
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ-2025లో శనివారం సీటెల్ ఓర్కాస్‌తో మ్యాచ్‌లో ఎంఐ న్యూయర్క్ కెప్టెన్ నికోలస్ పూరన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. తొలి మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమైన నికోలస్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. డల్లాస్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను పూరన్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 60 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు తాజిందర్ ధిల్లాన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి విధ్వసంకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఎంఐ న్యూయర్క్ నిర్ణీత 4 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. సియోటల్ బౌలర్లలో కైల్ మైర్స్, గెరాల్డ్ కోయిట్జీ తలా రెండు వికెట్లు సాధించారు.
'హిట్'మైర్..
కాగా ఎంఐ న్యూయర్క్ నిర్ధేశించిన 238 పరుగుల భారీ లక్ష్యాన్ని సియాటిల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. హెట్‌మైర్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో సియాటిల్‌కు తొలి విజయాన్ని అందించాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి షిమ్రాన్ గెలిపించాడు. హెట్‌మైర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
Runs: 108*
Balls: 60
4s/6s: 7/8
SR: 180
Nicholas Pooran doing what he does best 🫡🫡 #MINY #MLC2025 #Cricket pic.twitter.com/wqNuZJSHQb— Jitendra Kumar (@jitenda60203698) June 28, 2025