ 223 పరుగుల టార్గెట్‌ను చేజ్ చేసింది. తాజా మ్యాచ్‌తో ఎంఐ రికార్డును సియోటల్ బ్రేక్ చేసింది. ఈ ఏడాది సీజన్లో ఓర్కాస్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.పూరన్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయర్క్ నిర్ణీత 4 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎంఐ కెప్టెన్ నికోలస్ పూరన్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు తాజిందర్ ధిల్లాన్ 35 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేసి ఔటయ్యాడు. సియోటల్ బౌలర్లలో కైల్ మైర్స్, గెరాల్డ్ కోయిట్జీ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: MLC 2025: వరుసగా ఐదు ఓటములు.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ స్టార్More crazy final ball scenes in the MLC! 🤯There was six needed off the last ball for Shimron Hetmyer and Seattle to complete a successful chase of 238.Kieron Pollard running in to bowl... pic.twitter.com/AkdeD1IK0l— 7Cricket (@7Cricket) June 28, 2025 -
నికోలస్ పూరన్ మెరుపు సెంచరీ.. 7 ఫోర్లు, 8 సిక్సర్లతో! వీడియో
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ-2025లో శనివారం సీటెల్ ఓర్కాస్‌తో మ్యాచ్‌లో ఎంఐ న్యూయర్క్ కెప్టెన్ నికోలస్ పూరన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. తొలి మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమైన నికోలస్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. డల్లాస్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను పూరన్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 60 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు తాజిందర్ ధిల్లాన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి విధ్వసంకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఎంఐ న్యూయర్క్ నిర్ణీత 4 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. సియోటల్ బౌలర్లలో కైల్ మైర్స్, గెరాల్డ్ కోయిట్జీ తలా రెండు వికెట్లు సాధించారు.'హిట్'మైర్..కాగా ఎంఐ న్యూయర్క్ నిర్ధేశించిన 238 పరుగుల భారీ లక్ష్యాన్ని సియాటిల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. హెట్‌మైర్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో సియాటిల్‌కు తొలి విజయాన్ని అందించాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి షిమ్రాన్ గెలిపించాడు. హెట్‌మైర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. Runs: 108*Balls: 604s/6s: 7/8SR: 180Nicholas Pooran doing what he does best 🫡🫡 #MINY #MLC2025 #Cricket pic.twitter.com/wqNuZJSHQb— Jitendra Kumar (@jitenda60203698) June 28, 2025 -
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్‌కు బంపరాఫర్.. కెప్టెన్‌గా ఎంపిక
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే విండీస్ విధ్వంసకర యోధుడు నికోలస్ పూరన్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ న్యూయార్క్ పూరన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్‌మీడియాలో వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.మా హీరో, మా కెప్టెన్, 29 ఏళ్ల పాకెట్ డైనమైట్, MINY సూపర్ స్టార్ - నికోలస్ పూరన్ కాగ్నిజెంట్ మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్‌కు ముందు MI న్యూయార్క్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ ఎడమచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరు. ప్రస్తుతం అతని శక్తుల అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అతని నాయకత్వంలో MINYని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.ఎంఎల్‌సీలో రెండు సీజన్లలో కీరన్ పోలార్డ్ ఎంఐ న్యూయార్క్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుత సీజన్‌కు పోలార్డ్ అందుబాటులో ఉండే అంశంపై క్లారిటీ లేదు. దీంతో యాజమాన్యం పూరన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. పోలీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఎంఎల్సీ 2025 రేపటి నుంచి (జూన్ 12) నుంచి జులై 13 వరకు యూఎస్ఏలో జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌కు సునీల్ నరైన్, ఎంఐ న్యూయార్క్‌కు పూరన్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు కోరె ఆండర్సన్, సియాటిల్ ఒర్కాస్కు హెన్రిచ్ క్లాసెన్, టెక్సస్ సూపర్ కింగ్స్‌కు డుప్లెసిస్, వాషింగ్టన్ ఫ్రీడంకు మ్యాక్స్‌వెల్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.కాగా, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ సభ్యుడిగా ఉన్న పూరన్ ఎంఎల్‌సీలో ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌లో ఆరంభ సీజన్ నుంచి (2023) పాల్గొంటున్నాడు. ఎంఎల్సీ ఆరంభ ఎడిషన్‌లో పూరన్ ఎంఐ న్యూయార్క్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ సీజన్లో పూరన్ 8 మ్యాచ్‌ల్లో 167.24 స్ట్రయిక్‌రేట్‌తో 388 పరుగులు చేశాడు. ఫైనల్లో పూరన్ విధ్వంసకర శతకం (55 బంతుల్లో 137 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) చేసి ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చి టైటిల్‌ను అందించాడు.2025 ఎంఎల్సీ కోసం ఎంఐ న్యూయార్క్ జట్టు..పూరన్ (కెప్టెన్), పోలార్డ్, ఎహసాన్ ఆదిల్, ట్రెంట్ బౌల్ట్, నోష్తుశ్ కెంజిగే, రషీద్ ఖాన్, మోనాంక్ పటేల్, సన్నీ పటేల్, హీత్ రిచర్డ్స్, రుషిల్ ఉగార్కర్, అగ్ని చోప్రా, తజిందర్ సింగ్, కన్వర్జిత్ సింగ్, శరద్ లాంబా, జార్జ్ లిండే, క్వింటన్ డికాక్, మైఖేల్ బ్రేస్‌వెల్, నవీన్ ఉల్ హాక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ -
రాణించిన కాన్వే.. సూపర్ కింగ్స్‌ను గెలిపించిన డుప్లెసిస్
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జులై 25) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫాఫ్ మరో అర్ద సెంచరీ బాదాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్‌పై ఘన విజయం సాధించింది.FAF DU PLESSIS - THE LEGEND OF THE SUPER KINGS FAMILY. ⭐- 72 (47) with 6 fours and 3 sixes in the Eliminator against MI New York in the MLC. The captain at the age of 40 keeps getting better. 👌pic.twitter.com/GrURm0QS7U— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2024రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. రషీద్ ఖాన్ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో రషీద్‌తో పాటు మెనాంక్ పటేల్ (48), షయాన్ జహంగీర్ (26) మాత్రమే రాణించారు. సూపర్‌కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్, ఆరోన్ హార్డీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్ హక్, నూర్ అహ్మద్, బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (72), డెవాన్ కాన్వే (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), సత్తా చాటడంతో అలవోకగా (18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) విజయం సాధించింది. బంతితో రాణించిన ఆరోన్ హార్డీ బ్యాట్‌తోనూ (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్‌కు అర్హత సాధించగా.. ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రేపు జరుగబోయే క్వాలిఫయర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ పోటీపడతాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్ ఆడతుంది. క్వాలిఫయర్ విజేత, ఛాలెంజర్ గేమ్ విజేత జులై 28న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఎంఎల్సీ 2024లో డుప్లెసిస్ స్కోర్లు..14(14), 100(58), 34(17), 61(38), 55(32), 39(17), 72(47)7 ఇన్నింగ్స్‌ల్లో 168.16 స్ట్రయిక్‌రేట్‌తో 53.57 సగటున సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 375 పరుగులు. -
పోలార్డ్ వీర బాదాడు.. ప్లే ఆఫ్స్‌లోకి ముంబై ఇండియన్స్
మేజర్ లీగ్ క్రికెట్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండింది.తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. రషీద్ ఖాన్ (4-0-22-3), నోష్తుష్ కెంజిగే (4-0-22-2), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-2), రొమారియో షెపర్డ్ (4-0-30-1), కీరన్ పోలార్డ్ (0.1-0-0-1) ధాటికి 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్), నితీశ్ కుమార్ (15), స్పెన్సర్ జాన్సన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సునీల్ నరైన్ (6), ఉన్ముక్త్ చంద్ (9), డేవిడ్ మిల్లర్ (6), సైఫ్ బదార్ (9), కోర్నే డ్రై (1), అలీ ఖాన్ (0) నిరాశపరిచారు.131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెవాల్డ్ బ్రెవిస్ (19 బంతుల్లో 27; 5 ఫోర్లు), నికోలస్ పూరన్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో పోలార్డ్ (12 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర బాదుడు బాదాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ 2, స్పెన్సర్ జాన్సన్, డ్రై, రసెల్, అలీ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. -
ముంబై ఇండియన్స్‌కు మరో పరాభవం..ప్లే ఆఫ్స్‌కు యూనికార్న్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొంది, ఫైనల్ ఫోర్కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. యూనికార్న్స్‌కు ముందు వాషింగ్టన్ ఫ్రీడం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. యూనికార్న్స్ చేతిలో ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఈ ఎడిషన్‌లో ఎంఐ టీమ్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్... కెప్టెన్ కోరె ఆండర్సన్ (59 నాటౌట్), హస్సన్ ఖాన్ (44) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో ఆండర్సన్, హసన్ ఖాన్‌తో పాటు కమిన్స్ (13), రూథర్‌ఫోర్డ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎంఐ బౌలర్లలో నోష్తుష్ కెంజిగే, ట్రెంట్ బౌల్ట్ తలో 2, రొమారియో షెపర్డ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.149 పరుగల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో ఎంఐ గెలుపుకు 20 పరుగులు అవసరం కాగా.. హీత్ రిచర్డ్స్, రషీద్ ఖాన్ జోడీ 16 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆఖరి బంతికి బౌండరీ అవసరం కాగా.. హరీస్ రౌఫ్ హీత్ రిచర్డ్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో ఎంఐకు పరాజయం తప్పలేదు. యూనికార్న్స్ బౌలర్లలో మాథ్యూ షార్ట్ 3, బ్రాడీ కౌచ్ 2, హరీస్ రౌఫ్, హస్సన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఎంఐ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (56) అర్ద సెంచరీతలో రాణించాడు.కాగా, ఈ ఎడిషన్‌లో మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాషింగ్టన్ ఫ్రీడం, యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, ఎంఐ న్యూయార్క్, సీయాటిల్ ఓర్కాస్ పోటీపడుతున్నాయి.