డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. ప్రియుడితో బోనీ కూతురి ఎంగేజ్‌మెంట్‌ | Anshula Kapoor Got Engaged, Arjun Kapoor Gets Emotional | Sakshi
Sakshi News home page

జాన్వీ సోదరి ఎంగేజ్‌మెంట్‌.. 'అమ్మను మిస్‌ అవుతున్నా..'

Jul 4 2025 12:31 PM | Updated on Jul 4 2025 1:11 PM

Anshula Kapoor Got Engaged, Arjun Kapoor Gets Emotional

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor) కూతురు అన్షులా కపూర్‌ (Anshula Kapoor) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రియుడు రోహన్‌ తక్కర్‌ తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్‌ చేసింది. 'డేటింగ్‌ యాప్‌ ద్వారా ఒకరికొకరం పరిచయమయ్యాం. తొలిసారిగా మంగళవారం అర్ధరాత్రి 1.15 గంటలకు ఫోన్‌ చేస్తే పొద్దున ఆరింటివరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ ప్రయాణం దేనికో ఆరంభం పలకనుందని నాకప్పుడే అనిపించింది. 

అర్ధరాత్రి ఒంటిగంటకు..
మూడేళ్ల క్రితం నాకిష్టమైన న్యూయార్క్‌ నగరంలోని సెంట్రల్‌ పార్క్‌లో ప్రపోజ్‌ చేశాడు. అది కూడా అర్ధరాత్రి 1.15 గంటలకు! అప్పుడు ఏదో మ్యాజిక్‌ జరిగినట్లు ఈ ప్రపంచమే కొన్ని క్షణాలపాటు ఆగిపోయినట్లనిపించింది. అతడి చెంత ఉంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. అతడు ప్రపోజల్‌కు ఓకే చెప్పాను. నా బెస్ట్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది' అని అన్షులా రాసుకొచ్చింది.

అమ్మను ఎక్కువ మిస్‌ అవుతున్నా..
ఇది చూసిన ఆమె అన్న, నటుడు అర్జున్‌ కపూర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి. లవ్‌ యూ గయ్స్‌.. ఈరోజు అమ్మను కాస్త ఎక్కువగా మిస్‌ అవుతున్నాను అని రాసుకొచ్చాడు. అటు జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ సైతం.. మా సిస్టర్‌ పెళ్లి చేసుకోబోతుందోచ్‌ అని కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బోనీ కపూర్‌ రెండు పెళ్లిళ్లు
నిర్మాత బోనీ కపూర్‌ మొదటి భార్య పేరు మోనా శౌరీ కపూర్‌. ఈవిడ కూడా నిర్మాతే! వీరిద్దరూ 1983లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌ సంతానం. 1996లో బోనీ.. భార్య మోనాకు విడాకులిచ్చాడు. అదే ఏడాది హీరోయిన్‌ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ సంతానం. కాగా మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో మరణించింది. జాన్వీ, ఖుషి సవతి తల్లి కూతుర్లయినప్పటికీ అర్జున్‌, అన్షులా.. వారితో అన్యోన్యంగా ఉంటారు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు.

 

 

చదవండి: ఓటీటీలో 'నార్నే నితిన్' ఫస్ట్‌ సినిమా స్ట్రీమింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement