breaking news
Nalgonda
-
పదేళ్ల తర్వాత.. కొత్త రేషన్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత అధికారికంగా సోమవారం కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నారు. మంత్రులు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తదితరులు ఈ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ జనవరి 26 తర్వాత మొదలైన కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. ఇప్పటి వరకు కొత్తగా జారీ చేసిన, చేస్తున్న కార్డుల సంఖ్య 5,61,343. పాత కార్డుల్లోని డూప్లికేట్ పేర్లు తొలగించిన తర్వాత..ప్రస్తుతం కార్డుల్లో సభ్యుల సంఖ్య 3,09,30,911గా తేల్చారు. ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడే... పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల స్థానంలో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. అప్పట్లో రాష్ట్రంలో సుమారు 55 లక్షల కార్డులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం జారీ చేయగా, ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులతో సంబంధం లేకుండా మరో 30 లక్షల కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పుడప్పుడు జారీ చేసిన కార్డులు, తొలగించిన కార్డులు పోగా 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కొత్త కార్డుల జారీ ప్రకటన చేశారు. అప్పటి నుంచి మే 23వ తేదీ వరకు కొత్తగా 2.03 లక్షల కార్డులు జారీ అయ్యాయి. ఆ తర్వాత 24 మే నుంచి ఇప్పటి వరకు మరో 3.58 లక్షల కార్డులను ఆన్లైన్లో జారీ చేశారు.దీంతో ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 5,61,343గా తేల్చారు. దీంతో రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 95,56,625గా పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సభ్యులను చేర్చుకుంటూ, పాత రేషన్‌కార్డుల్లోని ఉమ్మడి కుటుంబాల్లో పెళ్లిళ్లు అయిన వారిని, ఇళ్లల్లో లేని వారిని తొలగించగా, రాష్ట్రంలో రేషన్ పొందేందుకు అర్హులుగా 3.09 కోట్లుగా నిర్ధారించినట్టు పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. పది జిల్లాల్లో అత్యధిక కార్డులు పది జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్లో 31,772 కొత్త కార్డులను ఇవ్వబోతున్నారు. కొత్త కార్డుల జారీ తర్వాత అత్యధికంగా 6,67,778 రేషన్‌కార్డులు ఉన్న జిల్లాగా హైదరాబాద్, అతి తక్కువ కార్డులు కలిగిన జిల్లాగా 96,982 కార్డులతో ములుగు ఉంది. 5,61,343 కార్డుదారులకు ప్రయోజనం : మంత్రి ఉత్తమ్రాష్ట్రంలో కొత్తగా 5,61343 రేషన్‌కార్డులు అందజేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తద్వారా 45,34,430 మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. పాతకార్డుల్లో పేర్ల చేర్పు ద్వారా మరో 28,32,719మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.మొత్తంగా కార్డుల సంఖ్య 95,56,625 సన్నబియ్యం ఇచ్చేది 3,09,30,911 మందికి 13 ఏళ్ల తర్వాత కార్డు నాకు వివాహమై 13 ఏళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. ఇరవై ముప్పై సార్లు మీసేవ కేంద్రంలో, తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఈసారి దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు కార్డు వస్తోంది. – బూరి రేణుక, మొల్కపట్నం, నల్లగొండసంతోషంగా ఉంది చేనేత కార్మికులుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాం. నాలుగైదేళ్లుగా కార్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గతంలోనూ అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తు చేసుకున్నాం. కార్డు అప్రూవ్ అయ్యింది. – చెరుపల్లి నవీన, గట్టుప్పల్, నల్లగొండఇప్పటికొచ్చింది నాకు ఐదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కోసం రెండుసార్లు దరఖాస్తు చేశా. అయినా రాలేదు. మొత్తానికి ఇప్పుడు అప్రూవ్ అయ్యింది. – బొందల విక్రం, తుమ్మల పెన్‌పహాడ్, సూర్యాపేట -
నిర్వహణ వ్యయాన్ని తగ్గించాలి
నాగార్జునసాగర్: భవిష్యత్‌లో విద్యుత్ ఉత్పత్తి నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేలా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం తెలంగాణ జెన్కో సీఎండీ హరీష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డిలతో కలిసి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. జలవిద్యుత్ కేంద్రంలోని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, పవర్ హౌజ్‌ను పరిశీలించిన అనంతరం జెన్కో పవర్ పవర్ హౌజ్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. భవిష్యత్‌లో జల విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పంపులను సోలార్‌పై నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. జలవిద్యుత్ కేంద్రం ద్వారా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం విద్యుత్ ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జల విద్యుత్ కేంద్రం సీఈ మంగేష్‌కుమార్ నాగార్జునసాగర్ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం వివరాలు తెలిపారు. అనంతరం విజయ్ విహార్ నుంచి సాగర్ జలాశయం అందాలను తిలకించారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మరమ్మతులు నిర్వహిస్తున్న మొదటి టర్బైన్ పనులు, అంతర్భాగంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అక్కడినుంచి కంట్రోల్ రూంకు చేరుకుని అక్కడ విద్యుత్ అధికారులతో విద్యుత్ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎస్ఈ రఘురాం, సాగర్ సీఐ శ్రీనునాయక్, జెన్కో సీఐ నాయుడు, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ ముత్తయ్య ఉన్నారు. -
సాగర్ రహదారిపై మూలమలుపుల పరిశీలన
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నేషనల్ హైవేపై బ్లాక్స్పాట్లను ఎస్పీ శరత్చంద్ర పవార్ శుక్రవారం పరిశీలించారు. ఇటీవల ఈ మార్గంలో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు పోలీస్‌శాఖను ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన ఎస్పీ శుక్రవారం ఆ ప్రాంతాలను సందర్శించి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ వార్నింగ్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అవసరమైన చోట రోడ్డు వెడల్పు అంశాన్ని చర్చించారు. ఎస్పీ వెంట సీఐ అంజయ్య, నేషనల్ హైవే డీఈ మురళీకృష్ణ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్ఈ వి.గీత, ఏఈ కె.శేఖర్, ఫారెస్ట్ అధికారి రావేందర్రావు, ఎంవీఐ సతీష్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కల్పన, సాగర్ సీఐ శ్రీనునాయక్ ఎస్ఐ ముత్తయ్య ఉన్నారు. -
మాకొద్దు.. జీపీఓ!
‘గ్రామపాలన’కు పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల అనాసక్తి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి గ్రామపాలన అధికారి పోస్టులను గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలు పని చేసిన వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇతర శాఖలకు వెళ్లిపోయిన వారిలో తిరిగి రెవెన్యూ శాఖకు రావాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని కోరినా.. మొదటి విడతలో చాలా మంది ఆసక్తి చూపలేదు. దీంతో రెండోసారి దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెవెన్యూ శాఖలో పనిచేసిన పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలతో పాటు గతంలో ఫెయిలైన వారు కూడా గ్రామ పాలన అధికారులుగా వచ్చేందుకు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి దరఖాస్తులు ఆహ్వానించారు. గూగుల్ ఫారంలో forms.gle/rBD ToMSakRcPoivWA ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. వచ్చే దరఖాస్తులను బట్టి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? ఎలా నియామకం చేస్తారన్న దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామపాలన అధికారి (జీపీఓ)గా పని చేసేందుకు పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలు వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాలున్నాయి. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చి గ్రామాల్లో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అందుకు జిల్లాలో 241 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఉన్న పోస్టుల మేరకు కూడా దరఖాస్తులు రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం రెండు నెలల కిందట పరీక్ష నిర్వహించగా, అందులో 184 మంది ఉత్తీర్ణులయ్యారు. 57 మంది ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ధరణి వచ్చాక వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులు రద్దు.. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి, వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. గ్రామాల్లో పనిచేస్తున్న ఆ ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో అప్పటి వరకు గ్రామాల్లో పని చేసిన వీఆర్ఓ, వీఆర్ఏలు ఇతర శాఖలకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఽఅధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే వీఆర్ఓల స్థానంలో జీపీఓలను నియమించాలని నిర్ణయించింది. ఫ జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాలకు జీపీఓలు అవసరం ఫ గతంలో దరఖాస్తు చేసుకుంది 241 మంది ఫ స్కీనింగ్ టెస్ట్‌లో 184 మంది ఉత్తీర్ణత ఫ మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే.. రెవెన్యూ శాఖలో నిత్యం ఒత్తిడి మధ్యలోనే పనిచేయాల్సి ఉంటుంది. గ్రామాలకు ఏ ఉన్నతాధికారి వచ్చినా, ప్రజాప్రతినిధుల వచ్చినా, ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినా ముందుండి ఏర్పాట్లు చేయించాల్సింది గ్రామపాలన అధికారులే. ఒక పక్క రెవెన్యూ సమస్యలతోపాటు మరోపక్క ఈ పనులన్నీ చేయాల్సి ఉండటంతో గతంలో పనిచేసిన వారెవరూ ముందుకు రావడం లేదు. ఇదిలా ఉంటే పదోన్నతిపై జూనియర్ అసిస్టెంట్లుగా ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్ఓ, అర్హత కలిగిన వీఆర్ఏలు తమకు పరీక్ష నిర్వహించవద్దని కోరారు. తాము గతంలో రెవెన్యూ శాఖలో పని చేశామని.. నేరుగా తీసుకోవాలని పేర్కొన్నారు. పరీక్ష విధానం కారణంగా చాలా మంది తిరిగి వెనక్కి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల్లోకి వెళ్లిన ఆయా ఉద్యోగులు అక్కడ ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి గ్రామ పాలన అధికారులుగా వచ్చేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
49,950 మందికి రేషన్ కార్డులు
నల్లగొండ : రేషన్‌కార్డుల కోసం పేదలు, మధ్యతరగతి ప్రజల నిరీక్షణకు తెరపడనుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. పదేళ్లుగా కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అక్కడి ప్రజలకు మాత్రమే కొన్ని కార్డులు మంజూరు చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కకార్డు కూడా ఇవ్వకపోవడంతో వేలాది మంది పేదలు రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనెల 14వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. 33 మండలాల్లో.. జిల్లాలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అధికారులు అన్ని అర్హతలు ఉన్న వాటిని ఆమోదించారు. జిల్లాలోని 33 మండలాల పరిధిలో 2 లక్షల వరకు దరఖాస్తులు రాగా అందులో 49,950 మందికి కొత్త కార్డులను మంజూరు చేశారు. మరో 75 వేల మంది కార్డుల్లో కొత్తగా పిల్లల పేర్లను నమోదు చేశారు. అయితే జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి సంబంధించి అధికారులు ఇప్పటికే జాబితా సిద్ధం చేశారు.కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వం ఫ 14న సీఎం చేతుల మీదుగా పంపిణీకి సన్నాహాలు ఫ ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం ఫ పదేళ్ల నిరీక్షణకు పడనున్న తెర పంపిణీకి ఏర్పాట్లు చేశాం జిల్లాలో 33 మండలాల పరిధిలో ఇప్పటికే 49,950 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాం. అలాగే 75వేల కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశాం. కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ -
హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ వసతిగృహ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన హాస్టల్ విద్యార్థులకు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఇప్పటివరకు మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు, బట్టలు, దుప్పట్లు వెంటనే ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. సమావేశంలో ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, కుర్ర సైదానాయక్, కోరే రమేష్, కుంచం కావ్య, స్పందన, రవీందర్, బుడిగ వెంకటేష్, మారుపాక కిరణ్, ఎంఏ సైఫ్, జగన్, జగదీష్, రాములు, తదితరులు పాల్గొన్నారు. -
జనవరి నాటికి యాదాద్రి ఐదో యూనిట్ సిద్ధం
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 5వ యూనిట్ పనులను 2026 జనవరి నాటికి పూర్తి చేసి విద్యుదుత్పాదన ప్రారంభించాలని రాష్ట్ర ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన యాదాద్రి థర్మల్ పవర ప్లాంట్‌ను జెన్కో సీఎండీ హరీష్‌తో కలిసి సందర్శించారు. పవర్ ప్లాంట్‌లోని ఉత్పత్తి యూనిట్, ప్లాంట్‌కు బొగ్గు సరఫరా, కూలింగ్ టవర్లు, స్విచ్‌యార్డు తదితర యూనిట్లను ఆయన పరిశీలించారు. వన మహోత్సవం సందర్భంగా ప్లాంట్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో ప్లాంట్ ఇంజనీరింగ్ అధికారులు, బీహెచ్ఈఎల్, జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జనవరి నుంచి విద్యుత్‌కు ఏర్పడే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకోని అనుకున్న సమయానికంటే ఒక నెల ముందుగానే 5వ యూనిట్ పనులను పూర్తి చేసి విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి పర్యావరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, టౌన్షిప్ పనులు నిర్ధేశించిన సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ ధరకు బొగ్గును తీసుకునే విధంగా అధికారులు మార్గాలను అన్వేషించాలని సూచించారు. జెన్కో సీఎండీ ఎస్.హరీష్ మాట్లాడుతూ.. వైటీపీఎస్‌కు వచ్చే రోడ్లు, అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలన్నారు. బీహెచ్ఈఎల్ అదనపు సిబ్బందిని నియమించి 5వ యూనిట్‌ను నిర్ధేశించిన సమయం కంటే ముందే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2047 విజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ బొగ్గు మెకానిజాన్ని రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబు, బీహెచ్ఈఎల్ పవర్ డైరెక్టర్ జితేందర్ గుప్తా, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, వైటీపీఎస్ కోల్ డైరెక్టర్ నాగయ్య, సివిల్ డైరెక్టర్ అజయ్, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, థర్మల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఫ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శన -
నేడు నల్లగొండకు మంత్రుల రాక
నల్లగొండ : నల్లగొండకు శనివారం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు వారు నల్లగొండకు చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. అనంతరం కలెక్టరేట్లో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఎంజీయూలో వనమహోత్సవంనల్లగొండ టూటౌన్ : మొక్కల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎంజీ యూనివర్సిటీ అధ్యాపకుడు రామచంద్రు అన్నారు. వనమహోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఎంజీ యూనివర్సిటీలో అధ్యాపకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్య నివారణకు కృషి చేసిన వారవుతామన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు సీహెచ్ రమేష్, భిక్షమయ్య, శేఖర్, స్వామి పాల్గొన్నారు. మైనార్టీ గురుకులాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులునల్లగొండ : జిల్లా మైనారిటీ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన టీచర్లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి టి.విజయేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ బాలుర కాలేజీలో జెఎల్ ఫిజిక్స్ జనరల్ 1, మిర్యాలగూడ బాలికల కాలేజీలో జేఎల్ ఇంగ్లిష్ మహిళ 1, పీజీటీ పిజికల్ సైన్స్ మహిళ 1, దేవరకొండ బాలుర పాఠశాలలో టీజీటీ మ్యాథ్స్ జనరల్ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నల్లగొండలోని కార్యాలయంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని పేర్కొన్నారు. పీఆర్సీ అమలు చేయాలిపెద్దవూర : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా శుక్రవారం పెద్దవూర మండలంలోని వెల్మగూడెం, చలకుర్తి, పెద్దవూర, పులిచర్ల తదితర పాఠశాలలను ఆయన సందర్శించి మాట్లాడారు. మూడేళ్లుగా పెండింగ్ బిల్లుల జాప్యంతో ఉపాధ్యాయులు నిరాశకు లోనవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు రమావత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి గోలి కృష్ణ, నాయకులు రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, హరేందర్‌రెడ్డి, ఉపేందర్, సహదేవి, వెంకన్న, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా అకాడమీలో ప్రవేశాలునల్లగొండ టూటౌన్ : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా అకాడమీలో 2025–2026 విద్యా సంవత్సరానికి బాలబాలికలకు ప్రవేశాలు కల్పించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎండీ.అక్బర్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గచ్చిబౌలి క్రీడా అకాడమీలో హాకీ, అథ్లెటిక్ క్రీడాకారులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో అకాడమీలో హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ క్రీడాకారులకు ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలు వయస్సు, విద్యార్హత సర్టిఫికెట్లు క్రీడా ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్‌ఫొటోలు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి వెళ్లాలని పేర్కొన్నారు. -
ఫొటో తీసి.. పౌష్టికాహారం ఇచ్చి
మిర్యాలగూడ టౌన్ : అంగన్వాడీ కేంద్రాల సేవల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. లబ్ధిదారులకు సరుకులను ఇచ్చేందుకు ఫేస్ రికగ్నేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) అమలు చేస్తోంది. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం, ఇతర సేవలన్నింటినీ రికార్డుల్లో నమోదు చేసేవారు. గుడ్లు, బాలామృతం, ఇతర పోషకాహార పదార్థాలు సరిగా అందడం లేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని లబ్ధిదారుల నుంచి ఆరోపణలున్నాయి. దీంతో సేవల్లో పాదర్శకత ఉండేలా ఫేస్ రికగ్నేషన్ విధానం తప్పనిసరి చేసింది. కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో జూలై 1వ తేదీ నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు గతంలో అందించిన ‘పోషణ ట్రాక్టర్’ యాప్ ద్వారా ఫేస్ రికగ్నెషన్ హాజరు తీసుకుంటున్నారు. మొదటగా మూడేళ్లలోపు చిన్నారులు.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఫేస్ రికగ్నేషన్ విధానం మొదటగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు అమలు చేయనున్నారు. ‘పోషణ ట్రాక్టర్’ యాప్‌లో చిన్నారి లేదా.. తల్లిని ఫొటోను తీసి అప్లోడ్ చేయనున్నారు. మొదటగా ఆధార్ వివరాలను సమర్పిస్తారు. ఫొటోను యాప్‌లో నమోదు చేసిన తర్వాత ఆధార్‌కు అనుసంధానం అయిన ఫోన్ నంబర్‌కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. దీన్ని యాప్‌లో నమోదు చేయడం ద్వారా ధ్రువీకరణ పూర్తి అవుతుంది. దీంతో ఆయా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తారు. లబ్ధిదారుల ఆధార్, ఇతర వివరాలను మొదటి నెలలో నమోదు చేస్తారు. ఆ తరువాత ప్రతి నెలా పౌష్టికాహారం అందించే సమయంలో ఫొటోలు తీసుకుంటారు. కొద్ది రోజుల తర్వాత మూడేళ్లు దాటిన చిన్నారులకు ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని తల్లి ఫొటోను యాప్‌లో నమోదు చేసి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ విధానం ఫ పౌష్టికాహారం పంపిణీలో పారదర్శకతే లక్ష్యంగా అమలు జిల్లాలోని కేంద్రాలు, లబ్ధిదారుల వివరాలుఐసీడీఎస్ ప్రాజెక్టులు 9అంగన్వాడీ కేంద్రాలు 2093 చిన్నారులు 76494గర్భిణులు 8538బాలింతలు 6595పకడ్బందీగా అమలు చేస్తాం అంగన్వాడీల్లో జూలై 1వ తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్)లో నమోదు చేశాకే లబ్ధిదారులకు సరుకులు అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. పోషణ ట్రాకర్ యాప్‌లో చిన్నారి లేదా తల్లి ఫొటోను తీసుకుని సరుకులు ఇస్తాం. – కృష్ణవేణి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖాధికారి, నల్లగొండ -
ప్రమోషన్లలో బీసీలకు అన్యాయం
నల్లగొండ : తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి అన్నారు. గురువారం నల్లగొండలోని విద్యుత్ శాఖ అతిథి గృహంలో జరిగిన తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన ప్రమోషన్లను సమీక్షించాలన్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని, 2019లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా విద్యుత్ సంస్థల్లో అమలు చేయలేదన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా విద్యుత్ సంస్థల్లో అడ్‌హక్ పేరుతో ప్రమోషన్లు ఇస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇది తప్పు అని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అడ్ హాక్ ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. సుప్రీం, హైకోర్టు తీర్పులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే ప్రమోషన్లను సమీక్షించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గంజి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మేందర్ రావు, ట్రాన్స్‌కో అధ్యక్షుడు అశోక్ కుమార్, మారం శ్రీనివాస్, పి.యాదగిరి, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో లాభాలు
నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటుతో రైతులు లాభాలు పొందవచ్చని తెలంగాణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ ఎం.పాండురంగారావు అన్నారు. గురువారం నల్లగొండలో నాచురల్ పవర్ ఏసియా ప్రైవేట్ లిమిటెంట్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విద్యుత్ సంస్థలకు అమ్ముకోవచ్చన్నారు. నాచురల్ పవర్ ఏసియా సంస్థ ఎండీ కె.శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాంట్ల ఏర్పాటు, పెట్టుబడి రైతులకు వచ్చే ఆదాయంపై వివరంగా తెలియజేశారు. ఈ సదస్సులో విద్యుత్ సంస్థ డీఈ కృష్ణారావు, ఏఇ నవీద్ ఆహ్మద్, ఎస్బీహెచ్ అధికారి హరికృష్ణ రైతులు పాల్గొన్నారు. బీసీ అభివృద్ధి ఇన్చార్జి అధికారిగా రాజ్కుమార్నల్లగొండ : జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి ఇన్చార్జిగా అధికారిగా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న అలీమొద్దీన్‌ను నాగర్‌కర్నూల్ అధికారిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన రెండు జిల్లాలో పనిచేయడం ఇబ్బందిగా ఉండడంతో జిల్లా కలెక్టర్ రాజ్‌కుమార్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. మహిళల ఆర్థికబలోపేతానికి కృషిమిర్యాలగూడ : మహిళలను ఆర్థికంగా బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం రుణాలు అందిస్తూ ఎంతగానో కృషిచేస్తోందని డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా గురువారం దామరచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళాజాతాలో ఆయన మాట్లాడారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, డ్వాక్రా బజార్లు మొదలైన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం గుంటి దిలీప్‌కుమార్, సీపీలు శంకర్, శ్రీనివాస్, మాధవి, అనూష, కవిత, వీఓఏలు సంజీవరెడ్డి, నాగలక్ష్మీ, సీతామహాలక్ష్మి, నాగమణి, శ్రీదేవి, శాంతమ్మ, నాగలక్ష్మీ, కళాజాత సభ్యులు బచ్చలకూరి శ్రీను, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలిత్రిపురారం : రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని, అధిక దరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని జేడీఏ శ్రవణ్ కుమార్ అన్నారు. గురువారం త్రిపురారం మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాను తనిఖీ చేసి మాట్లాడారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఆయన వెంట త్రిపురారం ఏఓ పార్వతి చౌహాన్, సిబ్బంది, డీలర్లు ఉన్నారు. నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులునల్లగొండ : జవహర్ నవోదయ విదాయలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి భిక్షపతి గురువారం ఒక ప్రకటనలలో తెలిపారు. ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరుగుతుందని, ఈనెల 29లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు తమ పాఠశాలల పిల్లలు దరఖాస్తు చేసుకునేలా సహకరించాలని కోరారు. ఆగస్టు 3 నుంచి టీటీసీ పరీక్షలు టెక్నికల్ టీచర్ కోర్సు (టీటీసీ) వేసవి శిక్షణ శిబిరాలు పూర్తిచేసిన వారికి ఆగస్టు 3వ తేదీ నుంచి లోయర్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
3 నెలల్లో 43.63 లక్షల పనిదినాలు
నల్లగొండ : ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు కేటాయించిన పనిదినాలను కూలీలు మూడు నెలల్లోనే పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఉపాధి కూలీలకు 38.10 లక్షల పని దినాలను టార్గెట్ నిర్ణయించింది. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల్లోనే 43.63 లక్షల పని దినాలను కూలీలు పూర్తి చేశారు. అంటే లక్ష్యాన్ని మించి 5.53 లక్షల పనిదినాలను అధికంగా చేపట్టారు. రూ.126.94 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.122.84 కోట్ల పనులు పూర్తి చేశారు. 133 కుటుంబాలకు వంద రోజుల పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం ప్రకారం కూలీలకు డబ్బుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికంగా చేసిన పని దినాలకు చెల్లింపుల కోసం అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. కూలి కూడా అధికంగానే గిట్టుబాటు.. వాస్తవంగా ప్రభుత్వం కూలీలకు రోజుకు రూ.307 కూలి చెల్లించాల్సి ఉంటుంది. గత సంవత్సరంలో రోజుకు రూ.197 మాత్రమే చెల్లించారు. ఈ సంవత్సరం కూలీలకు రూ.276.13 చొప్పున గిట్టుబాటు అయ్యింది. పని దినాల పొడిగింపుపై రాని స్పష్టత.. ఉపాధి హామీలో ఈ సారి ప్రభుత్వం పని దినాలను కుదించింది. దీంతో మూడు నెలల్లో పూర్తయ్యాయి. పని దినాల పొడిగింపుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రాష్ట్ర కోటా 6.5 కోట్ల పనిదినాలు ఉండగా.. ఇప్పటి వరకు 5 కోట్ల పైచిలుకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా ఏ జిల్లాల్లో లక్ష్యానికి మించి పూర్తిచేశారో.. ఆ ప్రాంతాలకు ఆ పని దినాలను పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. డిసెంబర్, జనవరి ఆ తర్వాతనే కూలీలు మళ్లీ పనులకు వస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం ఇంకా 9 నెలలు ఉంది. కేంద్రం ఈ విషయంలో స్పందించి పని దినాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులు చేపట్టే అవకాశం లేదు. లక్ష్యం మించిన ‘ఉపాధి’ ఫ సంవత్సరమంతా చేయాల్సిన పనులు త్రైమాసికంలోనే పూర్తి ఫ 5.53 లక్షల పనిదినాలను అధికంగా చేసిన కూలీలు పని దినాల పెంపుపై ఆదేశాలు రాలేదు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం కేటాయించిన పని దినాల కంటే అధికంగా పని చేశారు. ఇప్పటికే పని దినాలు పూర్తయినందున మళ్లీ పని దినాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే తిరిగి కూలీలకు పనులు కల్పిస్తాం. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. –శేఖర్‌రెడ్డి, డీఆర్డీఓ -
జనాభా 1961 తరువాత పెరిగినా, ప్రస్తుతం తగ్గుతోంది
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం ఫ ఉమ్మడి జిల్లాలో 1991 తరువాత నుంచి క్రమంగా తగ్గుదల ఫ సంతాన పరిమితితో తగ్గుతున్న జనాభా శాతంఫ మరో 20 ఏళ్లలో యువత కంటే సీనియర్ సిటిజన్ల సంఖ్యే ఎక్కువకానుంది ఫ 2011 నాటికి క్షీణించిన జనాభా పెరుగుదల రేటుఉమ్మడి జిల్లాలో యువతరం తగ్గిపోతోంది. పెరుగుతున్న పోషణ భారం.. సంతాన పరిమితికి కారణమవుతోంది. 1951లో మొదటిసారిగా జనాభా లెక్కలు చేసిన తరువాత పదేళ్లపాటు పెద్దగా జనాభా పెరుగకపోయినా, ఆ తరువాత 30 ఏళ్ల పాటు అంటే 1971 వరకు జిల్లాలో జనాభా గణనీయంగా పెరిగింది. మళ్లీ 1991 తరువాత నుంచి జనాభా సంఖ్యా పరంగా పెరిగినా, అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే పెరుగుదల రేటు మాత్రం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో వచ్చే 20 ఏళ్లలో సీనియర్ సిటిజన్ల సంఖ్యే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాదు ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సూచనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెరిగిన జీవన ప్రమాణాలు, వస్తున్న ఆదాయానికి, చేయాల్సిన వ్యయానికి పొంతన లేకపోవడం, తక్కువ ఆదాయం, ఎక్కువ ఖ ర్చుల కారణంగా పరిమిత సంతానికే నేటి యువత మొగ్గుచూపుతోంది. తక్కువ మందిని కని సక్రమంగా పెంచి, అన్నీ సమకూర్చగలిగితే చాలు అన్నట్లుగా భావిస్తుస్తోంది. సంపన్న వర్గాల నుంచి పేద, మధ్య తరగతి వరకు చిన్న కుటుంబాలకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా జనాభా పెరుగుదల ఏటేటా తగ్గిపోతోంది. ఒకప్పుడు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఒకప్పుడు జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వమే ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అన్న నినాదాన్ని ప్రజల్లోకి తెచ్చింది. అయితే అదే నినాదం ఇప్పటికీ అమలవుతూనే ఉంది. 1970 తరువాత భారత ప్రభుత్వం దేశంలో జనాభా ఎక్కువ అవుతుందని, ఆహార పదార్ధాల కొరత ఏర్పడుతుందన్న ఆలోచనతో కుటుంబ నియంత్రణను అమల్లోకి తెచ్చింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టింది. రెట్టింపునకు మించి పెరిగిన జనాభా ఉమ్మడి జిల్లాలో 1951లో చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా కంటే ఇప్పుడు జనాభా రెండు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనాభా 15,43,975 ఉండగా, 2011 సంవత్సరం నాటికే అది 34,88,809కు పెరిగింది. ఈ 15 ఏళ్లలో మరో 5 లక్షలకు పైగా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఖ్యాపరంగా పెరిగినా.. పెరుగుదల రేటు మాత్రం క్షీణిస్తోంది. 1951 నుంచి 1961 వరకు 1.97 శాతమే పెరిగింది. ఆ తరువాత పదేళ్లలో 1971 నాటికి 13.45 శాతం పెరిగింది. 1981 నాటికి 20.18 శాతం, 1991 నాటికి 20.07 శాతం జనాభా పెరిగింది. ఇక తరువాత పెరుగుదల రేటు క్షీణిస్తూ వస్తోంది. తరువాత పదేళ్లకు అంటే 2001 నాటికి పెరుగదల రేటు 12.19 శాతానికి పడిపోయింది. 2011 నాటికి జనాభా పెరుగుదల రేటు 6.91 శాతానికి తగ్గింది.●ఉమ్మడి కుటుంబాలు లేక.. అప్పట్లో జనాభా పెరుగుదలను తగ్గించేందకు తీసుకువచ్చిన కుటుంబ నియంత్రణను ఇప్పటి దంపతులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఒక్కరిద్దరితోనే సరిపెట్టుకుంటున్నారు. పెరుగుతున్న జీవన వ్యయంతో ఒకరిద్దరు పిల్లలను కనేందుకు నేటి యువత మొగ్గు చూపుతోంది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పుట్టిన బిడ్డను చూసుకునేందుకు ఉమ్మడి కుటుంబంలో నానమ్మ, తాతయ్య, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, అత్తమ్మలు ఇలా చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు బతుకు పోరులో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రోజుకు సగటున 70 జననాలు నల్లగొండ జిల్లాలో ప్రతి రోజు సగటున 70 మంది జన్మిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెపుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో 40 మంది, ప్రైవేటు ఆస్పత్రులలో 30 మంది జన్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి పదేళ్లకు జనాభా పెరుగుదల ఇలా.. సంవత్సరం జనాభా పెరుగుదల వృద్ధి శాతం 1951 15,43,975 -- -- 1961 15,74,946 37,971 1.97 1971 18,19,738 2,44,792 13.45 1981 22,79,681 4,59,947 20.18 1991 28,52,092 5,72,407 20.07 2001 32,47,982 2,95,890 12.19 2011 34,88,809 2,40,827 6.91 -
టీబీ రహిత జిల్లాగా మారుద్దాం
మిర్యాలగూడ : జిల్లాను టీబీ రహితంగా మార్చేందుకు సవాలుగా తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడలోని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు గుర్తింపు వచ్చేలా విధులు నిర్వహించాలన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మిల్లులు అధికంగా ఉండడం వల్ల దుమ్ముధూలితో ప్రజలకు టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున రెండు వారాలకు మించి దగ్గు ఉండే వారిని గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. నల్లగొండ, మిర్యాలగూడ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ల తరఫున రూ.20లక్షల విలువ చేసే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌రే మిషన్‌ను వైద్యారోగ్యశాఖకు ఇవ్వడంతో సంఘం ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, టీబీ నియంత్రణ అధికారి కల్యాణ్‌చక్రవర్తి, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు వేణుగోపాల్‌రెడ్డి, రవి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్స్ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, సంఘం కార్యదర్శి బాబి పాల్గొన్నారు. ఎమ్మార్పీకే యూరియా అమ్మాలి మిర్యాలగూడ : ఎమ్మార్పీకే యూరియా అమ్మాలని, అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మిర్యాలగూడ శివారులోని అవంతి వేర్ హౌసింగ్ ఫర్టిలైజర్స్ గోదాంను గురువారం కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, డీఏఓ శ్రవణ్‌కుమార్, ఇన్చార్జి ఏడీఏ సైదానాయక్, మార్కెఫెడ్ డీఎం ఎన్.జ్యోతి ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
పేపర్ బాయ్ నుంచి కుబేర సినిమా సక్సెస్ దాకా.. మన కుర్రాడే!
పెద్ద అడిశర్లపల్లి(నల్గొండ): ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై తనకున్న ఆసక్తితో అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని మేడారం గ్రామానికి చెందిన మేడారం వెంకటయ్య, అంజమ్మ దంపతుల కుమారుడు మేడారం అరవింద్. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాకు అరవింద్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.అరవింద్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలో బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లగా.. వారితో పాటు అతడు కూడా వెళ్తూ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు పేపర్‌బాయ్‌గా, క్యాటరింగ్ బాయ్‌గా, రైస్‌మిల్లు నైట్ షిఫ్ట్ చేస్తూ సొంత ఖర్చులు సమకూర్చుకున్నారు. అంతేకాకుండా తనకు సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు, వ్యాసాలు రాస్తుండేవాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అభిరుచి ఏర్పర్చుకొని సినిమాల్లో ప్రవేశం దొరకబుచ్చుకున్నారు.చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై ఆసక్తి..తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో అరవింద్ చదువు కొనసాగింది. తమ గ్రామం నుంచి యూనివర్సిటీకి వచ్చిన మొదటితరం విద్యార్థి అరవిందే కావడం విశేషం. మాస్ కమ్యూనికేషన్ చదువుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్‌బాయ్‌గా పనిచేయడం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ కవితలు, వ్యాసాలు రాశారు.సాహిత్య ప్రచారం..కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం.. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని భావించిన అరవింద్ ‘ఆలోచనా’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టిపొట్టి జానపద కథల నుంచి దేశభక్తుల జీవితచరిత్ర వరకు పరిచయం చేయడం, చదివించడం చేశారు. హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్స్ పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడంతో ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయా ప్రాంతాల సంస్కృతి, వైవిధ్యం, ఆర్కిటెక్చర్‌ను కెమెరాల్లో బంధించి వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు.జాతిరత్నాలు డైరెక్టర్‌తో సినిమా రంగంలోకి...జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ కేవీతో అరవింద్‌కు ఏర్పడిన పరిచయం స్నేహం మారడంతో ఆయనకు సినిమాల్లోకి ప్రవేశం దొరికింది. ఆయన కథలను చర్చిస్తుండటం.. రాస్తుండటంతో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ప్రిన్స్ సినిమాకు రచన విభాగంలో పనిచేయడం వలన రచన నైపుణ్యాన్ని అరవింద్ నేర్చుకున్నారు.కుబేర విజయాన్ని ఆస్వాదిస్తున్నాకుబేర సినిమా మొదలవుతుంది అనుకున్న రెండు నెలల ముందు శేఖర్ కమ్ముల గారు నన్ను పిలిచారు. మొదట ఇంటర్న్షిప్గా జాయిన్ అయ్యాను. నాకు ట్రావెలింగ్ చేసిన అనుభవం ఉండడంతో ఈ సినిమా కథకు ముంబై దగ్గర్లలో లొకేషన్స్ వెతికి పెట్టే పని అప్పగించారు. ఈ క్రమంలో ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇన్చార్జిగా నియమించారు. తోట తరణి వంటి ఆర్ట్ డైరెక్టర్‌తో శేఖర్ కమ్ముల నేతృత్వంలో పనిచేయడం జీవితంలో మరిచిపోలేని మైలురాయి. డైరెక్టర్ విజన్, ప్రొడక్షన్ డిజైనర్ విజువల్ సెట్లో ప్రతిబింబించడానికి నిద్రాహారాలు పక్కనపెట్టి పనిచేశా. అయినా కష్టం అనిపించలేదు. ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రాణితో సమన్వయంలో ఉండటం వలన టీంతో రాత్రి, పగలు ఆడుతూ పాడుతూ షూటింగ్ కంప్లీట్ చేశాం. కుబేర సినిమా విజయాన్ని నేను, మా టీం సభ్యులు ఆస్వాదిస్తున్నాం.– మేడారం అరవింద్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ -
పంటల సాగులో ఎరువుల వాడకం కీలకం
ఏ దశలో, ఏ సమయంలో ఎరువులు వాడాలంటే..పంటలకు నత్రజని అవసరం చివరి దశ వరకు ఉంటుంది. నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో రెండు మూడు కీలక దశల్లో వాడుకోవాలి. ఏపుగా పెరిగేందుకు, పూత, మొగ్గ దశ, పంట దిగుబడి పెరిగే దశల్లో ప్రధానంగా వాడుకోవాలి. భాస్వరం ఎరువును విత్తే సమయంలో చివరి దుక్కిలో వేసుకోవాలి. దీంతో ఎరువు భూమిలో నిల్వ ఉండి కొద్దికొద్దిగా పంటకు అందుతుంది. పొటాష్ ఎరువులు మొక్కలో రోగ నిరోధకశక్తి పెంచటంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తి వచ్చేలా చేస్తాయి.పెద్దవూర: పంటల సాగులో ఎరువుల వాడకం కీలకమని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్ పేర్కొన్నారు. ఏయే దశల్లో ఎంత మోతాదులో ఏయే ఎరువులు వాడాలనే దానిపై రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎరువుల వినయోగానికి సంబంధించి రైతులు పాటించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు. రసాయనిక ఎరువులతో నష్టం రసాయనిక ఎరువుల వాడకం శ్రేయస్కరం కాదు. దీనివల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా భూసారంలో మార్పులు సంభవిస్తాయి. మరోవైపు పంట ఉత్పత్తుల్లో రసాయనిక అవశేషాలు మిగిలి ఉండి మార్కెట్లో దాని ప్రభావంతో డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. విరివిగా, విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వాడటం తగ్గించాలి. సేంద్రియ ఎరువులతో ఎంతో మేలు సేంద్రియ ఎరువుల వాడకం మూలంగా అధిక ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువుతో అన్ని రకాల పంటలకు పోషకాలు అందుతాయి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సొంతంగా వాటిని తయారు చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గుతాయి. పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, పచ్చిరొట్ట ఎరువులు, వ్యవసాయ వ్యర్థ పదార్థాల వాడకం, జీవన ఎరువుల వాడకం ప్రాధాన్యతను గుర్తించాలి. ఎరువుల వాడకంలో పద్ధతులు ● లోతు దుక్కుల వల్ల భూమి పొరలు గుల్లబారి తేమను బాగా నిల్వ ఉంచుకుంటాయి. నేలలో వేసిన ఎరువును ఎక్కువ శాతం మొక్కలు తీసుకుంటాయి. ● పంటలో ఉన్న కలుపును పూర్తిగా తొలగించిన అనంతరం తేమ ఉన్న దశలోనే ఎరువులు చల్లుకోవాలి. ● సమస్యాత్మక భూముల్లో ముందుగా ఉన్న సమస్యను సరిచేసుకుని ఆ తర్వాత ఎరువులు వేసుకుంటే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ● అన్ని పోషకాల్లో నత్రజని పోషకం వృథా ఎక్కువగా ఉంటుంది. యూరియాను వేప పిండితో కలిపిగానీ, యూరియా ఎరువుతో వేప నూనె కలుపుకుని గానీ వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలవుతూ వృథా తగ్గుతుంది. ● కోల్థార్తో 2 లీటర్ల కిరోసిన్‌తో మిశ్రమం చేసి రెండు బస్తాల యూరియాలో కలిపితే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా అర బస్తా యూరియాను ఒక బస్తా తడి, పొడి మట్టితో కలిపి 24గంటలు నీడలో ఉంచి ఆ తర్వాత నేలకు అందిస్తే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎరువుల ధరలపై అవగాహన అవసరం ఎరువుల వాడకం ఎంత ముఖ్యమో.. వాటి ధరలపై అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఏయే ఎరువుల్లో ఏ శాతం ఎంత ఉంటుంది. నాణ్యత, ధరలు, నకిలీలు వంటి వాటిని గమనించాలి. దీనికి వ్యవసాయ అధికారులు, అవగాహన ఉన్న రైతుల సలహాలు తీసుకోవాలి. వెదజల్లే పద్ధతి.. ప్రయోజనాలుసాధారణంగా ఎరువులను రెండు పద్ధతుల్లో వేస్తుంటారు. వెదజల్లే పద్ధతిలో మొక్కలు దగ్గర దగ్గరగా ఉంటే మేలు జరుగుతుంది. వరుస క్రమంలో లేని మొక్కలకు, వేళ్లు భూమిలో అల్లుకుపోయే పైర్లకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. వరికి కూడా ఈ పద్ధతి మేలు చేస్తుంది. పాదుల్లో ఎరువు వేసే పద్ధతిమొక్కల దగ్గర ఎరువులు వేసే పద్ధతి ద్వారా పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా కూడా తగ్గుతుంది. నిర్ణీత వరుసల్లో మొక్కలు ఉన్నప్పుడు పొలాన్ని 2 అంగుళాల మేర లోతు చేసుకుని తేమ ఉన్నప్పుడు మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు పడేలా వేయాలి. చిన్నపాటి గుంతలు తీసి ఎరువులు వేసిన సమయంలో దానిని మట్టితో కప్పేలా చేసుకోవాలి. -
ప్రభుత్వ పథకాల్లో పురోగతి తేవాలి
నల్లగొండ : ప్రభుత్వ పథకాల్లో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీఓలు పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధుల నియంత్రణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్కూల్ టాయిలెట్లు, ఇతర పనులకు సంబంధించి అంచనాలను నిర్దేశించిన సమయంలో సమర్పించాలని సూచించారు. ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో మొక్కలు నాటాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో.. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఇచ్చేందుకు అంచనాలు రూపొందించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన తోటల పెంపకంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన 3 వేల ఎకరాల లక్ష్యానికి 1,237 ఎకరాలు మాత్రమే పూర్తి చేసారని, మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు , గృహ నిర్మాణ ిపీడీ రాజ్‌కుమార్, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి నార్కట్‌పల్లి : భూ భారతి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను మూడు రకాలుగా విభజించి పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె నార్కట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి, రేషన్‌కార్డుల దరఖాస్తుల పురోగతిపై తహసీల్దార్ వెంకటేశ్వర్రావును అడిగి తెలుసుకున్నారు. మీ సేవ కేంద్రం తనిఖీ నార్కట్‌పల్లిలోని మీసేవ కేంద్రానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయంగా వెళ్లి ధ్రువీకరణపత్రాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే ఫీజులు తీసుకోవాలని మీ సేవ ఆపరేటర్‌కు సూచించారు. అనంతరం పాఠశాలకు వెళ్లి విద్యార్థుల చదువు, సౌకర్యాలను పరిశీలించారు. ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డీఈఓ భిక్షపతి, డీఎస్ఓ వెంకటేశం, మత్స్య శాఖ ఏడీ చరిత ఉన్నారు. తాగునీటి వసతి కల్పించాలి రామగిరి(నల్లగొండ) : మండలంలోని ముషంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో.. వెంటనే వాటర్ ట్యాంకు నుంచి కనెక్షన్ ఇప్పించి టాప్‌లు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి.. వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ అరుంధతి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బైక్‌కు నిప్పంటించిన దుండగులు
అడవిదేవులపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌కు నిప్పంటించారు. ఈ ఘటన అడవిదేవులపల్లి మండల కేంద్రంలో జరిగింది. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన ఉద్దండి కోటయ్య తన బైక్‌ను మంగళవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. బుధవారం ఉదయం లేచి చూడగా బైక్ కనిపించలేదు. గ్రామ సమీపంలోని వ్యవసాయ భూముల్లో బైక్ దగ్ధమవుతుండటం గమనించిన గ్రామస్తులు కోటయ్యకు సమాచారం ఇచ్చారు. కోటయ్య వెళ్లి చూడగా.. బైక్‌కు నిప్పంటించినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలి
నల్లగొండ : ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీ వేదిక అని.. కేసీఆర్, కేటీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్వించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు చేసి ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలో పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు ప్రజల సమస్యలపై అవగాహన ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కోటి, వినాయక రాజు, కార్తీక్, నాగరాజు, పాదం అనిల్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ -
పెద్దఅడిశర్లపల్లి నుంచి కుబేర వరకు..
ఫ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సత్తాచాటుతున్న మేడారం కుర్రాడు ఫ కుబేర సినిమాకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అరవింద్ ●అరవింద్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలో బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లగా.. వారితో పాటు అతడు కూడా వెళ్తూ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు పేపర్‌బాయ్‌గా, క్యాటరింగ్ బాయ్‌గా, రైస్‌మిల్లు నైట్ షిఫ్ట్ చేస్తూ సొంత ఖర్చులు సమకూర్చుకున్నారు. అంతేకాకుండా తనకు సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు, వ్యాసాలు రాస్తుండేవాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అభిరుచి ఏర్పర్చుకొని సినిమాల్లో ప్రవేశం దొరకబుచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై ఆసక్తి.. తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో అరవింద్ చదువు కొనసాగింది. తమ గ్రామం నుంచి యూనివర్సిటీకి వచ్చిన మొదటితరం విద్యార్థి అరవిందే కావడం విశేషం. మాస్ కమ్యూనికేషన్ చదువుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్‌బాయ్‌గా పనిచేయడం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ కవితలు, వ్యాసాలు రాశారు. సాహిత్య ప్రచారం.. కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం.. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని భావించిన అరవింద్ ‘ఆలోచనా’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టిపొట్టి జానపద కథల నుంచి దేశభక్తుల జీవితచరిత్ర వరకు పరిచయం చేయడం, చదివించడం చేశారు. హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్స్ పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడంతో ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయా ప్రాంతాల సంస్కృతి, వైవిధ్యం, ఆర్కిటెక్చర్‌ను కెమెరాల్లో బంధించి వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు. -
డీసీసీ నియామకం
అభిప్రాయ సేకరణ తర్వాతే..గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025ఫ ప్రజాక్షేత్రంలో పార్టీ కోసం పనిచేసే వారికే అవకాశం ఫ వారం పది రోజుల్లో రానున్న ఏఐసీసీ పరిశీలకులు ఫ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల ఖరారు ఫ ఈలోగా గ్రామ, మండల కమిటీల ఎంపికసాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను కార్యకర్తల అందరి ఆమోదంతోనే నియమించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోగా ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షులను నియమించేలా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పీసీసీ సిద్ధం చేసిన డీసీసీ అభ్యర్థుల జాబితాను పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందోనన్న చర్చ జోరందుకుంది. పీసీసీ జాబితా పక్కకు.. ఇప్పటివరకు పీసీసీ ఆమోదంతో జిల్లా అధ్యక్షులను పార్టీ నామినేట్ చేస్తోంది. అయితే ఆ విధానంపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అభివృద్ధి, విస్తరణ పక్కాగా జరగాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని ఈనెలాఖరులో చేపట్టనున్నారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాలను పీసీసీ గతంలోనే సిద్ధం చేసింది. డీసీసీ అధ్యక్షుల నియామక విధానాన్ని మార్పు చేసిన నేపథ్యంలో ఆ జాబితాను పక్కన పెట్టినట్లు తెలిసింది. తాజాగా జిల్లాలోని అందరి నేతల అభిప్రాయాలతో అధ్యక్షుల నియామకం చేపట్టే విధంగా కసరత్తు చేస్తున్నారు. అభిప్రాయ సేకరణకు కసరత్తు క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు కృషి చేసినవారు, పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన వారినే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించాలని పార్టీ భావిస్తోంది. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ అంటిపెట్టుకుని, పార్టీ పటిష్టతకు కృషి చేయడడంతో పాటు కార్యకర్తలకు వెన్నంటి ఉన్న నాయకులకు అవకాశం కల్పించనుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకొని జిల్లా అధ్యక్షులను నియమించేందుకు చర్యలు చేపడుతోంది. అన్ని విధాలుగా పరిశీలించాకే.. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంలో కీలమైన డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని ఏఐసీసీ పరిశీలకులు వచ్చాకే చేపట్టనుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. తెలంగాణకు కూడా వారం పది రోజుల్లో పరిశీలకులకు అధిష్టానం నియమించే అవకాశం ఉంది. ఏఐసీసీ అబ్జర్వర్లు వచ్చాక వారితోపాటు ఇటీవల అధిష్టానం నియమించిన జిల్లా ఇన్చార్జిలు, పీసీసీ ప్రతినిధులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదంతో పీసీసీ.. డీసీసీ అధ్యక్షులను ఖరారు చేసి జాబితాను అధిష్టానానికి పంపించనుంది. ఈ క్రమంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారెవరు, అధ్యక్ష పదవికి పోటీ పడుతుంది ఎవరు, వారు ఏ మేరకు పార్టీకి పని చేశారు, వారికి ఇవ్వడం సమంజసమేనా అనే విషయాలను పరిశీలించి అవకాశం కల్పిస్తారు. న్యూస్‌రీల్ -
రేపు ఎంజీయూలో స్క్రాప్ వేలం
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్మాణాల సందర్భంగా పోగుపడిన పాత ఇనుము, చెక్క ఇతర స్క్రాప్‌ను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ అల్వాల రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వ్యాపారులు రూ.2 వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9948361250 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. నిబంధనలు పాటించని ఆర్ఎంపీలపై కేసు నమోదుకొండమల్లేపల్లి: దేవరకొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న పలువురు ఆర్ఎంపీలపై పోలీసులు బుధవారం కేసులు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు రాము ఫిర్యాదు మేరకు దేవరకొండ పట్టణంలోని సాయిరాం క్లినిక్ నిర్వాహకుడు రాజేశ్వరరావు, అల్ఫా క్లినిక్ నిర్వాహకుడు జహంగీర్, ఆకాశ్ కంటి ఆస్పత్రి నిర్వాహకుడు రమేష్, మారుతీ క్లినిక్ నిర్వాహకుడు సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్యకనగల్: నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రానికి చెందిన గోనెల చిన్న యాదయ్య(45) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్య తనకున్న కొద్దిపాటి భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేయటంతో పాటు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావటం కుటుంబ ఖర్చులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. భార్య కాశమ్మతో తరచూ గొడవలు రావడంతో వారం రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన చిన్న యాదయ్య బుధవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన యాదయ్య తల్లి లింగమ్మకు కొడుకు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రామయ్య తెలిపారు. -
బంగారం దొంగిలించిన నిందితుల రిమాండ్
పెన్‌పహాడ్: బంగారం దొంగిలించిన ఇద్దరు నిందితులను పెన్‌పహాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఎస్ఐ గోపికృష్ణ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారును ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద 4.7తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఉన్నట్లు గుర్తించారు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా.. వారిలో ఒకరు పాత నేరస్తుడు ఖమ్మంపాటి నాగేశ్వర్రావు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. గత నెల 20న పెన్‌పహాడ్ గ్రామంలో గుండపనేని వెంకట్రావు ఇంట్లో 4.7 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించారు. అదేవిధంగా ఈ నెల 5న నాగేశ్వర్రావు, మరో నిందితుడు మామిడి జనార్ధన్ కలిసి దూపహాడ్ గ్రామానికి చెందిన పత్తిపాక సైదులు ఇంట్లో రూ.2వేలు నగదు దొంగిలించారని డీఎస్పీ తెలిపారు. దొంగతనం చేసిన బంగారం విక్రయించేందుకు వెళ్తుండగా.. నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామాల్లోనే విత్తనోత్పత్తి!
ఫ జిల్లాలోని 564 రెవెన్యూ గ్రామాల్లో 1,692 మంది రైతుల ఎంపిక ఫ వారికి వరి, పెసర విత్తనాలు అందజేత ఫ దిగుబడి వచ్చాక ఇతర రైతులకు పంపిణీ చేసేలా ప్రణాళిక నాణ్యమైన విత్తనాలు లభిస్తాయి రైతులు స్వతహాగా విత్తనాలను పండించుకోవడంతో ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నకిలీ విత్తనాల బెడద ఉండదు. నాణ్యమైన విత్తనాలు స్వగ్రామంలోనే లభించటంతో రైతులకు లాభసాటిగా ఉంటుంది. తక్కువ ధర, నాణ్యమైన విత్తనం రైతుకు అందుతుంది. భవిష్యత్‌లో గ్రామాలే విత్తన కేంద్రాలుగా మారుతాయి. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓపెద్దవూర: రైతులు ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడకుండా అవసరమైన విత్తనాలను స్వతహాగా తయారు చేసుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. పూర్వం రైతులు మేలైన దిగుబడిని సేకరించి భద్రపర్చుకుని వాటిని మరుసటి ఏడాదికి విత్తనాలుగా ఉపయోగించేవారు. మళ్లీ ఈ పద్ధతిని ప్రోత్సహించే దిశగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, అనుబంధ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ప్రణాళికలు రూపొందించాయి. వరి, పెసర విత్తనోత్పత్తి చేసేందుకు గాను రెవెన్యూ గ్రామాల వారీగా రైతులను ఎంపిక చేశాయి. వారికి కావాల్సిన విత్తన సీడ్‌ను ఆయా క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల్లో 95శాతం సబ్సిడీపై అందించారు. జిల్లాలో 564 గ్రామాల్లో 1,692 మందికి.. జిల్లా వ్యాప్తంగా 564 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. గ్రామానికి ముగ్గురు రైతుల చొప్పున 1,692 మంది రైతులను విత్తనోత్పత్తి కోసం ఎంపిక చేశారు. వీరిలో వరి విత్తనోత్పత్తికి ఇద్దరిని (1,128 మంది), పెసరకు ఒకరి చొప్పున ఎంపిక చేశారు. రైతు వేదికల్లో నిర్వహించిన ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా ఆయా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ విత్తనాలతో 1,128 ఎకరాల్లో వరి, 564 ఎకరాల్లో పెసర సాగు కానుంది. వరిలో డబ్ల్యూజీఎల్ 44, డబ్ల్యూజీఎల్ 1246, డబ్ల్యూజీఎల్ 1355, పెసర ఎంజీజీ 385 రకాలను ఎంపికై న రైతులకు 95శాతం సబ్సిడీపై కేవలం రూ.50కే అందజేశారు. ఈ విత్తనాలను సాగు చేసిన రైతులు పంట ఉత్పత్తిని గ్రామంలోని తోటి రైతులకు అందజేయాల్సి ఉంటుంది. నిరంతరం శాస్త్రవేత్తల పర్యవేక్షణ వరి, పెసర విత్తనాలను ఇవ్వడమే కాకుండా వరి నారు సిద్ధం కాగానే వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది. నాటు ఎలా వేయాలి, ఎంతమేర మందులు వాడాలి, నీరు ఏ మోతాదులో అందించాలి, కలుపు తీసే విధానం, సస్యరక్షణ చర్యలపై ఎప్పటిప్పుడు రైతులకు సూచనలు, సలహాలు అందజేసి పంట పూర్తయ్యే వరకు పర్యవేక్షించనుంది. చివరగా పంట కోత దశలో క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు. క్షేత్ర స్థాయిలో రైతు నుంచి మరో రైతుకు విత్తనాలు అందించేలా చర్యలు తీసుకుంటారు. కల్తీ విత్తనాలకు చెక్ కల్తీ విత్తనాలతో ఏటా ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటిని తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులే స్వతహాగా విత్తనాలను పండించడంతో తిప్పలు తప్పనున్నాయి. ఈ విత్తనోత్పత్తి అంతకంతకు పెరిగితే కల్తీ విత్తనాలు విక్రయించే మోసగాళ్లకు చెక్ పెట్టవచ్చు. -
గూడ్స్‌రైలు కింద పడి మహిళ దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్: గైడ్స్ రైలు కింద పడి గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. రైల్వే ఎస్ఐ బి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45ఏళ్ల వయస్సున్న మహిళ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ యార్డ్‌లో రైలు పట్టాలు దాటుతుండగా ప్లాట్‌ఫాం–2 వద్ద గూడ్స్ రైలు కింద పడి మృతిచెందింది. మృతురాలు నీలం రంగు జాకెట్, నారింజ రంగు చీర ధరించి ఉందని, 5.4 అంగుళాల ఎత్తు ఉంటుందని రైల్వే ఎస్ఐ తెలిపారు. పాముకాటుతో.. బీబీనగర్: కూలీ పనికి వెళ్లిన మహిళకు పాముకాటుతో మృతి చెందింది. ఈ ఘటన బీబీనగర్ మండలం రహీమ్‌ఖాన్‌గూడెం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామానికి చెందిన గంగదారి ఉమ(50) భర్త గతంలోనే మృతిచెందడంతో ఆమె తన పుట్టిల్లు అయిన రహీమ్‌ఖాన్‌గూడెం గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. ఉమ రోజుమాదరిగా బుధవారం కూలీ పనికి వెళ్లగా.. పని ప్రదేశంలో పాము కాటు వేయడంతో స్పృహ కోల్పోయి మృతిచెందింది. తాటిచెట్టు పైనుంచి కిందపడి గీత కార్మికుడు.. కేతేపల్లి: తాటిచెట్టు పైనుంచి కిందపడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చీకటిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు ఆల్దాసు జానయ్య(40) బుధవారం సాయంత్రం గ్రామంలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారి కిందిపడ్డాడు. అతడి నడుముకు ఉన్న ముస్తాదు, మోకు మెడ చుట్టూ బిగుసుకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. మృతుడు జానయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు కేతేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు కొండమల్లేపల్లి: దేవరకొండ పట్టణంలోని గణేష్‌నగర్‌లో వ్యభిచార గృహాలపై పోలీసులు బుధవారం దాడులు చేసి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరు మహిళలు, 8మంది పురుషులు ఉన్నట్లు సీఐ నరసింహులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి మిర్యాలగూడ అర్బన్: అనారోగ్యంతో బాధపడుతూ మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వ్యక్తి బుధవారం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70150, 87125 77233 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. -
నేడు బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవం
నాగార్జునసాగర్: సిద్దార్డుడికి జ్ఞానోదయం అయ్యి గౌతమ బుద్ధుడిగా మారిన తర్వాత మొదటి బోధన చేసిన రోజును స్మరించుకుంటూ గురువారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గౌతమి బుద్ధుని జీవితంలో ముఖ్యమైన ఐదు ఘట్టాలలో ఒకటి మొదటి ఉపన్యాసం. దీనిని ధర్మచక్ర పరివర్తన అనిపిలుస్తారు. బౌద్ధులు, బౌద్ధ అభిమానులు ఈ రోజును ప్రత్యేక దినంగా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించిన మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీఎస్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగులు తెలిపారు. ఉదయం 11గంటలకు కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమానికి బౌద్ధ సంఘం ప్రతినిధులు, ఇతర ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు తరలిరానున్నారు. -
కదంతొక్కిన కార్మికలోకం
సాక్షి, నెట్వర్క్ : కార్మికుల హక్కులకు బంగం కలిగించేలా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె బుధవారం విజయవంతమైంది. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ీబీఆర్టీయూ, ఐఎఫ్టీయూ, బ్యాంకు, విద్యుత్, ఆర్టీసీ, ఎల్ఐసీ, రైల్వే తదితర ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె సాగింది. జిల్లా వ్యాప్తంగా కార్మికులు విధులు బహిష్కరించి ఎక్కడిక్కడ ర్యాలీలు, బహిరంగ సభలతో నిరసన తెలిపారు. లబర్ కోడ్ల వల్ల ఉద్యోగుల భద్రతకు ముప్పు కలుగుతుందని ట్రేడ్ యూనియన్లను, ఉద్యోగుల, కార్మికుల సంఘటిత శక్తిని బలహీన పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల పొట్టగొడుతు కార్పొరేట్లకు దోచి పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకునేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ● నల్లగొండలో నిర్వహించిన సమ్మెలో భాగంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, క్లాక్‌టవర్ వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ సమ్మెతో నైనా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వెంటనే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ● దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా సమ్మె సాగింది. ఆయా మండలాల్లో కార్మికులు ర్యాలీలు నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ● మిర్యాలగూడ నియోజవర్గంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య పార్క్ నుంచి బస్టాండ్ రాజీవ్‌చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దామరచర్ల, మాడ్గులపల్లి మండల కేంద్రాల్లో అద్దంకి– నార్కట్‌పల్లి రహదారిపై ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ● నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. మండల కేంద్రాల్లో కార్మికులు ర్యాలీలు చేపట్టారు. చిట్యాలలో పీఆర్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ● నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కార్మికులు, ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. హాలియాలో కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ● మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కార్మిక, రైతులు సంఘాల ఆధ్వర్యంలో సమ్మెల సాగింది. మునుగోడులో రైతులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. చండూరు బస్టాండ్ ఎదుట కార్మిక సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు.ఫ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం ఫ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మికుల డిమాండ్ -
హాట్ కేకుల్లా హౌసింగ్ బోర్డు ప్లాట్లు
నల్లగొండ : నల్గగొండలోని దేవరకొండ రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీలోని హెచ్ఐజీ, ఎంఐజీ ప్లాట్లు మంచి ధర పలికాయి. మంగళవారం నిర్వహించిన వేలంలో 21 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ విక్రయాల ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.8,97,48,600 ఆదాయం వచ్చింది. పలు ప్లాట్లను నిర్ణయించిన ఆఫ్సెట్ ధర కంటే రెట్టింపు రేటుకు అమ్ముడయ్యాయి. హెచ్ఐజీ, ఎంఐజీకి చెందిన 27 ప్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. చదరపు గజానికి హెచ్ఐజీ ప్లాటుకు రూ.15 వేలు, ఎంఐజీ ప్లాటుకు రూ.13 వేలుగా ఆఫ్ సెట్ ధర నిర్ణయించింది. వేలంలో హెచ్ఐజీ ప్లాట్లు గరిష్టంగా రూ.28,500, ఎంఐజీ ప్లాట్లు రూ.23,500 వరకు ధర పలికాయి. కాలనీలో 4660 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించగా, ఒక్కో చదరపు గజానికి సగటున రూ.19,069 ధర పలికినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫ నల్లగొండలో చదరపు గజం గరిష్టంగా రూ.28,500 ఫ 21 ప్లాట్ల అమ్మకంతో సుమారు రూ.8.97 కోట్ల ఆదాయం -
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా మధుబాబు
నల్లగొండ టూటౌన్ : వరంగల్‌లో పని చేస్తున్న ప్రొపెసర్ డాక్టర్ సిహెచ్.మధుబాబును పదోన్నతిపై నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతోపాటు సూర్యాపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ జె.సత్యనారాయణను నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న డాక్టర్ రాజలింగంను జనగాం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ చేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పి.శ్రవణ్‌కుమార్‌ను సూర్యాపేట జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొపెసర్ రాజ్యలక్ష్మిని వికారబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా, యాదాద్రి భువనగిరిలోని మెడికల్ కాలేజీలో పని చేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ పి.మాలతిని కొడంగల్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. యాదాద్రి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసున్న వెంకటేశ్వర్లును జె.భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న ఈఎన్టీ డాక్టర్ శంకర్‌ను ఖమ్మం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దుమునుగోడు : పంచాయతీ ఉద్యోగులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహింస్తే శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య హెచ్చరించారు. మంగళవారం ఆయన మునుగోడు మండలంలోని సొలిపురం గ్రామాని సందర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మునుగోడులోని బీసీ గురుకులానికి వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయభాస్కర్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నేటి సమ్మెను విజయవంతం చేయాలినల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలో మంగళవారం మగ్దూం బవన్‌లో జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఈ నెల 15న దేవరకొండలో పార్టీ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, పబ్బు వీరస్వామి, ఆర్.అంజచారి, వెంకట రమణ, బంటు వెంకటేశ్వర్లు, నరసింహ, రామచంద్రం, రామలింగయ్య, టి.వెంకటేశ్వర్లు, ఉజ్జిని యాదగిరిరావు పాల్గొన్నారు. -
మండలానికి 5 తగ్గకుండా
ఎంపీటీసీ స్థానాల పునర్విభజన నేటి వరకు అభ్యంతరాలు స్వీకరణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా పునర్వ్యవస్థీకరించి అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా జాబితా ప్రకటించారు. వాటిపై మంగళవారం అభ్యంతరాలను స్వీకరించారు. బుధవారం కూడా స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను 10, 11 తేదీల్లో పరిష్కరిస్తారు. ఆ తరువాత అవసరమైన మార్పులు, చేర్పులతో 12వ తేదీన తుది ఎంపీటీసీ నియోజకవర్గాల జాబితాను ప్రకటిస్తారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ముసాయిదాను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో మారనున్న ఎంపీటీసీ స్థానాల ముసాయిదా జాబితాను ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులో పెట్టింది. ప్రతి మండలంలో ఐదుకు తగ్గకుండా ఎంసీటీసీ స్థానాలు ఉండేలా ముసాయిదా సిద్ధం చేశారు. దీంతో నల్లగొండ జిల్లాలో ఐదు మండలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు కొత్త మండలాల్లో ఐదు చొప్పున ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు మార్పులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మండలాలు పెరగడం, కొన్ని గ్రామాలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు పెరగ్గా, కొన్నింటిని ప్రభుత్వం కుదించింది. దాంతో కొన్ని మండలాల్లో నాలుగు కంటే తక్కువగా ఎంపీటీసీ నియోజక వర్గాలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంపీటీసీ (మండల ప్రాదేశిక నియోజక వర్గం) పునర్విభజనకు సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతి మండలంలో ఐదు స్థానాలకు తగ్గకుండా ఉండేలా నియోజక వర్గాల పునర్విభజన చేయాలని పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. దాని ప్రకారం జిల్లాలో మంగళవారం అన్ని మండల పరిషత్‌లలో ఎంపీటీసీ ముసాయిదా జాబితాను ప్రచురించారు. పెరిగిన మూడు ఎంపీటీసీలు జిల్లాలో జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలు పెరుగుతున్నాయి. వాటితో పాటు కొత్తగా 2 మండలాలు కూడా ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని మండలాల్లో ఎంపీటీసీ స్థానాలను తొలగించి కొత్త మండలాలకు కలిపారు. మరికొన్నింటిని సర్దుబాటు చేశారు. ఇంకొన్నింటిలో తగ్గించారు. 2019 ఎన్నికల సమయంలో 349 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 3 పెరిగాయి. దీంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 352కి చేరుకుంది. అత్యధికంగా మిర్యాలగూడలో 19, నార్కట్‌పల్లిలో 15, చింతపల్లి, దామరచర్లలో 14 చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మిగిలిన వాటిలో 12 నుంచి 5 తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎంపీటీసీ స్థానాల మార్పులు ఇలా.. ● జిల్లాలోని చండూరు నుంచి కొత్తగా గట్టుప్పల్ మండలం ఏర్పడింది. చండూరు మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానాలుంటే వాటిల్లో 3 ఎంపీటీసీ స్థానాలైన గట్టుప్పల్–1, గట్టుప్పల్–2, తేరట్పల్లిని తొలగించి 8 స్థానాలకు పరిమితం చేశారు. ఆ మూడు ఎంపీటీసీలను గట్టుప్పల్ మండలంలో కలిపారు. ● మర్రిగూడ మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా అందులో ఒక ఎంపీటీసీ స్థానం అంతంపేటను మర్రిగూడ నుంచి తొలగించి గట్టుప్పల్ మండలంలో కలిపారు. ● మునుగోడు మండలంలోని వెల్మకన్నెను అక్కడి నుంచి తొలగించి, దానిని గట్టుప్పల్‌లో కలిపి ఐదు ఎంపీటీసీ స్థానాలను చేశారు. ● మునుగోడు మండలంనుంచి వెల్మకన్నెను తొలగించిన నేపథ్యంలో అంతకుముందు వెల్మకన్నె పరిధిలో ఉన్న చల్మెడ, పలివెల ఎంపీటీసీ స్థానం పరిధిలోని కోతులారంను కలిపి చల్మెడ ఎంపీటీసీ స్థానంగా మార్చి, గతంలో ఉన్నట్లుగానే 13 స్థానాలకు సర్దుబాటు చేశారు. ● చింతపల్లి మండలంలో 13 ఎంపీటీసీలు ఉండగా ఆ మండలంలో అదనంగా 1 ఎంపీటీసీ స్థానాన్ని పెంచింది. ఆ మండలంలోని గొడకొండ్ల కొత్తగా ఎంపీటీసీగా ఏర్పాటు చేయడంతో అక్కడ ఎంపీటీసీల సంఖ్య 14కు చేరింది. ● పీఏపల్లి మండలంలో గతంలో 14 ఎంపీటీసీ స్థానాలుంటే వాటిని పదికి కుదించారు. 4 ఎంపీటీసీ స్థానాలను గుడిపల్లి మండలంలో కలిపారు. గుడిపల్లిని కూడా కొత్తగా ఎంపీటీసీ నియోజక వర్గం ఏర్పాటు చేశారు. ● ఇంతకుముందు పీఏపల్లి పరిధిలో ఉన్న గుడిపల్లి, పోల్కంపల్లి, భీమనపల్లి, ఘనపురంను గుడిపల్లి ఎంపీటీసీలను మండల పరిఽధిలోకి తెచ్చారు. అలాగే అంగడిపేట ఎంపీటీసీ పరిధిలో ఉన్న చిల్కమర్రిని ఎంపీటీసీ స్థానంగా చేసి గుడిపల్లి పరిధిలోకి తెచ్చారు. ఫ జిల్లాలో 352కు పెరిగిన ఎంపీటీసీలు ఫ ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరణ ఫ 12న తుది జాబితా ప్రకటన -
మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి
నాంపల్లి : మహిళలు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ భవానితో మాట్లాడారు. గత నెల ఎన్ని కాన్పులు చేశారని కలెక్టర్ ప్రశ్నించగా రెండు కాన్పులు చేసినట్లు భవాని తెలిపారు. రోగులకు ఆరోగ్య విద్యపై నిర్వహించిన అవగాహన సదస్సుకు రోగులు, కుటుంబ సభ్యులు హాజరు కావడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణను శుభ్రం చేయించి మొక్కలు నాటించినందుకు సిబ్బందిని అభినందించారు. అంతకుముందు కలెక్టర్ కేజీబీవీనీ సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్, ఇతర సమస్యలను కలెక్టర్ దృష్టికి సిబ్బంది తీసుకురాగా వెంటనే నివేదిక పంపించాలని ఎంపీడీఓ శ్రీనివాసశర్మను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి దరఖాస్తులన్నింటిని ఆగస్టు 14వ తేదీలోగా పరిష్కరించాలని తహసీల్దార్ జి.దేవసింగ్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీవో శ్రీదేవి, ఎంపీఓ ఝాన్సీ, ఆర్ఐ విజయ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఫార్మర్ రిజిస్ట్రీపై అనాసక్తి!
నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది 6వ తేదీన ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 5.60 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగిన రైతులు ఉండగా.. ఇప్పటి వరకు లక్షా 80 వేల మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రిజిస్ట్రి ప్రకియ ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు సగం మంది రైతులు కూడా నమోదు చేయించుకోలేదు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గుర్తింపు కార్డులో 11 అంకెల యూనిక్ ఐడీ కేటాయించనున్నారు. భవిష్యత్‌లో ఈ గుర్తింపు కార్డు ద్వారానే రైతులకు పథకాలు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం చూడనుంది. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతులకు వ్యవసాయ శాఖ సూచిస్తోంది. కేంద్ర పథకాలకు యూనిక్ నంబర్ తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్నిధి, సాయిల్ హెల్త్‌కార్డు, పసల్ బీమా తదితర పథకాలు వర్తించాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి. భవిష్యత్‌లో ఎరువుల పంపిణీ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకే ఉండనుంది. కొత్తగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాలో జమ కావాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాలకే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటున్నా.. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉండాలనే నిబంధన వచ్చే అవకాశం ఉంది. పార్మర్ రిజిస్ట్రేషన్‌తో ప్రయోజనాలు.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంతో రైతులకు 11 అంకెల యూనిక్ ఐడీ కార్డు వస్తుంది. దీంతో రైతుల భూముల వివరాలతో పాటు నేల స్వభావం, సర్వే నంబర్లు, సాగు చేస్తున్న పంటల వివరాలు, రైతులకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. వివరాలన్నీ ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తుండటంతో ఒక్క క్లిక్‌తో రైతుల వివరాలు అందుబాటులోకి వస్తాయి. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో రైతుల వివరాలు ఎంటర్ చేయగానే పంటలకు సంబంధించి వివరాలు తెలుస్తాయి. ఈ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం పథకాలు అందేలా చేస్తుంది. ఫ జిల్లాలో 5.60 లక్షల మంది రైతులకు.. 1.80 లక్షల మంది నమోదు ఫ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఫ అవగాహన లేక రిజిస్ట్రేషన్చేయించుకోని రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇలా.. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత ఏఈఓ, ఏఓకు వివరాలు సమర్పించాలి. ఇందుకోసం రైతులు తమ ఆధార్‌కార్డుతో పాటు ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లాలి. రైతుల వివరాలు నమోదు చేసేటప్పుడు ఫోన్‌కు మూడు సార్లు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడీ కార్డు వస్తుంది. ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు ఫార్మర్ యూనిక్ ఐడీ కార్డు తప్పనిసరి. రైతులు వెంటనే తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు మండల వ్యవసాయాధికారిని కలిసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. – శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలి
నల్లగొండ : ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పీకి మించి ఎరువులను అమ్మిన డీలర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ‘యూరియా అమ్మకాల నిలిపివేత’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. జిల్లాలో యూరియాతో సహా అన్ని ఎరువులు సరిపోయినంతగా నిల్వలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రోజూ 9000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని తెలిపారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు నెలకు అవసరమైన బఫర్ ఎరువులను సిద్ధంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ డీలర్లు ఎమ్మార్పీకే ఎరువులను విక్రయించాలని, యూరియాకు ఇతర ఎరువులతో లింకు పెట్టవద్దని సూచించారు. ఎరువుల దుకాణాల తనిఖీ మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎరువుల స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మార్పీ ధరలకే యూరియా విక్రయించాలని, అధిక ధరకు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రవాణా చార్జీల భారం పడుతుందని యూరియా విక్రయాలు బంద్ పెట్టొద్దని సూచించారు. ఈ వానాకాలం సీజన్లో 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు 8వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. మంగళవారం వరకు 22వేల మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీలు, డీలర్లు, ఎన్డీసీఎంఎస్ వద్ద అందుబాటులో ఉందని, 10వేల మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్ గోదాములో నిల్వ ఉందన్నారు. వెయ్యి టన్నుల యూరియా కంపెనీ వద్ద నిల్వ చేసుకున్నారని తెలిపారు. ఆయన వెంట ఇన్చార్జి ఏడీఏ సైదానాయక్, జవహర్‌బాబు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సారొస్తారు.. ఆటోలో తెస్తారు..
నల్గొండ జిల్లా: బడికి రాని పిల్లలను బడికి రప్పించే విషయంలో ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసలు అందుకుంటున్నా యి. నల్లగొండ జిల్లాలో ఓ ఉపాధ్యా యుడు బడికి రాని విద్యార్థులను వారింటికి వెళ్లి మరీ బడికి తీసుకొ స్తుంటే.. మరో ఉపాధ్యాయుడు పిల్లల కోసం అద్దెకు తీసుకుని ఆటో ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కాశవారిగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం 13 మంది విద్యార్థులు చేరారు. అయితే, కొందరు విద్యార్థులు పాఠశా లకు సక్రమంగా రాకుండా ఇంటి వద్దే ఉంటుంటారు. దీంతో ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉమాశంకర్‌గౌడ్, జాన్‌రెడ్డి విద్యార్థుల ఇంటికి వెళ్లి తమ బైక్‌పై ఎక్కించుకొని పాఠశాలకు తీసుకొచ్చి పాఠాలు బోధిస్తున్నారు. దాత సాయంతో ఆటో తెచ్చి...వరంగల్ జిల్లా నెక్కొండలోని హైస్కూల్‌కు పిల్లలను పంపాలని ఉపాధ్యాయులు సమీ పంలోని గుండ్రపల్లి, మడిపల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పదిమంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశా లకు పంపేందుకు ఒప్పుకున్న తల్లిదండ్రులు.. రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఆ పాఠశాల ఉపాధ్యా యుడు వంగర లక్ష్మణ్ విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్‌ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన ప్రతినెలా ఆటోవాలాకు రూ.6,500 చెల్లించేలా ఒప్పుకున్నాడు. దీంతో సోమవారం పిల్లలు ఆటోలో స్కూల్‌కు వచ్చారు. -
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా సంపత్‌కుమార్
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ ఇన్చార్జిగా.. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నియామకం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జిలను నియమించింది. ఈ మేరకు పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏఐసీసీ సెక్రటరీ ఎస్.సంపత్‌కుమార్ నియమితులయ్యారు. పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణనల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ 68 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని పూర్తి వివరాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు. ‘యూత్ ఫర్ సేవ’తో ఎన్జీ కళాశాల ఒప్పందంరామగిరి(నల్లగొండ) : పట్టణంలోని ఎన్జీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం యూత్ ఫర్ సేవ సోమవారం అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రయోజనానికి ఫిజిక్స్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయో సైన్స్, సోషల్ సైన్స్ అంశాలపై పోస్టర్లు తయారు చేశారు. పోస్టర్లను నల్లగొండలోని ప్రభుత్వ పాఠశాలలకు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, యూత్ ఫర్ సేవా డిస్ట్రిక్ కోఆర్డినేటర్ స్వామి, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపకులు ఎం.వెంకట్‌రెడ్డి, డాక్టర్ వేముల వెంకటేశంతదితరులు పాల్గొన్నారు. టీబీ నిర్మూలనకు సమష్టి కృషినల్లగొండ టౌన్ : టీబీ నిర్మూలన కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమష్టిగా కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ కోరారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా బీబీ నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలపై సంబంధిత సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీబీ పరీక్షలను చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, పద్మ, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాలల సందర్శనతిప్పర్తి, కనగల్ : తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారి భీమ్‌సింగ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయా చోట్ల రికార్డులను పరిశీలించి మాట్లాడారు. కళాశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సమ యం కేటాయించాలని సూచించారు. క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.10 వేలు కేటాయిస్తామన్నారు. ఆయన వెంట డీఐఈఓ దస్రునాయక్ తదితరులు ఉన్నారు. -
యూరియా అమ్మకాల నిలిపివేత
ఎమ్మార్పీకి అమ్మలేమంటున్న ఎరువుల డీలర్లుఫ రవాణా భారం తగ్గించాలని డిమాండ్ ఫ కాంప్లెక్స్ ఎరువు కొంటేనే.. యూరియా సరఫరా చేస్తామని ప్రభుత్వం మెలిక ఫ సకాలంలో యూరియా అందక అవస్థలు పడుతున్న రైతులు ఎరువులపై ఆందోళన వద్దునల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన నల్లగొండ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. రైతులు అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు. వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మార్పీకి ఎరువులను విక్రయించాలని వాటికి ఇతర ఎరువులతో లింకులు పెట్టవద్దు సూచించారు. ఆయన వెంట ఏఓ శ్రీనివాస్ ఉన్నారు. మిర్యాలగూడ : వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఎరువుల వాడకం పెరిగింది. ఎరువులపై సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు కేంద్రం యూరి యా కావాలంటే కాంప్లెక్స్ ఎరువులు కొనాలని లింక్ పెట్టింది. రూ.6 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులను అమ్మితేనే.. రూ.లక్ష విలువ చేసే యూరి యాను సరఫరా చేస్తామని షరతు పెట్టింది. ద్రవ రూపంలో ఉండే నానో యూరియా, డీఏపీ వాడకాన్ని పెంచాలని సూచిస్తోంది. మరోవైపు ప్రైవేట్ డీలర్లకు కంపెనీలు యూరియా సరఫరాను తగ్గించాయి. వచ్చే కాస్త యూరియాకు రవాణా చార్జీల భారం పడుతుండడంతో జిల్లాలో డీలర్లు అమ్మకాలు నిలిపివేశారు. దీంతో ఎరువుల కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. ఎమ్మార్పీకి మించి అమ్మొద్దని ఆదేశాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 700కు పైగా ప్రైవేట్ డీలర్లు, 300 పీఏసీఎస్‌లు, 75 రైతు సేవా కేంద్రాలు, 50 వరకు ఎన్డీసీఎంఎస్ కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే యూరియాలో 60 శాతం ప్రభుత్వరంగ సంస్థలకు, 40శాతం ప్రైవేట్ డీలర్లకు కేటాయిస్తారు. యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.266 ఉండగా.. ఎమ్మార్పీ కంటే రూపాయి కూడా పెంచి విక్రయించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వమే రవాణా చార్జీలు భరిస్తుండగా.. ప్రైవేట్ డీలర్లు మాత్రం వారే రవాణా చార్జీలు భరించాల్సి వస్తోంది. దీంతో ఎమ్మార్పీకి యూరియా విక్రయిస్తే బస్తాపై రూ.20 నుంచి రూ.25 వరకు వారు నష్టపోతున్నారు. యూరియా బస్తాపై రవాణా చార్జీ రూ.10 నుంచి రూ.12, హమాలీకి మరో రూ.10 ఖర్చు అవుతుంది. దీంతో వారు తమ లాభాన్ని పరిగణనలోకి తీసుకోని బస్తా రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఎమ్మార్పీకి మించి విక్రయించొద్దని ఆదేశిస్తుండడంతో ప్రైవేట్ డీలర్లు అమ్మకాలు నిలిపివేశారు. రవాణా, ఇతర చార్జీలు కూడా ప్రభుత్వం భరించి తమకు నేరుగా యూరియాను సరఫరా చేయాలని కోరుతున్నారు. లేదంటే ఎమ్మార్పీకి కాకుండా తమకు గిట్టుబాటు అయిన ధరకు యూరియా అమ్ముకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డీలర్లు కోరుతున్నారు. మిర్యాలగూడలోని ఎరువుల గోదామురవాణా చార్జీలను ప్రభుత్వమే భరించాలి ప్రభుత్వం అందించే ఎరువులకు యూరియా లింక్ పెట్టి డీలర్లను ఇబ్బంది పెడుతోంది. యూరియా దిగుమతి, రవాణ చార్జీల భారం డీలర్లపై వేస్తోంది. దీంతో బస్తాకు రూ.25 నుంచి రూ.40 వరకు ఖర్చు వస్తోంది. ఎమ్మార్పీకి యూరియాను విక్రయిస్తే మాకు నష్టం వస్తుంది. ప్రభుత్వం స్పందించి సొసైటీల మాదిరిగానే డీలర్లకు కూడా రవాణా చార్జీలపై మినహాయింపు ఇవ్వాలి. – తెడ్ల జవహర్‌బాబు, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిౖసైడ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎక్కువ ధర పెట్టి కొంటున్నాం ప్రతి సీజన్లో యూరియా అధిక ధరలకు అమ్ముతూ రైతులపై భారం మోపుతున్నారు. ఈ సీజన్లో ఎన్డీసీఎంఎస్ పేరిట డీలర్లు యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారు. సొసైటీల్లో సకాలంలో యూరియా దొరకకపోవడంతో ఎక్కువ ధర పెట్టి యూరియాను కొంటున్నాం. – అనుముల శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, త్రిపురారం రైతుల పడిగాపులు వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ల డీలర్లు యూరియాను విక్రయించకపోవడంతో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు వచ్చిన యూరియా గంటల వ్యవధిలోనే అయిపోతోంది. ప్రైవేట్ డీలర్లు యూరియా అమ్మితే తమకు ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపి డీలర్ల సమస్యను పరిష్కరించి యూరియా అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. -
భూ సమస్యలకు పరిష్కారం చూపాలి
హాలియా : పేదలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించ విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార ఫౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని భూ సమస్యలపై మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, రెవెన్యూశాఖ సెక్రటరీ డిఎస్ లోకేష్‌కుమార్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ రత్నాకర్‌తో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. చిన్నచిన్న సమస్యలను సాకుగా చూపించి సమస్యను జఠిలం చేయవద్దని ఆటవీశాఖ అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీశాఖకు చెందినవని అటవీ అధికారులు కొర్రీలు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఫ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫ సాగర్ భూ సమస్యలపై సచివాలయంలో సమావేశం -
ఏసీబీకి చిక్కుతున్నా.. లంచాలు ఆగట్లే
ఆయిల్‌పామ్ సాగుతో అధిక దిగుబడిమంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025ఉమ్మడి జిల్లాలో ఏడు నెలల్లో పట్టుబడిన ఏడుగురు అధికారులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా మారుతున్నారు. అవినీతికి పాల్పడుతూ ఉమ్మడి జిల్లాలో నెలకొకరు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. నెలవారీ వేతనాలు వస్తున్నా.. పనుల కోసం తమ వద్దకు వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారిని ఏసీబీ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేస్తున్నప్పటికీ అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. గడిచిన రెండేళ్లలో 18 వరకు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. 2024లో 11 మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడుగురు ఏసీబీ వలలో చిక్కారు. జిల్లాలో ఈ ఏడాది కేసులు ఇలా... ● తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో జనవరి 12వ తేదీన పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులో లంచం తీసుకుంటూ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు పట్టుబడ్డారు. ఈ కేసులో ఓ వ్యక్తి వద్ద రూ.1.40 లక్షల ముడుపులకు ఒప్పందం కుదుర్చుకొని రూ.70 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ● చౌటుప్పల్‌లో మార్చి 6వ తేదీన ట్రాన్స్‌కో ఏడీ శ్యాంప్రసాద్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫార్మా పరిశ్రమకు విద్యుత్ బకాయిలు క్లీయరెన్స్ ఇవ్వడంతో పాటు మీటర్ పునరుద్ధరణకు లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. ● ఏప్రిల్ నెలలో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్న కేసులో చింతలపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ అంతిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ● సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యుల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి రూ.16 లక్షలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో మే 12వ తేదీన వారిని పట్టుకున్నారు. ● పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో పంచాయతీ కార్యదర్శి సతీష్‌కుమార్ ఒక వ్యక్తి నుంచి రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడని ఫిర్యాదు రావడంతో జూన్ 26న ఏసీబీ అధికారులు దాడి చేసి సతీష్‌ను పట్టుకున్నారు. ● గత నెల 28న హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ (అవుట్సోర్సింగ్) విజేతారెడ్డి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి న్యూస్రీల్తాజాగా పట్టుబడిన మిర్యాలగూడ సివిల్ సప్లయీస్ డీటీ అత్యధికంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, రిజిస్ట్రేషన్ శాఖల్లోనే..కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు పీడీఎస్ బియ్యం రవాణా చేస్తూ పట్టుబడి సీజ్ అయిన లారీలను విడిపించేందుకు మిర్యాలగూడ సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ జావెద్ రూ.70 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జావేద్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నల్లగొండ డీఎస్ఓ ఆపీస్ కార్యాలయంలో, జావెద్ ఇంట్లో సోదాలు చేశారు. సోమవారం జావేద్‌ను కోర్టులో హాజరు పరచనున్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సమస్యలపై ఫిర్యాదులు అందించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు వచ్చారు. వారి నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల్లో జిల్లా అధికారులకు సంబంధించినవి 27, రెవెన్యూ 47, సబ్ కలెక్టర్‌కు 15, నల్లగొండ ఆర్డీఓకు 12, దేవరకొండ ఆర్డీఓకు 13, చండూరు ఆర్డీఓకు 4, జి సెక్షన్‌కు సంబంధించిన ఫిర్యాదులు 3 వచ్చాయి. వీటిపై అధికారులతో మాట్లాడిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. పరిష్కారానికి అనుకూలమైన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కింది స్థాయిలో పరిష్కారం కాకపోతే పైఅధికారులకు పంపాలని సూచించారు. -
బీఆర్ఎస్ నేతలవి మతిభ్రమించిన మాటలు
నకిరేకల్ : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు అద్భుతమైన పథకాలను అందిస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం, మంత్రులు గురించి మాట్లాడకపోతే బీఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వం చేపట్టిన పథకాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినా ప్రతిపక్ష నాయకుడు ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరు చెప్పుకొని పబ్లిసిటీ చేసుకుందే తప్ప రైతులకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతలు ఇంకా అహంకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా పెండింగ్‌లో ప్రాజెక్టులపై సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. సమావేశఽంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, నాయకులు చామల శ్రీనివాస్, బోళ్ల వెంకట్‌రెడ్డి, నాగులంచ వేంకటేశ్వరరావు, గాజుల సుకన్య శ్రీనివాస్, పన్నాల రాఘవరెడ్డి, నకిరేకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య, కోట మల్లికార్జున్, కొండ వెంకన్న, పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, కందాల భిక్షంరెడ్డి, యాసారపు వెంకన్న, బాణోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరశం -
అమృత్.. ఆలస్యం!
కల సాకారమయ్యేనా..? ఉమ్మడి జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలగానే మిగిలిపోతోంది. చోరీలకు పాల్పడుతున్న.. చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను ఆదివారం నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. - 8లోపైప్లైన్కు రోడ్డు పనులు ఆటంకం చండూరు : అమృత్ 2.0 కింద చండూరు మున్సిపాలిటీకి రూ.9.80 కోట్లు మంజూరయ్యాయి. వాటితో 5 లక్షల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. చండూరులోని జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో, అంగడిపేట రోడ్డులో గల వెంచర్లో చేపట్టిన ట్యాంకుల పనులు పిల్లర్ దశలో ఉన్నాయి. దాదాపు 12 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నారు. ఇప్పటికే 11 కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేశారు. జూలై 2024 న ప్రారంభించిన పనులు అగ్రిమెంట్ ప్రకారం మార్చి 2026లో పూర్తి చేయల్సి ఉన్నా 2025 నవంబర్ కల్లా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు. మిగిలిన ఒక్క కిలోమీటర్ పైపులైన్ పూర్తి చేయడానికి ప్రధాన రహదారి విస్తరణ పనులు ఆటంకంగా మారాయి. -
మునగ తోట రైతులకు ఉపాధి
నాంపల్లి : ఉపాధి హామీ పథకంలో మునగ తోట సాగుతో రైతులకు ఉపాధి లభిస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయి మాని టరింగ్ సభ్యుడు కెజి.సలీంకుమార్ అన్నారు. ఆదివారం ఆయన నాంపల్లి మండలంలోని రేక్యతండాలో పర్యటించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. అనంతరం పండ్ల తోటల పెంపకం, నర్సరీ, మునగ తోట పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునగతోటతో కుటుంబం మొత్తానికి జీవనోపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీడీ నవీన్‌కుమార్, ఎంపీడీఓ శర్మ, ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, వినోద్‌కుమార్, మంజుల, లింగయ్య, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలు పెంచుకోవాలిచిట్యాల: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని ఉమెన్స్ ఎంపవర్మెంట్ సభ్యురాలు కొండపల్లి వసుమతి, భారత్ వికాస్ పరిషత్ స్టేట్ సంపర్క్ ప్రెసిడెంట్ సతీష్‌కుమార్ అన్నారు. చిట్యాలలోని ముప్ప కాంప్లెక్స్‌లో జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి చెందుతారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ముప్ప వాసుదేవరెడ్డి, హేమలత, శ్రీలత, మంజుల, శ్రీదేవి, సత్యనారాయణ, అనిత, బొబ్బలి శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జడ్జి పూజలు కనగల్ : దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం జిల్లా ఉమెన్స్ కోర్ట్ జడ్జి కె.కవిత ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. సివిల్స్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులునల్లగొండ : ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2025 –26 సంవత్సరానికిగాను సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిద్ది శాఖ అధికారి బి.శశికళ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ (బీసీ ఈ, పీడబ్ల్యూడీ) కులాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు www.tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 7లోగా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగే రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతితో 10 నెలలు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040–23546552, 9396621492 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. నారసింహుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులను కొలుస్తూ లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు పొందారు. -
సాగర్‌కు తరలి రానున్న కృష్ణమ్మ..
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయానికి ఈ ఏడాది జూలై మొదటి వారంలోనే కృష్ణమ్మ తరలివస్తోంది. ఈ ఏడాది కృష్ణానదికి ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణానదిలో వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి నీటి రాక పెరగడంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్టస్థాయి చేరువలో ఉంది. దీంతో మంగళవారం (8న) శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శ్రీశైలం గేట్లెత్తితే ఆ నీరంతా నాగార్జునసాగర్ జలాశయానికి చేరుకోనుంది. ఎగువ ప్రాజెక్టుల్లో జలకళ కృష్ణానదిపైన కర్నాటక, మహారాష్ట్రలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే దీంతో అదనంగా వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎగువన గల జూరాల జలాశయం ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలకు గరిష్ట స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. జూన్‌లోనే రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరడంతో మూడు రోజుల క్రితమే రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తారు. దీంతో ఇటు జూరాల, అటు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 885.00అడుగులు (215.807 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 879.30అడుగులు (184.2774 టీఎంసీలు)గా ఉంది. ఇప్పటికే శ్రీశైలం కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 67,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం పెరుగుతోంది. సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 527.00 అడుగులు (162.3490 టీఎంసీలు)గా ఉంది. ఫ ఎగువన భారీగా వరద నీటి ప్రవాహం ఫ రేపు శ్రీశైలం క్రస్ట్ గేట్ల ఎత్తివేతకు సిద్ధమైన అధికారులు ఫ సాగర్ జలాశయంలో పెరగనున్న నీటిమట్టం జూన్ 12 నుంచే నీటి రాక.. సాగర్ కనీస నీటిమట్టం 510.00 అడుగులు. కాగా గతేడాది ఇదే రోజున కనీస నీటిమట్టానికి దిగువన 503.80అడుగులు (120.8990 టీఎంసీలకు)గా ఉంది. జూలై 24 వరకు అలాగే కొనసాగింది. 25వ తేదీ నుంచి శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదన ద్వారా నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెడరగడంతో జూలై 29వ తేదీన శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేశారు. ఆగస్టు 5వ తేదీన సాగర్ జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లెత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ ఏడాది సాగర్ జలాశయం కనీస నీటిమట్టానికి వెళ్లలేదు. 511 అడుగుల వద్ద ఆగింది. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచే శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ వచ్చారు. క్రమంగా సాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ఇదే రీతిలో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే ముందస్తుగానే క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. -
సిక్కుల అభ్యున్నతికి సిక్కు సొసైటీ కృషి
మిర్యాలగూడ అర్బన్ : సిక్కుల అభ్యున్నతికి తెలంగాణ సిక్కు సొసైటీ కృషి చేస్తుందని ఎస్పీఎఫ్ రిటైర్డ్ డీజీపీ తేజ్‌దీప్‌కౌర్ మీనన్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని టాకారోడ్డులో గల సిక్కుల దేవాలయాన్ని ఆమె సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కాలనీలో పర్యటించి సిక్కుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సిక్కుల ఆర్థిక, సామాజిక, విద్యాభివృద్ధికి సోసైటీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మిర్యాలగూడలో ఉమెన్స్ డెవలప్మెంట్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని.. అందులో సిక్కు మహిళలుకు కుట్టు మిషన్, చిన్నారులకు విద్య, కంప్యూటర్ శిక్షణ అందస్తామన్నారు. 13న ప్రత్యేకంగా హెల్త్ క్యాంపు నిర్వహస్తామన్నారు. కార్యక్రమంలో సిక్కు సొసైటీ సభ్యులు పర్విందర్ సింగ్ కోహ్లి, కిరణ్‌సింగ్, మాన్సింగ్, హర్బల్సింగ్, జలహార్సింగ్, హజార్సింగ్ పాల్గొన్నారు. సిక్కుల జీవన స్థితిగతుల పరిశీలన చిట్యాల : సిక్కుల జీవన స్థితిగతులు, జీవన అధ్యయనంలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీలో రాష్ట్ర సిక్కు సొసైటీ చైర్మన్, ఎస్పీఎఫ్ రిటైర్డ్ డీజీపీ తేజ్ దీప్కౌర్ మీనన్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా చిట్యాలలో సిక్కుల ఇళ్ల వద్దకు వెళ్లి వారు చేస్తున్న వృత్తి, ఆర్థిక, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పలువురి దీనస్థితి చూసి చలించిపోయారు. గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి ఆపరేషన్‌కు సహకరిస్తానని భరోసా ఇచ్చారు. తాత్కాలిక అవసరాలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. -
పునాది దశలోనే ట్యాంకుల నిర్మాణం
చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీకి అమృత్ 2.0 పథకం కింద రూ.12.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మూడు మంచినీటి నిల్వ ట్యాంకుల నిర్మాణంతో పాటు 16 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణ పనులు, 1600 ఇళ్లకు రెండు కి.మీ నీటి సరఫరా పైపులైన్ పనులను చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు ఏడు నెలల క్రితం శంకుస్థాపన చేశారు. కాగా.. ట్యాంకులు బునాది దశలోనే ఉన్నాయి. 16 కిలోమీటర్ల పైప్లైన్కుగాను 3 కి.మీ పూర్తయింది. సీసీ రోడ్లను ధ్వంసం చేసి పైపులైన్ పనులు చేపడుతున్నారు. ధ్వంసం చేసిన సీసీ రోడ్లుకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఆయా వార్డుల్లో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
రేషన్ తీసుకోని కార్డులు కట్!
నల్లగొండ : రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధమైంది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ బియ్యం తీసుకోని కార్డులు రద్దు కానున్నాయి. అలాంటి కార్డుల గుర్తింపునకు అధికారులు కసరత్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 5092 కార్డులు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. దీంతో ఆయా కార్డులను ప్రభుత్వం రద్దు చేయనుంది. జిల్లాలో 4,78,216 రేషన్‌కార్డులు జిల్లాలో 4,78,216 రేషన్‌కార్డులున్నాయి. ఆయా కార్డుల్లోని ప్రతి యూనిట్‌కు ప్రభుత్వం నెలకు ఆరు కిలలో చొప్పున బియ్యం అందిస్తోంది. గత నెలలో మూడు (జూన్, జూలై, ఆగస్టు) నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇచ్చింది. ఈ కోటాను కూడా చాలామంది తీసుకోలేదు. వారికి కార్డులు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. దీంతో పౌర సరఫరాల శాఖ ఆయా జిల్లాల్లో వరుసగా ఆరు మాసాలు రేషన్ తీసుకోని వారి వివరాలను జిల్లాలకు పంపింది. ఆ జాబితాను జిల్లా పౌర సరఫరాల అధికారులు తహసీల్దార్లకు పంపి విచారించాలని సూచించారు. దీంతో వారు ఆయా కుటుంబాల వద్దకు వెళ్లి విచారించారు. ఇందులో కొందరు చనిపోయినవారు, కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఉన్నారు. 5092 కార్డుదారులు ఆరు మాసాల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేల్చి నివేదిక ఇచ్చారు. అనర్హులకు రేషన్ అందవద్దని.. అనర్హులకు రేషన్ కార్డులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం బియ్యం తీసుకోని వివరాలను సేకరించింది. గతంలో కొందరు తప్పుడు పద్ధతిలో కార్డులు పొంది బియ్యం తీసుకునేవారు.. వేరే ప్రాంతానికి వెళ్లినవారు, చనిపోయిన వారిపేరున కూడా బియ్యం పొందేవారు. దీంతో ఐరిష్ లేదా వేలిముద్ర ఉండాలని ప్రభుత్వం నిర్ణయించడంతో చాలామంది బియ్యం తీసుకోలేదు. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించి కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ ఆరు నెలలపాటు బియ్యం తీసుకోని రేషన్‌కార్డుల రద్దుకు ప్రభుత్వ నిర్ణయం ఫ జిల్లాలో 5,092 కార్డులు ఉన్నట్లు తేల్చిన అధికారులు -
మూడు ట్యాంకుల పనులు మొదలు కాలే..
మిర్యాలగూ టౌన్ : అమృత్ 2.0 పథకం కింది మిర్యాలగూడలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.173.07 కోట్లు మంజూరు కాగా 136 కిలో మీటర్లు యూజీడీ వేయాల్సి ఉంది. 33 వేల ఇళ్లకు లింకులు కల్పించాలి. ఇప్పటి వరకు 23.16 కిలో మీటర్లు మాత్రమే పనులు జరిగాయి. తాగునీటి సరఫరాకు రూ.93 కోట్లు మంజూరయ్యాయి. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌తో పాటు కంపసాగర్ చెరువు నుంచి నీటిని తీసుకుని మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంకు వద్ద వాటర్ ట్రీట్మెంటు ప్లాంట్ నిర్మించి అక్కడ శుద్ధిచేసిన నీటిని కొత్తగా నిర్మించే పది వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకోసం 60 కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేయాలి. కానీ.. వాటర్ ట్రిట్మెంటు ప్లాంట్‌తోపాటు పైపులైన్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇక, హౌజింగ్‌బోర్డులో 2, ఇందిరమ్మ కాలనీలో 2, గ్రీన్ హోం, తాళ్లగడ్డ, మార్కెట్ యార్డుల్లో మొత్తం 7 ట్యాంకులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా మిగిలిన మూడు ట్యాంకుల పనులు ఇంకా ప్రారంభించ లేదు. -
Telangana: ఆన్లైన్లో.. ఇంటి ఆహారం
ఆకలైతే వంట చేసుకుని తినే రోజుల నుంచి ఆర్డర్ పెట్టెయ్ అనే కాలం వచ్చింది. మనకు కావాలి్సన ఆహారాన్ని, నచ్చిన హోటల్, రెస్టారెంట్ నుంచి ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కొద్ది సమయంలోనే మన చేతిలోకి వస్తుంది. ఇప్పటి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే ఫుడ్ డెలివరీ యాప్‌కు అనుసంధానంగా ఉండగా.. ఇప్పుడు కొత్తగా క్లౌడ్ కిచెన్ అందుబాటులోకి వచ్చింది. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడలో పలువురు ఇంట్లో వంట చేస్తూ ఆన్లైన్ ద్వారా సప్లయ్ చేస్తున్నారు. ఇందుకు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేకపోవడంతో క్లౌడ్ కిచెన్ ఏర్పాటుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. రామగిరి(నల్లగొండ): ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఇందులో క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ప్రజాదరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంట్లోని వంటగదిని క్లౌడ్ కిచెన్‌గా మార్చుకోవచ్చు. రెస్టారెంట్లా అధిక ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రెస్టారెంట్‌తో పోల్చుకుంటే అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే సెట్ చేసుకోవచ్చు.తక్కువ పెట్టుబడితో ఏర్పాటుతక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే క్లౌడ్ కిచెన్ ప్రస్తుతం మన నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడకు కూడా విస్తరించింది. ఆన్లైన్ ఫుడ్‌కు అధిక ప్రాచుర్యం ఉండడంతో నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీకి చెందిన జ్యోతి ఇంట్లోని వంట గదిని ఫుడ్ డెలివరీ బిజినెస్‌కు అనుకూలంగా మలుచుకుంది. ‘నాటు.. యమ ఘాటు’ పేరుతో జొమాటో, స్విగ్గీ ద్వారా తన ఫుడ్‌ను ఆన్లైన్ ద్వారా సప్లయ్ చేస్తున్నారు. ఈమెతోపాటు నల్లగొండలో పలువురు మహిళలు క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఇంట్లో చేసిన వంట కావడంతో చాలా మంది క్లౌడ్ కిచెన్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు.స్కిల్స్‌తో వ్యాపారం చేయవచ్చు వ్యాపారం చేయాలంటే విభిన్న ఆలోచనలతో పాటు అందుకు తగ్గట్టుగా స్కిల్స్ ఉండాలి. అప్పుడే అందులో రాణించగలుగుతాం. ప్రస్తుతం మార్కెట్లో క్లౌడ్ కిచెన్‌కు మంచి స్పందన వస్తోంది. వంటలో ప్రావీణ్యం ఉండి సొంతంగా బిజినెస్ చేయాలనుకునే వారికి క్లౌడ్ కిచెన్ సదవకాశం. మూడు నెలల క్రితం నేను క్లౌడ్ కిచెన్ ప్రారంభించాను. ప్రస్తుతం రోజుకు 10 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. దీనికి లొకేషన్‌తో సంబంధం లేదు. జనం రద్దీగా ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉంటే మంచిది. జొమాటో, స్విగ్గీ డెలివరీ ఆప్షన్ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఫుడ్, కిరాణా డెలివరీతో పాటు క్లౌడ్ కిచెన్ వ్యాపారం కూడా పుంజుకుంటోంది. – బి.జ్యోతి, క్లౌడ్ కిచెన్ నిర్వాహకురాలు, నల్లగొండఆన్లైన్ డెలివరీలు మాత్రమే..సాధారణంగా రెస్టారెంట్ ఏర్పాటు చేయాలంటే.. వంట బాగా వచ్చిన వారిని పెట్టుకోవాలి. అది బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని కావడంతో చాలా వరకు హోటల్ బిజినెస్ చేయాలనుకునే వారు వెనకడుగు వేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే క్లౌడ్ కిచెన్లు. క్లౌడ్ కిచెన్ ద్వారా కేవలం ఆన్లైన్ డెలివరీ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ ఆర్డర్లకైతే పెద్ద భవనం అవసరం లేదు. ఖరీదైన ఫర్నిచర్, వెయిటర్లు.. ఇలాంటి ఖర్చులేవీ ఉండవు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి పెద్దపెద్ద నగరాల్లో క్లౌడ్ కిచెన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చిన్నచిన్న పట్టణాలకు విస్తరిస్తున్నాయి. క్లౌడ్ కిచెన్‌లో బిర్యానీ దగ్గర్నుంచి కూరలు, టిఫిన్లు, స్వీట్లు ఇలా ఎన్నో రకాల వంటకాలు ఆన్లైన్ ద్వారా లభిస్తున్నాయి. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఫ 11 కిలోల గంజాయి స్వాధీనంసూర్యాపేటటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను శనివారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం దొరకుంట గ్రామానికి చెందిన అడప రాకేష్ పదిరోజుల క్రితం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో అతడిపై నమోదైన గంజాయి కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు సూర్యాపేట జిల్లా కోర్టుకు వచ్చాడు. అక్కడ అతడికి గంజాయి కేసులోనే వాయిదా గురించి వచ్చిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు కూడా గంజాయి కేసు వాయిదా గురించి వచ్చాడని తెలుసుకున్న రాకేష్ తనకు గంజాయి కావాలని అడిగగా.. జూన్ 29న ఒరిస్సా రాష్ట్రంలోని కల్మెల్లలోని శివమందిర్ గుడి వద్దకు రావాలని చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే జూన్ 28న రాకేష్ ఒరిస్సాకు వెళ్లి అతడిని కలిసి 11కిలోల గంజాయి రూ.11వేలకు కొనుగోలు చేశాడు. ఆ గంజాయిని దొరకుంట గ్రామానికి తీసుకొచ్చి గ్రామ శివారులో గల ఖాళీ స్థలంలో పొదల మధ్యన దాచిపెట్టాడు. ఆ గంజాయిని మరో వ్యక్తికి విక్రయించేందుకు గాను ఈ నెల 2న కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురానికి చెందిన వనపర్తి సాయి అలియాస్ సాయికుమార్ ఫోన్ చేశాడు. ఈ నెల 4న సాయికుమార్ గంజాయి కొనుగోలు చేసేందుకు రాకేష్ వద్దకు రాగా నమ్మదగిన సమాచారం మేరకు కోదాడ రూరల్ పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 11 కేజీల గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2.80 లక్షలు ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. అయితే రాకేష్‌పై 2023 సంవత్సరంలో గంజాయి కేసు నమోదయ్యిందని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సీఐ రజితారెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్‌రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ హరిక్రిష్ణతో పాటు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎనిమిది నెలల కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య
శాలిగౌరారం: మానసికస్థితి సరిగా లేని మహిళ తన ఎనిమిది నెలల కుమార్తెతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగమర్తి గ్రామానికి చెందిన సాయిని శంకరయ్య, వీరమ్మ దంపతుల కుమార్తె వాణి(23)ని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన సింగారపు మహేశ్‌కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. మహేశ్, వాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె పుట్టిన సమయంలోనే వాణి మానసిక స్థితి దెబ్బతినడంతో అనారోగ్యానికి గురైంది. దీంతో వాణిని ఆమె తల్లిదండ్రులు వైద్యం కోసం ఆస్పత్రుల్లో చూపిస్తున్నారు. ఈ క్రమంలో వాణి తరచూ తన తల్లిగారింటికి వచ్చి వెళ్తుండేది. నెల రోజుల క్రితం పెద్ద కుమార్తెను భర్త వద్ద ఉంచి చిన్న కుమార్తె హర్షిత(8 నెలలు)తో కలిసి వాణి వంగమర్తిలోని తల్లిగారింటికి వచ్చి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రానికి బయల్దేరి.. శనివారం వాణి తన చిన్న కుమార్తె హర్షితతో కలిసి ఇంటి వద్ద ఉండగా ఆమె తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లారు. వాణి తన కుమార్తెను తీసుకొని మధ్యాహ్నం సమయంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లొస్తానని చుట్టుపక్కల వారికి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కానీ వాణి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లకుండా వంగమర్తి గ్రామ సమీపంలోని 365వ నంబర్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లి హైవే పక్కన ఉన్న నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో కుమార్తెతో పాటు దూకింది. మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చిన వాణి తల్లిదండ్రులు కుమార్తె ఇంట్లో కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వారిని అడిగారు. దీంతో వారు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నానని చెప్పిందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అడుగగా అక్కడకు రాలేదని అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. ఆందోళనకు గురైన వాణి తల్లిదండ్రులు ఎన్నారం గ్రామానికి ఫోన్ చేసి వాణి వచ్చిందేమోనని ఆరా తీశారు. కానీ అక్కడకు కూడా వాణి రాలేదని చెప్పడంతో గ్రామంలో ఆరా తీయగా.. రెండు గంటల ముందు కుమార్తెతో కలిసి వాణి జాతీయ రహదారి వెంట మాధారంకలాన్ వైపు నడుచుకుంటూ వెళ్లిందని గ్రామస్తులు తెలిపారు. వాణి తల్లిదండ్రులతో పాటు స్థానికులు జాతీయ రహదారి వెంట గాలిస్తూ.. నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో చూడగా అప్పటికే వాణి మృతిచెంది నీటిలో తేలియాడుతూ కనిపించింది. వాణి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని నకిరేకల్‌లోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి హర్షిత మృతదేహం కోసం తీవ్రంగా గాలించారు. అప్పటికే రాత్రి కావడంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాకపోవడంతో నిలిపివేశారు. రాత్రి వరకు చిన్నారి హర్షిత మృతదేహం లభ్యంకాలేదు. మృతురాలి తండ్రి సాయిని శంకరయ్య ఇచ్చిన ఫిపిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు వివరించారు. ఫ మతిస్థిమితం సరిగా లేక వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణం ఫ తల్లి మృతదేహం లభ్యం ఫ నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో ఘటన -
కుర్రి శ్రీనుకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్
నకిరేకల్: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సభకు కారులో వెళ్లొస్తుండగా.. కట్టంగూర్ మండలం పామునగుండ్ల శివారులో లారీ ఢీకొట్టడంతో మఠంపల్లి మండలం కిందితండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుర్రి శ్రీను మృతిచెందగా. అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో ఉంచిన కుర్రి శ్రీను భౌతికకాయానికి శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు. ప్రభుత్వ పరంగా శ్రీను కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా తక్షణ సహాయం కింద సొంతంగా రూ.5లక్షలు అందజేశారు. మృతుడి భార్యకు ప్రభుత్వం ఉద్యోగం, అతడి పిల్లలకు విద్య అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మృతుడు ఽశ్రీను అంత్యక్రియలను దగ్గరుండి చూసుకోవాలని ఆయన హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులకు సూచించారు. మంత్రి వెంట నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సతీమణి పుష్ప, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న తదితరులు ఉన్నారు. కిందితండాలో విషాదఛాయలు.. మఠంపల్లి: కుర్రి శ్రీను మృతితో కిందితండా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి శ్రీను అంత్యక్రియలను అశ్రునయనాల మధ్యన పూర్తిచేశారు. కాగా అదే గ్రామానికి చెందిన వీరన్ననాయక్, మాలోతు శ్రీనునాయక్, బాబునాయక్, మేఘానాయక్, నాగేశ్వరరావునాయక్‌కు గాయాలు కావడంతో వారు చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు.. కట్టంగూర్: ఈ ప్రమాదానికి కారణమైన గుజరాత్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ జుగ్రాజ్సింగ్పై మృతుడి భార్య కుర్రి శ్రీదేవి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కట్టంగూర్ ఎస్ఐ రవీదర్ తెలిపారు. ఫ మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటన ఫ తక్షణ సహాయం కింద సొంతంగా రూ.5లక్షలు అందజేత ఫ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సభకు వెళ్లొస్తుండగా కట్టంగూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను మృతి -
కూలి పనికి వెళ్తూ మృత్యుఒడికి..
భువనగిరిటౌన్: కూలి పని చేసే మహిళను ఆమె భర్త ద్విచక్ర వాహనంపై పని ప్రదేశంలో దించేందుకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం మగ్ధూంపల్లికి చెందిన సిల్వేరు సత్యనారాయణ, మల్లమ్మ(45) భార్యాభర్తలు. సత్యనారాయణ బీబీనగర్‌లోనే ఓ కంపెనీలో పనిచేస్తుండగా.. మల్లమ్మ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శనివారం ఉదయం సత్యనారాయణ తన భార్య మల్లమ్మను భువనగిరిలో కూలీ పనికి వదిలేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. భువనగిరి పట్టణంలోని జంఖన్నగూడెం చౌరస్తా వద్ద మల్లమ్మ, సత్యనారాయణ ఆగగా.. నల్లగొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. సత్యనారాయణకు గాయాలయ్యాయి. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా.. ఒక కుమార్తె వివాహం చేశారు. మిగతా ఇద్దరు కుమార్తెలు పాఠశాల విద్య అభ్యసిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న భువనగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫ ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మహిళా కూలీ మృతి ఫ ఆమె భర్తకు గాయాలు -
బంధువుల దశదిన కర్మకు వెళ్లొస్తుండగా..
కట్టంగూర్: బంధువుల దశదిన కర్మకు ద్విచక్ర వాహనంపై వెళ్లొస్తున్న తల్లీకుమారుడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మృతి చెందారు. ఈ ఘటన కట్టంగూర్ మండలం కేంద్రం శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌కు చెందిన పిట్టల శంకరమ్మ(41), ఆమె కుమారుడు పిట్టల రజనీకాంత్(25) తమ బంధువుల దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి వచ్చారు. సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా.. బయలుదేరారు. మార్గమధ్యలో కట్టంగూర్ మండల కేంద్రం శివారులోకి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన శంకరమ్మను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల స్వగ్రామం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామం కాగా.. వీరు బతుకుదెరువు నిమిత్తం 30 సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. నిర్లక్ష్యంగా లారీని నిలిపిన డ్రైవర్.. లారీ డ్రైవర్ ఎలాంటి సిగ్నల్ లైట్లు వేయకుండా కట్టంగూర్ మండల కేంద్రం శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీని ఆపి సుమారు రెండు గంటల పాటు నిద్రించాడు. లారీని పూర్తిగా హైవే కిందకు దించకుండా సగ భాగం హైవే పైనే నిలుపడంతో.. రజనీకాంత్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి మరో వాహనం రావడంతో లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల్లీకుమారుడు ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలై మృతి చెందారు. ఫ రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి ఫ కట్టంగూర్ మండల కేంద్రం శివారులో ఘటన -
శ్మశానంలోనే ఆమె బతుకు బండి
మిర్యాలగూడ టౌన్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట గ్రామానికి చెందిన పత్తిపాటి ప్రకాశం, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వారికి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఊళ్లో కూలీ పనులు దొరక్కపోవడంతో 26 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మిర్యాలగూడ పట్టణానికి వలస వచ్చారు. తమకు తెలిసిన వారి ద్వారా మిర్యాలగూడ పట్టణంలోని హిందూ శ్మశానవాటికలో కూలీ పనికి కుదిరారు. ఇక్కడే కాటికాపరిగా స్థిరపడ్డారు. ఆ తర్వాత ఐదేళ్లకు అనారోగ్యంతో ప్రకాశం మృతిచెందాడు. అప్పటి నుంచి మణెమ్మనే కాటికాపరిగా పనిచేస్తోంది. తాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిల్లంచర్ల అనంతరాములే తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని, తన భర్త బతికి ఉన్నప్పి నుంచి కూడా అనంతరాములే తమకు జీతం ఇస్తున్నారని మణెమ్మ పేర్కొంది. మొదట్లో ప్రతినెల రూ.600 వరకు జీతం ఇచ్చేవారని, ఇప్పుడు రూ.1000 ఇస్తున్నారని తెలిపింది. తనకు కిడ్నీలో రాళ్లు వస్తే ఆపరేషన్ ఖర్చు కూడా ఆయనే భరించారని పేర్కొంది. వితంతు పింఛనే ఆధారం.. కరోనా సమయంలో ఎవరు కూడా మృతదేహాలను కాల్చేందుకు ముందుకు రాకపోవడంతో మణెమ్మనే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించింది. ఇప్పటికీ ఆమెకు సొంతిళ్లు కూడా లేదు. వితంతు పింఛన్ డబ్బులే కొంత మేరకు ఆమెకు ఆధారం. ఇంటి స్థలం మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను మణెమ్మ కోరుతోంది. శ్మశానవాటికలో పనిచేస్తూనే తన ఇద్దరు కుమారులు, కుమర్తెకు వివాహాలు చేసింది. మణెమ్మకు ఔట్సోర్సింగ్ కింద పారిశుద్ధ్య కార్మికులకు ఏవిధంగా వేతనాలు ఇస్తున్నారో అదే రీతిలో వేతనం ఇస్తే బాగుండేదని స్థానికులు అంటున్నారు. చీకటి పడిందంటే సాధారణంగా బయటకు వెళ్లేందుకు మహిళలు భయపడతారు. కానీ ఈ మహిళ రాత్రి, పగలు అనే తేడాలేకుండా శ్మశానంలోనే చితిమంటల మధ్య జీవనం సాగిస్తోంది. భర్త మృతి అనంతరం అతడి దారిలోనే కాటికాపరిగా పనిచేస్తూ బతుకు బండిని లాగుతోంది. మొదట్లో చాలా భయమేసింది మొదట్లో శవాన్ని దహనం చేస్తుంటే చాలా భయమేసేది. కానీ తర్వాత అలవాటుగా మారిపోయింది. నేను శవాలను దహనం చేయడం ఒక సేవగా భావిస్తున్నాను. నా పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద కుమారుడు తాపీ మేసీ్త్రగా, చిన్న కుమారుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కోడళ్లు కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రభుత్వం కనీసం ఇంంటి స్థలం అయినా ఇచ్చి ఆదుకోవాలి. మున్సిపాలిటీ కార్మికులకు వచ్చే విధంగా వేతనమైనా ఇస్తే బాగుంటుంది. – పత్తిపాటి మణెమ్మ ఫ భర్త మృతి అనంతరం కాటికాపరిగా పనిచేస్తున్న మహిళ -
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు
హాలియా: అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలోని 565వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మోరం నాగేశ్వరరావు అతడి భార్య లక్ష్మీపార్వతి, 18 నెలల కుమారుడు అభిరామ్‌తో కలిసి శనివారం బైక్‌పై తిరుమలగిరి(సాగర్) మండలంలోని రంగుండ్ల గ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు కలిసి బైక్‌పై వెళ్తుండగా.. మార్గమధ్యలో అనుముల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోకి రాగానే హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు, అతడి భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. హాలియా సీఐ సతీష్‌రెడ్డి, ఎస్ఐ సాయిప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను మాచర్లకు తరలించారు. క్షతగాత్రుల బంధువు లక్ష్మీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిపెన్పహాడ్: ఇంట్లో నీటి మోటారుకు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం చెట్లముకుందాపురం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్లముకుందాపురం గ్రామానికి చెందిన మామిడి శ్రీనివాస్(54) తన ఇంట్లోని నీటి ట్యాంకు వద్ద మోటారు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అందరు ఉన్నా అనాథ శవంగా..
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి అందరు ఉన్నా అనాథయ్యాడు. వివరాలు.. భువనగిరి పట్టణంలోని రెడ్డివాడకు చెందిన పట్నం పవన్ (40) గత నెల 21న భార్య కల్పన, ఇద్దరు కుమార్తెలతో కలిసి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్ గ్రామంలోని తన అత్తగారింటికి బస్సులో బయల్దేరాడు. మార్గమధ్యలో జనగామలో పవన్ బస్సు దిగి.. తనకు పని ఉంది, చూసుకొని వస్తాను అని భార్యకు చెప్పాడు. కల్పన ఇద్దరు కుమార్తెలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. రెండు రోజులు గడిచినా భర్త ఇంటికి రాకపోవడంతో కల్పన భువనగిరిలోని పవన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఎంత వెతికినా పవన్ ఆచూకీ లభించకపోవడంతో ఐదు రోజుల అనంతరం జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ అప్పటికే జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద పవన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. జనగామ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో నాలుగు రోజులపాటు గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు భద్రపరిచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో కల్పన భర్త ఆచూకీ కోసం శుక్రవారం జనగామ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. గుర్తుతెలియని మృతదేహంగా పేర్కొని అంత్యక్రియలు నిర్వహించిన ఫొటోలు చూపించగా.. తన భర్త పవన్ మృతదేహామే అని ఆమె నిర్ధారించింది. అయితే కల్పన ఫిర్యాదు వెంట పవన్ ఫొటోను జతచేయకపోవడంతో మృతదేహం గుర్తింపులో ఆలస్యం జరిగిందని జనగామ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు శనివారం జనగామలో పవన్ మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఫ జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భువనగిరి వాసి ఫ 13రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు అందిన సమాచారం ఫ అప్పటికే గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి అంత్యక్రియలు నిర్వహించిన జనగామ పోలీసులు -
రూ. 6 కోట్ల పనులకు ఆమోదం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం మున్సిపల్ అధికారులు రూ.15 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రూ.6 కోట్ల పనులకు ఆమోదం లభించింది. త్వరలోనే రూ.6 కోట్లు నీలగిరి మున్సి పాలిటీకి మంజూరవుతాయని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలి పారు. మిగతా రూ.9 కోట్ల కోసం మరోసారి ప్రతిపానదలు పంపినట్లు పేర్కొన్నారు. యోగా సింధూర్ సభ పోస్టర్ ఆవిష్కరణనల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈనెల 6వ తేదీన నిర్వహించే యోగా సింధూర్ విజయోత్సవ సభ పోస్టర్లను శుక్రవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆధ్వర్యంలో యోగా సింధూర్ సభ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో యోగా సింధూర్ అధ్యక్షుడు శివ దుర్గాప్రసాద్, ఎంవీ.గోనారెడ్డి, నారాయణ, శ్రీధర్, యోగా గురూజీ రాపోలు వెంకటేశ్వర్లు, ప్రవీణ్, భజరంగ్‌ప్రసాద్ పాల్గొన్నారు. 8 నుంచి పోస్టల్లో కొత్త సాఫ్ట్వేర్రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పోస్టల్ డివిజన్లోని నల్లగొండ, యదాద్రి భువనగిరి జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద నల్లగొండ డివిజన్లోని 2 హెడ్ ఆీఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్‌లు, 392 పోస్టాఫీస్‌లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై 7 అన్ని పోస్టల్ కార్యాలయాల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని తెలిపారు. చెత్త రీసైక్లింగ్‌కు ‘రీకార్ట్’తో ఒప్పందం నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీకి చెందిన శేషమ్మగూడెంలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలను రీ సైక్లింగ్ చేసి శుభ్రం చేసేందుకు మున్సిపల్ అధికారులు హైదరాబాద్‌లోని రీకార్ట్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. కొన్ని నెలల నుంచి డంపింగ్ యార్డును శుభ్రం చేయించేందుకు పలు సంస్థలతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. దాంతో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాద్ అహ్మద్ గురువారం హైదరాబాద్‌లో రీకార్ట్ సంస్థతో చేసుకోవాల్సిన ఒప్పంద పత్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి చేయడంతో ఒప్పందం తుదిదశకు చేరుకుంది. ఒప్పంద పత్రాలపై సీడీఎంఏ శ్రీదేవి ఆమోద్ర వేయడమే మిగిలిపోయింది. ఆమె జపాన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రాగానే ఒప్పందం అమల్లోకి రానుంది. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను భాగాలుగా విడదీసి మొత్తం రీ సైక్లింగ్ చేసి శుభ్రం చేయనున్నారు. ఇక నుంచి చెత్త కుప్పలుగా పేరుకుపోకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలిహాలియా : ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం అన్నారు. టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, కేజీబీవీలకు, ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని, గురుకుల పాఠశాలల పనివేళలు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతపల్లి రవీందర్, ఎస్కె సైయ్యద్ మీయా, జిల్లా కార్యదర్శి రమాదేవి, సరిత, వీరాసింగ్, మద్దెల ప్రసాద్, వెంకటేశ్వరరావు, సునీత, కోశాధికారి చంద్రయ్య ఉన్నారు. -
గురుకులాల్లో వసతులపై ఆరా
దేవరకొండ, కొండమల్లేపల్లి, డిండి, చందంపేట : దేవరకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ సంక్షేమ గురుకులాను సందర్శించి.. అక్కడి మౌలిక వసతులపై ఆరా తీశారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. శుక్రవారం దేవరకొండ మండలంలోని పెంచికల్‌పహాడ్, కొమ్మేపల్లి, కొండభీమనపల్లి, కొండమల్లేపల్లి, డిండి, చందంపేటలోని సాంఘిక, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో రికార్డులు పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, మెనూపై ఆరా తీశారు. కల్పిస్తున్న వసతుల వివరాలను ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, ఆర్సీఓలు బలరాంనాయక్, స్వప్న, విష్ణు, జోనల్ ఆఫీసర్ విద్యారాణి, ఆయా గురుకులాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ దృష్టికి సమస్యలు ● పెంచికల్‌పహాడ్ పాఠశాలకు ఓహెచ్ఎస్ఆర్, విద్యార్థులకు సరిపడా బెడ్స్, అదనపు గదుల నిర్మాణం అవసరమని ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ● కొమ్మేపల్లి, కొండభీమనపల్లి పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్‌లు, బెంచీలు, ఓహెచ్ఎస్ఆర్, ట్రాన్స్ఫార్మర్, టాయిలెట్స్ అవసరం ఉన్నట్లు ప్రిన్సిపాల్స్ కలెక్టర్‌కు వివరించారు. ● కొండమల్లేపల్లి ఎస్సీ గురుకుల కళాశాలలో బెడ్స్, ఓహెచ్ఎస్ఆర్, అదనపు టాయిలెట్స్ కావాలని ప్రిన్సిపాల్ కలెక్టర్‌కు విన్నవించారు. ● డిండి ఎస్సీ గురుకులంలో డ్రెయినేజీ, వాటర్ పైపులైన్ కోతుల బెడద తదితర సమస్యలు ఉన్నాయని.. ప్రహరిగోడకు సోలార్ పెన్షింగ్ కావాలని ఇప్పటి వరకే సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించాలని ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ● చందంపేట మినీ గురుకులంలో డెర్మాటరి బ్లాక్ కావాలని, తాగునీటి సమస్య ఉందని ప్రిన్సిపాల్ కలెక్టర్‌కు విన్నవించారు. ఫ దేవరకొండ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సార్.. మినిస్ట్రీ ప్లీజ్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మంత్రి పదవుల కోసం మళ్లీ వినతులు మొదలయ్యాయి. హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను పలువురు ఆశావహులు కలిసి విజ్ఞప్తులు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్.. ఖర్గేను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు ఖర్గేను కలిసి విన్నవించకపోయినా గతంలోనే పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో మూడో విడత కేబినెట్ విస్తరణలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న చర్చ సాగుతోంది. కేబినెట్లో ఇంకా మూడు మంత్రి పదవుల భర్తీకి అవకాశం ఉంది. దీంతో మూడోసారి మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. మంత్రి పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్‌కు వచ్చారు. మంత్రి పదవి ఆశిస్తున్న నేతలందరికి ఖర్గేతో భేటీ అయ్యేందుకు అవకాశం ఇచ్చారు. ఆయన్ని కలిసేందుకు రావాలంటూ వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం ఇచ్చారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారు. పార్టీకు తాము చేసిన సేవలు, ప్రతినిధులుగా తమకు ఉన్న అనుభవం, సామాజికంగా తమకు ఉన్న అనుకూల అంశాలను వివరించారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఆశావాహులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఆశావహులు మంత్రి పదవి కోసం మొదటినుంచి అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే మొదటి విడతలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి ఆశించారు. అయితే, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రివర్గంలో బెర్తు దక్కింది. లంబాడా కోటాలో బాలునాయక్ కూడా మంత్రి పదవి ఆశించినా ఆయనకు కూడా దక్కలేదు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలోనూ వీరిద్దరికి బెర్త్ దక్కలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ఫ మంత్రి పదవి కోసం ఖర్గేను కలిసి విజ్ఞప్తి చేసిన బాలునాయక్ ఫ ఇదివరకే మంత్రి పదవి కావాలని కోరిన రాజగోపాల్‌రెడ్డి ఫ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ఆశావహులు ఫ మూడో విడత విస్తరణలో అవకాశం దక్కేదెవరికో.. మూడో విడతలోనైనా.. త్వరలో మూడో విడత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే చర్చ సాగుతోంది. రెండో విడత మంత్రి పదవులు దక్కని వారిని పీసీసీ అధ్యక్షుడితో పాటు మంత్రులు కూడా బుజ్జగించారు. మళ్లీ అవకాశం వస్తుందని చెప్పారు. మూడో విడతపై చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యేందుకు వచ్చారు. అదే సందర్భంలో మంత్రి పదవులను ఆశించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమకు మూడో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు చేశారు. అందులో నల్లగొండ జిల్లా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ఖర్గేను కలిసి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుతం ఖర్గేతో సమావేశం కాకపోయినా, గతంలోనే అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడో విడత విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్నది చర్చనీయాంశంగా మారింది. -
పట్టాలెక్కనున్న డబ్లింగ్ పనులు!
పెరుగనున్న రద్దీ బీబీనగర్ – నడికుడి రెండో లైన్ అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రద్దీ పెరగనుంది. తిరుపతి, చైన్నె, ఖమ్మం తదితర ప్రాంతాలకు బీబీనగర్–నడికుడి–గుంటూరు మార్గం దగ్గరగా ఉండటం, డబ్లింగ్తో రైళ్ల వేగం పెరగనుండడంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీబీనగర్ – నడికుడి మార్గం సింగిల్ ట్రాక్ లేన్ కావడంతో ఒక రైలు వస్తే మరో రైలును ముందు స్టేషన్లో నిలిపేవారు. రెండో లేన్ అందుబాటులోకి వస్తే రైలు నిలిపే అవసరం ఉండదు. ప్రయాణికులకు వేచి ఉండే ఇబ్బందులు తొలగనున్నాయి. బీబీనగర్: బీబీనగర్ – నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం కలిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న సిక్రిందాబాద్ – నడికుడి – గుంటూరు రెండో లేన్ పనులకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూ సేకరణకు సంబంధించి ఈనెల 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టులో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో బీబీనగర్ మండలం గూడూరు నుంచి గుంటూరు జిల్లా నల్లపాడు వరకు డబ్లింగ్ పనులు జరుగనున్నాయి. ముందుగా నడికుడి మార్గంలో 48 కిలో మీటర్ల మేర రూ.647 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 ఎకరాలకు పైగా భూసేకరణకు రైల్వే శాఖ ఆదేశించినట్లు తెలిసింది. బీబీనగర్ మండల పరిధిలోని గూడూరులో 60 ఎకరాలు, భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి, బొల్లేపల్లి, నందనం, అనాజిపురం, పగిడిపల్లి, భువనగిరిలో 830 ఎకరాలకు పైగా భూమి సేకరించనున్నారు. 239 కిలో మీటర్లు.. బీబీనగర్–నడికుడి మధ్య రెండో రైల్వే లైన్ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలుపుతూ 2023లో దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. దీంతో 239 కిలో మీటర్లకు పైగా రెండో లైన్ నిర్మాణానికి రూ.2,853.23 కోట్లు కేటాయించింది. ఇందులో సివిల్ పనులకు రూ.1,947.44 కోట్లు, ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు రూ.588.17కోట్లు, సిగ్నలింగ్ టెలికాం పనులకు రూ.319.62 కోట్లు అంచనా వ్యయంగా చూపారు. 2024 పిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ ముగిసింది. తదుపరి కాంట్రాక్టర్ ఎంపిక, ఈసీసీ ఆమోదంతో ఒప్పందం జరగాల్సిన ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు నుంచి పనులు ప్రారంభంక ావచ్చని రైల్వే అధికారుల నుంచి సమాచారం. బీబీనగర్ – నడికుడి రెండో లేన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఫ భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ ఫ ఆగస్టు నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఫ తొలుత నడికుడి మార్గంలో పనులు -
ధాన్యం కొనుగోలుకు ముందస్తుగా సిద్ధం కావాలి
నల్లగొండ : వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకోవాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్లో వానాకాలం– 2025 సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. యాసంగిలో 2 వేల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం వచ్చిన 110 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు. జిల్లాలోని 10 మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం రెండు మార్కెట్లకు మొబైల్ గ్రైన్ డ్రయ్యర్లు సమకూర్చిందన్నారు. వాటిని అన్ని మార్కెట్ యార్డ్‌లలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, డీఎస్ఓ వెంకటేశం, డీఎం హరీష్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీసీఓ పత్యానాయక్ పాల్గొన్నారు. -
సాగర్ నుంచి పాలేరుకు నీటి విడుదల
నాగార్జునసాగర్: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గినందున తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం సాగునీటి శాఖ అధికారులు ఎడమ కాల్వ ద్వారా పాలేరుకు నీటిని విడుదల చేశారు. మొదట వెయ్యి క్యూసెక్కులు విడుదల చేశారు. క్రమంగా పెంచుతూ మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నట్లుగా సాగర్ డ్యాం ఎస్ఈ మల్లికార్జున్ తెలిపారు. సాగర్ జలాశయంలో నీటి నిల్వలు ఇలా.. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 522.20 అడుగుల(153.3180 టీఎంసీలు) నీరు ఉంది. ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా 54,051 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. -
సాగు చట్టాలపై రైతులకు అవగాహన ఉండాలి
గుర్రంపోడు, కనగల్, కట్టంగూర్ : సాగు చట్టాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని భూమి సునీల్ అన్నారు. లీప్స్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సాగు న్యాయ యాత్రలో భాగంగా శుక్రవారం గుర్రంపోడు, కనగల్, కట్టంగూర్ మండలం అయిటిపాముల రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహక కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. దుక్కి దున్నే నాటి నుంచి పంటను మార్కెట్లో అమ్మేదాకా రైతులు ఎదుర్కొనే సమస్యలు వాటి పరిష్కార మార్గాలను రైతులకు సూచించడమే ఆ సాగు న్యాయ యాత్ర ఉద్దేశమన్నారు. రైతులు అహర్నిషలు కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదని.. పంట పెద్దపెద్ద కంపెనీలు, దళారుల పాలవుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులకు జరిగే మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని తెలుసుకోవాలని సూచించారు. లీప్స్ సంస్థ ప్రెసిడెంట్ గున్న రాజేందర్‌రెడ్డి, రైతు కమిషన్ ఏఓ హరివెంకటప్రసాద్, లీప్ సంస్థ ప్రతినిధులు జీవన్, సందీప్, మల్లేష్, రవి, ప్రవీణ్, శ్రీనివాస్, కనగల్ తహసీల్దార్ బి.పద్మ, ఏఓ బెజవాడ అమరేందర్‌గౌడ్, ఏఈఓలు నవీన్, అభిలాష్‌రెడ్డి, -
ఓటరు జాబితాపై బీఎల్ఓలకు శిక్షణ
నల్లగొండ: కొత్త ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అందులో భాగంగా బీఎల్ఓలకు ఓటర్ల జాబితా తయారీ విధానంపై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈమేరకు జిల్లాలో గురువారం నుంచి ప్రారంభమైన శిక్షణ ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఓటర్ల జాబితాకు సంబంధించి బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి 18 సంవత్సరాలు నిండి ఉండి ఓటు నమోను చేసుకొని వారిని గుర్తించి ఓటరు నమోదు చేసుకునేవిధంగా వివరించడం, చనిపోయిన వారి పేర్లు కుటుంబసభ్యులకు తెలియజేసి జాబితా నుంచి తొలగించడం వంటివి చేయనున్నారు. త్వరలో స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్ 2026 జనవరి 1 తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వారికి ఓటు హక్కు కల్పించేందుకు స్పెషల్ సమ్మరీ రివిజన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ వెలువరించే అవకాశం ఉంది. దీంతో కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా బీఎల్ఓలకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించింది. ఫ మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రారంభమైన శిక్షణ ఫ ఈ నెల 17 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు -
హైకోర్టు జడ్జిగా కొండమడుగు వాసి
సాక్షి, యాదాద్రి, బీబీనగర్ : కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లాకు చెందిన పలువురు న్యాయవాదులు. తాము ఎంచుకున్న మార్గంలో నిరంతర శ్రమతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి చేరుకున్నారు. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వాకిటి రామకృష్ణారెడ్డిని హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. త్వరలో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం కానున్నారు. ఇప్పటికే ఆలేరుకు చెందిన కలాసికం సృజన, రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు లక్ష్మణ్‌గౌడ్ హైకోర్టు న్యాయమూర్తులుగా సేవలందిస్తున్నారు. అంతకుముందు వలిగొండ మండలం నెమలికాల్వ గ్రామానికి చెందిన వంగాల ఈశ్వర్యయ్యగౌడ్ హైకోర్టు జడ్జిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. రామకృష్ణారెడ్డి కుటుంబ నేపథ్యం, న్యాయవాదిగా ప్రస్తానం వాకిటి రామకృష్ణారెడ్డి 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. బీబీనగర్ మండలం కొండమడుగు ఆయన స్వగ్రామం. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. అన్న, చెల్లి ఉన్నారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఆ తరువాత అనంతసేన్‌రెడ్డి అనే అడ్వకేట్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2005 నుంచి సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రామకృష్ణారెడ్డి గతంలో బీబీనగర్ మండలంలోని అక్కన్న మాదన్న ఆలయ భూముల కేసులో హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో అనుకూల తీర్పువచ్చింది. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, కుటుంబ కేసులు వాదించడంలోనూ సమర్థులుగా పేరుంది. ఇప్పటి వరకు ఆయన వెయ్యి వరకు పిటిషన్లు దాఖలు చేశారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విద్యభ్యాసం రామకృష్ణారెడ్డి 1నుంచి 7వ తరగతి వరకు కొండమడుగు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివారు. 8నుంచి 10వ తరగతి వరకు బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని రెడ్డి కళాశాలలో పూర్తి చేశారు. న్యాయవాదిగా హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేశారు. రామకృష్ణారెడ్డిని హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ రామకృష్ణారెడ్డి పేరు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం ఫ యాదాద్రి జిల్లా నుంచి ఇప్పటికే హైకోర్టు జడ్జిలుగా సృజన, లక్ష్మణ్‌గౌడ్ -
విద్యుత్ స్టోర్ తనిఖీ
నల్లగొండ: నల్లగొండలోని విద్యుత్ స్టోర్‌ను టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ నరసింహులు గురువారం తనిఖీ చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి నిబంధనలు పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారని ఆరోపణలు రావడం, మిర్యాలగూడ నియోజకవర్గంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో సీఎండీ ఆదేశాల మేరకు డైరెక్టర్ నర్సింహులుతోపాటు సీజీఎం రూరల్ బాలస్వామి నల్లగొండలోని విద్యుత్ స్టోర్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఏఈ, ఏడీలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మిర్యాలగూడలో ఏఈలతో వ్యవసాయ కనెక్షన్ల పెండింగ్‌పై సమీక్షించారు. డైరెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే 59 ట్రాన్స్ఫార్మర్లు, 10 కిలోమీటర్ల మేర కండక్టర్ వైర్ మంజూరు చేశారు. ఫ నల్లగొండ, మిర్యాలగూడ ఏఈలతో టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ సమీక్ష ఫ మిర్యాలగూడకు 59 ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్ వైర్ మంజూరు -
పేరుకుపోతున్న వ్యర్థాలు
దేవరకొండ: దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులున్నాయి. ప్రతి నిత్యం గృహ, వాణిజ్య సముదాయాల నుంచి సుమారు 16 టన్నుల మేర చెత్తను పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సేకరించి పట్టణ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ డంపింగ్ యార్డులో ఇనుము, కాపర్ వంటి వాటి కోసం వచ్చే వారు వ్యర్థాలను తగలబెడుతుండడంతో ఈ దారి గుండా వెళ్లే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణం నుంచి ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు అత్యధికంగా వస్తుండడంతో డంపింగ్ యార్డులో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. -
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
నల్లగొండ: వర్షాకాల నేపథ్యంలో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు రెయిన్కోట్లు, కంటి అద్దాలు తరితర పరికరాలను పంపిణీ చేశారు. విధుల నిర్వహణలో ముగ్గురు హోం గార్డులు చనిపోగా బాధిత కుటుంబాలకు హోం గార్డ్స్ సంక్షేమ నిధుల నుంచి రూ.15వేలు, అనారోగ్యం కారణంగా మెడికల్ చికిత్స పొందిన ఐదుగురు హోం గార్డులకు రూ.10 వేలు, హోం గార్డ్ పిల్లల వివాహం కోసం ఇద్దరికి రూ.5 వేలు, మెరిట్ స్కాలర్షిప్ కింద ముగ్గురికి రూ.5 వేల చెక్‌ను ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ వృత్తి నైపుణ్యాలపై జోనల్ స్థాయి డ్యూటీ మీట్ నల్లగొండ: వరంగల్‌లో నిర్వహించనున్న రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నేపథ్యంలో యాదాద్రి జోనల్ స్థాయిలో కేసుల దర్యాప్తు, పోరెన్సీక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధన ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవైర్నెస్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం అంశాలపై నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది జోనల్ స్థాయి డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో కేసుల దర్యాప్తు, నేర పరిశోధనలో ఎదురవుతున్న అంశాలపై సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై యాదాద్రి జోన్‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, నరసింహాచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
నెరవేరని సేంద్రియ ఎరువుల తయారీ విధానం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను తరలించేందుకు పట్టణ శివారులో గల రాంనగర్ బంధం వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డుకు ప్రస్తుతం దిక్కు, మొక్కు లేకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. వివిధ ఆస్పత్రుల నుంచి సేకరించిన వ్యర్థాలు కూడా వీటిలో పడేయడంతో దుర్వాసన వస్తోంది. కలుషిత వ్యర్థాలకు నిప్పు పెడుతుండడంతో రాంనగర్, బంధం, ఈదులగూడెం ఏనే, బాధలాపురం, గుడూరు, అవంతిపురం, ఈదులగూడెం వరకు పొగ కమ్ముకుంటుంది. తడి చెత్త, పొడి చెత్తను సేకరించడంతో పాటు డంపింగ్ యార్డులోని సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు ‘వేస్ట్ వెంచర్’ సంస్థ 2013లో ముందుకు వచ్చింది. ఆ సంస్థ నిర్వాహకులు సెగ్రిగేషన్ చేసి విండ్రోస్ విధానంతో థర్మోఫిలిక్ ఆర్గానికి కంపోస్ట్ ద్వారా ఎరువులు తయారు చేశారు. రెండేళ్ల పాటు బాగానే నడిచినా.. తీరా ఆ సంస్థ చేతులెత్తేసింది. దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం డంపింగ్ యార్డులో చెత్తను కాల్చడం ద్వారా వెలువడుతున్న పొగ ఇళ్లను కమ్ముకుంటుంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో తట్టుకోలేకపోతున్నాం. ఇళ్లలో ఉండలేకపోతున్నాం. ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించారు. – మలిఖార్జున్, 4వ వార్డు, ఈదులగూడెం -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పెద్దఅడిశర్లపల్లి : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. వైద్య సేవలకు అనుగుణంగా మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం పీఏపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి భూభారతిలో వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేశారు. వంట గదులు, పాఠశాల పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థులకు అందించే భోజన సదుపాయాలపై ఆరా తీశారు. ఆమె వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ జయశ్రీ, సిబ్బంది తదితరులున్నారు. 5న ఉమ్మడి నల్లగొండ అండర్ 19 క్రికెట్ జట్టు ఎంపిక నల్లగొండ టౌన్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్ 19 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక చేయనున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అమీనుద్దిన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జట్టు ఎంపిక ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2006 తరువాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 98857 17996 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. హౌస్ కీపింగ్ నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ రామగిరి(నల్లగొండ): నిడమనూరు కోర్టులో హౌస్ కీపింగ్ సర్వీసెస్ నిర్వహణకు ఆసక్తి గల సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 8వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.nalgonda.dcour-ts.go v.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. సీఎంఆర్ లక్ష్యాన్ని వారంలో పూర్తి చేయాలినల్లగొండ: సీఎంఆర్ లక్ష్యాన్ని వారంలోపు పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023– 24 రబీ సీఎంఆర్‌కు సంబంధించి ఇంకా 73 ఏసీకే లు చెల్లించాల్సి ఉందన్నారు. రైస్ మిల్లర్లు వారం రోజుల్లో చెల్లించడంతోపాటు, 2024– 25 రబీకి సంబంధించిన సీఎంఆర్‌ను సైతం వేగవంతం చేయాలన్నారు. పౌర సరఫరాల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం నల్లగొండ అగ్రికల్చర్ : జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద జిల్లాలో అపరాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ గురువారం తెలిపారు. పథకం కింద ఆయా పంటలకు అవసరమైన మినీ కిట్లు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు. జొన్నల సాగు 100 ఎకరాల్లో ప్రోత్సహించడానికి అవసరమైన 100 కిట్లు, రాగుల సాగు 645 ఎకరాలకు అవసరమైన 645 మినీ కిట్లు, 250 ఎకరాల్లో మినుముల సాగుకు అవసరమైన 500 కిట్లు, 750 ఎకరాల్లో కంది సాగుకు అసరమైన 1500 మినీ కిట్లు జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. వాటిని మండలాల వారీగా కేటాయించి రైతులకు ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. -
చెల్లాచెదురుగా వ్యర్థాలు
చండూరు: చండూరు మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్‌యార్డును శిర్ధేపల్లి రోడ్డులో 1.9 ఎకరాల భూమిని కేటాయించారు. ప్రతిరోజు మూడు ట్రాక్టర్లు, ఒక ఆటో ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను ఇష్టారీతిన వదిలేయడంతో వ్యర్థాలన్నీ చెల్లాచెదురుగా పడుతున్నాయి. చెత్తను కాల్చకుండా బయోమైనింగ్ చేయాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి టెండర్లు పిలిచినా అది కార్యరూపం దాల్చలేదు. డంపింగ్ యార్డులో తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసి మున్సిపాలిటీ పరిధిలోని పార్కుల్లో మొక్కలకు ఎరువుగా వినియోగించేందుకు దాదాపు నాలుగు గదుల వైశాల్యంలో వర్మీ కంపోస్టు తయారీకి బెడ్లు తయారు చేసి వదిలేశారు. -
వ్యవసాయ భూములకు వ్యాపిస్తున్న మంటలు
నకిరేకల్: నకిరేకల్ మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను తరలించేందుకు నోముల– నెల్లిబండ శివారులో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల పంట పొలాలు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. చెత్తకు నిప్పు పెడుతుండటంతో వచ్చే పొగతో పంట పొలాలు దెబ్బతినడంతో పాటు, పశు గ్రాసం కాలిబూడిదవుతోందని రైతులు వాపోతున్నారు. వేసవిలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి చుట్టుపక్కల రైతులు వ్యవసాయ భూముల్లో ఉన్న పైప్‌లైన్ కాలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. డంపింగ్ యార్డు దారి వెంట ఉండటంతో నోముల, నెల్లిబండ గ్రామాల రైతులు తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాలంటే చెత్తకు పెడుతున్న నిప్పుతో వచ్చే పొగ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. -
మొక్కుబడిగా చెత్తసేకరణ
హాలియా : హాలియా మున్సిపాలిటీలో రోజుకు 8 టన్నుల చెత్త వెలువడుతోంది. 50 మంది కార్మికులు, 2 ట్రాక్టర్లు, 5 ఆటోల ద్వారా సేకరించి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్త కలపడంతో పాటు చికెన్, మటన్ మార్కెట్ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలనూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ యార్డుకు సమీపంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల, కేజీబీవీ పాఠశాల ఉండడంతో పేరుకుపోయిన వ్యర్థాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త తీసుకెళ్తున్నారే తప్పా.. ప్రాసెసింగ్ చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆదాయం సమకూర్చేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
అవినీతికి ఆస్కారం ఉండొద్దు
– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్.. మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను ఉన్నతస్థానంలో నిలపాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకై క ప్రభుత్వం తమదే అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పదేళ్లు నిర్లక్ష్యానికి గురైందని.. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో త్వరలోనే పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ పనులను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని.. మేము వచ్చాకే నీటికేటాయింపులుచేసి నిధులు కూడా మంజూరు చేశామన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలతో పాటు లిప్టులు, హైలెవల్ కెనాల్ లైనింగ్‌కు రూ.400 కోట్లు మంజూరు చేశామన్నారు. అయిటిపాముల, గంధమల్ల రిజర్వాయర్లకు రూ.500 కోట్లు మంజూరు చేసి సీఎంతో పనులు ప్రారంభించామన్నారు. రాచకాల్వ మరమ్మతు పనులు చేయాలని ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారని వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. -
ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు
రామగిరి(నల్లగొండ) : వచ్చే మూడున్నర ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు వేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో రూ.6 కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయాన్ని బుధవారం ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు నెలలో రూ.3 వేల కోట్లతో 10 ప్యాకేజీలకు టెండర్లు పిలుస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి రూ.1200 కోట్లు ఖర్చు చేశామన్నారు. టీజీపీఎస్సీ ద్వారా ఆర్అండ్బీ శాఖలో కొత్తగా ఏఈ పోస్టుల భర్తీ చేశామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత స్వయంశక్తితో ఎదిగేందుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు బాలునాయక్, మందుల సామేల్, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్అండ్బీ ఎస్ఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి -
గోల్డ్ మెడల్స్‌కు విరాళాల స్వీకరణ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి సబ్జెక్ట్‌ల వారీగా ఓవరాల్‌గా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సుమారు 30 బంగారు పతకాలు ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. దీని కోసం ఔత్సాహికుల నుంయి విరాళాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో బంగారు పతకానికి రూ.1.5 లక్షలు కళాశాల అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కరు ఎన్ని బంగారు పతకాలకై నా ఇవ్వవచ్చని తెలిపారు. విరాళం డిపాజిట్ చేసిన వారి పేరు మీద కానీ.. వారు సూచించిన వారి పేరు మీద ప్రతి విద్యా సంవత్సరం బంగారు పతకాలు ప్రధానం చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన కళాశాల స్థాపక దినోత్సవం రోజున బంగారు పతకాల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. వివరాలకు 98486 96776, 99898 97566 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానంనల్లగొండ : పోలీస్ శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన పలువురిని ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మానించారు. వారికి పోలీస్‌శాఖ ద్వారా ఇవ్వాల్సిన ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఓ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయంలో సాంకేతికను జోడించాలి నల్లగొండ టౌన్ : రైతులను ఆర్థికంగా బలో పేతం చెందాలంటే వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికను జోడించాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ కో ఆపరేటివ్ వారోత్సవాల్లో భాగంగా ఇంగ్లాండ్‌లోని మాంచస్టల్ రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కో ఆపరేటివ్ వ్యవస్థ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతులు పంటల సాగుతో ఆయా దేశాల అభివృద్ధికి తమవంతు చేయూత అందిస్తున్నారన్నారు. రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి ఆదుకోవాలన్నారు. పాడి పరిశ్రమ, హార్టికల్చర్, సెరికల్చర్, పశు సంపదను పెంపొందించే అంశాలపై సహకార వ్యవస్థ దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలపై అవగాహన పెంచుకుని ఉమ్మడి జిల్లాలో సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. 4న ఫుట్‌బాల్ జిల్లా జట్టు ఎంపికనల్లగొండ టూటౌన్ : మంచిర్యాలలో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే జట్టును ఈనెల 4వ తేదీన నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో ఎంపిక చేయనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు బండారు ప్రసాద్ తెలిపారు. సెలక్షన్ పోటీల నిర్వహణపై బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 1 జనవరి 2010 నుంచి 31డిసెంబర్ 2012 మధ్య జన్మించిన బాలికలు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం తీసుకొని 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఎన్జీ కాలేజీకి రావాలని పేర్కొన్నారు. ఇక్కడి పోటీల్లో ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్ర స్థాయి పంపుతామన్నారు. వివరాలకు 8374542407 ఫోన్‌నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఓరుగంటి శ్రీనివాస్, కందికట్ల దాస్, బొడ్డుపల్లి సునీత, కట్ట వెంకట్, మందడి సురేందర్‌రెడ్డి, కొప్పు ప్రవీణ్‌గౌడ్ పాల్గొన్నారు. స్కూళ్లను తనిఖీ చేస్తాం నల్లగొండ : జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేస్తామని డీఈఓ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించాలని ఆయన సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫాం, టై, బెల్టు, నోట్‌బుక్స్ అమ్మవద్దని, అధిక ఫీజులు వసూలు చేయవద్దని సూచించారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జగన్నాథుడి రథయాత్ర
చింతపల్లి : మండల కేంద్రం హరి నామస్మరణతో మార్మోగింది. భక్తుల నృత్యాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలతో జగన్నాథుడి రథయాత్ర బుధవారం వైభవంగా సాగింది. కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ సౌజన్యంతో సాయి సన్నిధి బాబా దేవాలయం ఆధ్వర్యంలో పూరి జగన్నాథుడి (శ్రీకష్ణుడు) రథయాత్ర చింతపల్లి మండల కేంద్రంలోని రాజా రాజేశ్వర దేవాలయం నుంచి సాయి సన్నిధి శ్రీకృష్ణ గోకులం వరకు నిర్వహించారు. రథయాత్రకు మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులకు నైవేద్యం సమర్పణ, మంగళహారతి అనంతరం భక్తులకు మహా ప్రసాదం అందజేశారు. -
నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్అండ్బీ శాఖ ద్వారా జిల్లాకు ఎక్కువ నిధులు తెచ్చామని.. భవిష్యత్‌లో మరిన్ని నిధులు తెస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. సంగెం బ్రిడ్జికి రూ.45 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఎస్డీఎఫ్ కింద ప్రతి ఎమ్మెల్యేకు వెంటనే రూ.5 కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో చేపట్టిన అదనపు బ్లాక్ నిర్మాణాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రగతిపై కలెక్టర్ల వివరణ సమావేశంలో ముందుగా నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్, యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు.. ఆయా జిల్లాలో నీటిపారుదల, విద్యా, వ్యవసాయం, వైద్యం, మహిళా శక్తి, సంక్షేమం తదితర అంశాల్లో ప్రగతి, చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులకు వివరించారు. -
కలుపుతీసి ఎరువు పెట్టుకుంటాం
ప్రస్తుతం కురుస్తున్న వర్షం పత్తి చేలకు మంచి పదును ఇచ్చింది. వర్షం తగ్గగానే వెంటనే పత్తి చేలో కలుపు తీసుకుని ఎరువులు పెట్టుకుంటాం. చేను వాడుబడుతున్న సమయంలో వర్షం రావడం వల్ల పత్తి మొక్కలకు ప్రాణం వచ్చింది. – పనస కాశయ్యగౌడ్, గుండ్లపల్లి, నల్లగొండ మండలం రైతులు సంతోషంగా ఉన్నారు అల్ప పీడనం కారణంగా జిల్లా అంతటా మంచి వర్షం కురిసింది. పత్తి చేలు వాడుతున్న దశలో వర్షం రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పదునైనందున చేలకు ఎరువులు పెట్టుకోవచ్చు. నార్లు పోసుకున్న రైతులు కూడా పొలాలు దున్నుకుని నాట్లు వేసుకునే అవకాశం ఉంది. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
ప్రజా ప్రభుత్వం.. సంక్షేమమే ధ్యేయం
పథకాల అమలు తీరును అధికారులు పర్యవేక్షించాలిఫ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఫ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై నల్లగొండ కలెక్టరేట్లో సమీక్ష ఫ హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫ ఆయా రంగాల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కలెక్టర్లు నల్లగొండ : అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై బుధవారం నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి సమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా అర్హులకు మేలు జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రైతులకు సంబంధించిన అంశాలను మండలస్థాయి అధికారులతో జిల్లా అధికారులు రోజూ పర్యవేక్షించాలన్నారు. రైతు భరోసా, బీమా, ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా అభివృద్ధికి 15 రోజులకోసారి సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్‌రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, నల్లగొండ ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. -
ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈఓ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ మొదటి సెమిస్టర్లో 21.76 శాతం, రెండవ సెమిస్టర్ 23.56 శాతం, మూడో సెమిస్టర్లో 31.08 శాతం, నాలుగో సెమిస్టర్లో 36.05 శాతం, ఐదవ సెమిస్టర్లో 37.03 శాతం, ఆరవ సెమిస్టర్లో 46.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజి స్ట్రార్ అల్వాల రవి, కోఆర్డినేటర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, భిక్షమయ్య పాల్గొన్నారు. -
సాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
ఫ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదల ఫ సాగర్ జలాశయానికి చేరుతున్న 50వేల క్యూసెక్కుల నీరు ఫ ఆయకట్టులో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలునాగార్జునసాగర్, మిర్యాలగూడ : కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మే నెలలోనే జూరాల ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో అక్కడి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా మంగళవారం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిత్యం సుమారు 50వేల క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వస్తుండడంతో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో సాగర్ ఆయకట్టుకు ఈ ఏడాది ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ చివరి వారంలో నీటి విడుదలకు అవకాశం సాగర్ జలాశయ గరిష్టస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. జూన్ మొదటి వారంలో 511.80 అడుగులు (134.7466 టీఎంసీలు)గా ఉంది. బుధవారం నాటికి 517.60 అడుగులకు (144.9362టీఎంసీలు) చేరింది. సాగర్ నీటిమట్టం 540 అడుగులకు చేరి, ఎగువనగల జలాశయాలు గరిష్టస్థాయిలో ఉండి, నదిలో 70 నుంచి 100టీఎంసీల నీరు ఉంటే సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. సాగర్ కుడి, ఎడమ కాల్వల కింది 22,12,670 ఎకరాల ఆయకట్టు ఉంది. భూగర్భ జలాలు పెరిగి.. బోర్లు, బావులు, వాగుల ద్వారా మరో లక్ష ఎకరాలు సాగవుతుంది. కుడి, ఎడమ కాల్వల కింద సాగుకు 132 టీఎంసీల చొప్పున 264 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడు సార్లు ఆగస్టు మాసంలోనే ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. 2017లో అక్టోబర్ నెలలో విడుదల చేశారు. 2015, 2023 సంవత్సరాల్లో కృష్ణాబేసిన్‌కు వరదలు రాక జలాశయాలకు నీరు చేరకపోవడంతో కాల్వలకు నీరివ్వలేదు. ఈ ఏడాది ముందుగానే జలాశయాలకు నీరు చేరుతుండటంతో జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి.పదేళ్లుగా నీటి విడుదల వివరాలు ఇలా.. సంవత్సరం నీటిమట్టం విడుదల తేదీ 2014 515 ఆగస్టు 6 2015 510 నీటి విడుదల లేదు 2016 514 ఆగస్టు 26 2017 576 అక్టోబర్ 31 2018 555 ఆగస్టు 23 2019 556 ఆగస్టు 11 2020 556 ఆగస్టు 7 2021 585 ఆగస్టు 5 2022 555 ఆగస్టు 31 2023 506 నీటి విడుదల లేదు 2024 585 ఆగస్టు 2సాగు పనుల్లో ఆయకట్టు రైతులు సాగర్‌కు వరద వస్తుండడంతో సాగునీటి విడుదలకు ఢోకా ఉండదనే ధీమాతో ఆయకట్టు పరిధిలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని నార్లు పోసుకుంటున్నారు. వరద ఇలాగే వస్తే ఈ వానాకాలం సీజన్‌తోపాటు యాసంగి సీజన్లో కూడా గట్టెక్కినట్లేనని రైతులు భావిస్తున్నారు. సాగర్‌కు నీటి రాక మొదలైంది నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి సుమారు 50 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. నీటి రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నడూ లేని విధంగా ముందుగానే సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది. – మల్లికార్జున్, ఎస్ఈ, సాగర్‌డ్యాం -
14న రేషన్ కార్డుల పంపిణీ: ఉత్తమ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 14న కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై వృద్ధులు, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఈ విషయం వెల్లడించారు. 14న సాయంత్రం 6 గంటలకు తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులకోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 13లోగా పరిశీలించి, అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికలున్న చోట కొద్దిమందికి రేషన్ కార్డులు ఇచ్చిందే తప్ప అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్.. 44 కిలోమీటర్లలో 35 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేసి పనులు పునఃప్రారంభిస్తామన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: మంత్రి లక్ష్మణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నిరకాలుగా అండగా ఉంటుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, అలాకాకుండా తమ ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. వానాకాలంలో విద్యుత్తు సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రూ.1,200 కోట్లతో రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.1,200 కోట్లతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం చేపడతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. అధికారులు పథకాల అమలులో అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దన్నారు. -
చెత్తకుప్పలుగా ఓపెన్ ప్లాట్లు
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దేవరకొండ మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా దాదాపు 40వేల పైచిలుకు జనాభా ఉన్నట్లు అంచనా. నిత్యం దాదాపు 16టన్నుల చెత్తను మున్సిపల్ అధికారులు పట్టణంలోని సేకరిస్తున్నారు. 11 ఆటోలు, ట్రాక్టర్లు ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మొత్తం 77మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. అయినప్పటికీ ఓపెన్ ప్లాట్లు, ఖాళీ ప్రదేశాల్లో జనం చెత్త వేస్తున్నారు. చెత్తను బయట పడవేస్తే జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నా.. పట్టించుకోవడం లేదు. పట్టణంలోని శివారు కాలనీల్లో మురుగుకాల్వల నిర్మాణం లేకపోవడం.. డ్రెయినేజీలు ఉన్న చోట నిర్వహణ సరిగా లేకపోవడంతో పలు చోట్ల రోడ్లపైనే మురుగు పారుతోంది. దీంతో జనం దుర్వాజన, దోమలు, ఈగల బెడదతో అల్లాడుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. -
అరకొర సిబ్బందితో అంతంత మాత్రంగానే..
నకిరేకల్ : నకిరేకల్ మున్సిఫాలిటిలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. రోజూ చెత్తను తరలించేందుకు రెండు ట్రాక్టర్లు, ఆరు ఆటోలు వినియోగిస్తున్నారు. మొత్తం 71 మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. వీరు డ్రెయినేజీలను శుభ్రం చేయడం పాటు.. వాహనాల ద్వారా ఇంటింటా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేయడం లేదు. దీంతో కొన్ని వీధుల్లో నెలల తరబడి డ్రెయినేజీల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం లేదు. చాలా చోట్ల రోడ్లు వెంట చెత్త కూడా దర్శనమిస్తోంది. -
దుర్గందం వెదజల్లుతున్న మిర్యాలగూడ వీధులు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం వార్డు 48 ఉన్నాయి. మొత్తం 278 కార్మికులు 18 ట్రాక్టర్లు, 48 ఆటోల ద్వారా రోజూ రోజూ 50 మెట్రిక్ టన్నులు చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయినా మున్సిపాలిటీలో రోడ్లు, వీధుల వెంట చెత్త కుప్పలు.. కుప్పలుగా కనిపిస్తోంది. చెత్తను పూర్తిగా తరలించకుండా కొన్ని చోట్ల చెత్తను అక్కడే కాలుస్తున్నారు. దీంతో దుర్వాసన, పొగతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాలనీల్లోని ఖాళీ స్థలాల్లోనూ చెత్త వేస్తుండడంతో దోమల బెడద పెరిగి జనం అలాఅలడుతున్నారు. ఇక డ్రెయినేజీలు పూడికతో నిండిపోయాయి. ప్రధాన నాలాలు ఇటీవల కొంత పూడిక తీసినా.. వీధుల్లోని మురుగుకాల్వలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్ఘంధం వెదజల్లుతున్నాయి. -
వైద్య వృత్తి పవిత్రమైనది
నల్లగొండ : సమాజంలో వృత్తి వైద్య పవిత్రమైనదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నేషనల్ డాక్టర్స్‌డే సందర్భంగా మంగళవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఉత్తమ సేవలందించిన డాక్టర్లను శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఆపద సమయంలో ఆపద్బాందవుల్లా కనిపించే వైద్యులను ప్రజలు గౌరవిస్తారన్నారు. మనిషికి ఎంత సంపద ఉన్నా అనుభవించే ఆరోగ్యం లేకపోతే వృథా అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారిని కాపాడే శక్తి కేవలం వైద్యులకే ఉందన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి అందరి మన్ననలను పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
చిట్టీల వ్యాపారి అరెస్ట్
చిట్టీలు కట్టించుకుని మోసం చేసి పారిపోయిన చిట్టీల వ్యాపారిని మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. - 8లోహాలియాలో చెత్త కంపు హాలియా : హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా చెత్త సేకరణ కోసం 51 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. చెత్త సేకరణకు ఆరు ఆటోలు, మూడు ట్రాక్టర్లు ఉన్నాయి. అయినా పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం చెత్తచెదారంతో పేరుకుపోయింది. రోజూ చెత్తను సేకరిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారే తప్ప.. నివాసాల వద్దకు వచ్చి సేకరించడం లేదు. దీంతో ఇళ్లలో పేరుకుపోయిన చెత్తను జనం బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్నారు. ఈ చెత్తను తీయకపోవడంతో ఆ ప్రాంతాలు పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇక వానాకాలంలో చిన్నపాటి వర్షానికే పట్టణంలోని డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఖాళీ స్థలాల్లో మురుగు నిలిచి, పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి దోమలు విజృంబిస్తున్నాయి. ఇక ఇళ్ల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో కొత్త డ్రెయినేజీల నిర్మాణం ఊసే లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతోంది. దీంతో దుర్ఘందంలో జనం అల్లాడుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట కనీసం బ్లీచింగ్ ఫౌడర్, కెమికల్ స్ప్రే కూడా చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీలను రోజూ శుభ్రం చేయడంతో పాటు వార్డుల్లో పెరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
మిర్యాలగూడ : కార్మికుల హక్కుల సాధనకు ఈనెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మార్కెండేయ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సీఐటీయూ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల సమస్యలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. కొత్త చట్టాల వల్ల కార్మికులకు కనీస వేతనం అందదని, శ్రమకు తగ్గ వేతనం రాదని, శ్రమ దోపిడీకి గురవుతారని అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఈనెల 5న అన్ని మండల కేంద్రాల్లో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించాలని, 9వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపాలన్నారు. 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, తిరుపతి రామ్మూర్తి, బావండ్ల పాండు, రవినాయక్, రొండి శ్రీనివాస్, దయానంద్, కేశవులు, పార్వతి, సైదులు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
నేడు నల్లగొండకు మంత్రుల రాక
● ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమీక్షనల్లగొండ : నల్లగొండకు బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి రానున్నారు. నల్లగొండలోని కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై వారు సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రుల సమీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. సమీక్షించే అంశాలపై నోట్స్ తయారీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదితర ఏర్పాట్లలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ప్రారంభించనున్న ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ బి.వెంకటేశ్వరరావు, ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ ఫణిజ, గణేష్‌కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పుణ్య, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ పాల్గొన్నారు. పోర్చుగల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులునల్లగొండ : తెలంగాణ ఓవర్సిస్ మ్యాన్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో పోర్చుగల్‌లో ప్రైవేట్ ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోర్చుగల్‌లో ఖాళీగా ఉన్న ఎప్అండ్బీ మేనేజర్, హౌజ్ కీపర్, వెయిటర్, మెయిన్‌టెయిన్స్ టెక్నిషియన్, ఎగ్జిక్యూటివ్ టెక్నిషియన్, కుక్, కిచెన్ అసిస్టెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కోఆర్డినేటర్ తదితర ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు tom com.resume@gmail.com వెబ్‌సైట్‌కు రెజ్యూమ్‌లను పంపాలని పేర్కొన్నారు. అర్హత, తదితర పూర్తి వివరాలకు 9440052592, 9440049937 ఫోన్ం నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. పథకాలను వినియోగించుకోవాలిడిండి : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. మంగళవారం డిండి మండల మహిళ సమాఖ్య సంఘాల నూతన కార్యవర్గాలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్లు, డ్రోన్లు, ప్రమాద బీమా, పేదరిక నిర్మాలన తదతర అంశాలపై నూతన మహిళ సంఘ బంధాల సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీఎం పురుషోత్తం పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులునల్లగొండ : అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్యాలకు సంబంధించిన కోర్సుల్లో నాలుగు రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నిజాంఅలీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు కలిగిన, డిగ్రీలో ఉత్తీర్ణులైన ఎంబీసీ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాని పొందాలని తెలిపారు. tgobmms. cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణపత్రాలను జతచేసి ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నల్లగొండ కలెక్టరేట్లోని బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు టీచింగ్ డైరీ రాయాలినాంపల్లి : ప్రతి ఉపాధ్యాయుడు టీచింగ్ డైరీ రాయాలని డీఈఓ భిక్షపతి అన్నారు. మంగళవారం ఆయన నాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. బోధనోపకరణాలు ఉపయోగించి బోధించడంతో పాటు పాఠ్య ప్రణాళికలను తయారు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధన తీరు పరిశీలించారు. విద్యార్థుల చేత స్వయంగా బోర్డుపై ఉన్న అడిషన్స్‌ను చదివించారు. అనంతరం భవిత కేంద్రం, ప్రైమరీ స్కూల్‌ను తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంఈఓ మల్లికార్జునరావు ఉన్నారు. -
శరవేగంగా నెల్లికల్లు ఎత్తిపోతల పనులు
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : నెల్లికల్లు ఎత్తిపోతల పనులు శరవేగంగా సాగుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మొత్తం 11 గ్రామాల్లోని 24,624 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె నెల్లికల్ ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్, పైపులైన్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షం వల్ల పనులు ఆగిపోకుండా ముందే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులను భద్రతను సైతం దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రెస్సర్ మెయిన్(పైప్‌లైన్)కు సంబంధించి భూసేకరణ అవార్డు పాస్ చేసి.. చెల్లింపులు చేస్తున్నామన్నారు. కెనాల్‌కు సంబంధించి సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట మిర్యాలగూడెం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ప్రాజెక్టు డీఈ సీతారాం, ఏఈ రవి, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాసరావు, ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మాతా, శిశు మరణాలు తగ్గాయ్!
మరణాల సంఖ్య తగ్గుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిరకాల వైద్య సదుపాయాలున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. గర్భిణుల్లో కూడా చైతన్యం వచ్చింది. మంచి పౌష్టికాహారం తీసుకుని వైద్యుల సలహాలు పాటిస్తున్నారు. తద్వారా మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ నల్లగొండ టౌన్: వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలతో జిల్లాలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. ఆరేళ్ల క్రితం వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతోపాటు సకాలంలో వైద్యం అందకపోవడంతో మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండేది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో అన్నిరకాల మౌలిక సదుపాయలు కల్పించింది. ప్రత్యేక వైద్యులను నియమించింది. దీనికితోడు నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబందంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి నిష్ణాతులైన ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులను నియమించింది. వైద్య పరీక్షల కోసం అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన ఐసీయూ, కేఎంసీతోపాటు అన్ని విభాగాలను ఏర్పాటుచేసి వైద్యసేవలను మెరుగుపర్చింది. ఫలితంగా ఆరేళ్లుగా మాతా శిశు మరణాల సంఖ్య ఏటేటా తగ్గుముఖం పట్టింది. వాట్సప్ గ్రూప్‌లో వివరాలు జిల్లాలోని మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రులకు ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అత్యవసర చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. రెఫర్ చేసిన వెంటనే ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఎంసీహెచ్ వాట్సప్ గ్రూప్‌లో గర్భిణుల వివరాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అందించాల్సిన వైద్యం వివరాలను నమోదు చేస్తున్నారు. ఆ వాట్సప్ గ్రూప్‌లో ఎంసీహెచ్ ఇన్చార్జి, గైనిక్ హెచ్‌వోడీ, చిన్నపిల్లల విభాగం ఇన్చార్జి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, ఇతర విభాగాల ఇన్చార్జిలు ఉంటారు. దీనివల్ల వెంటనే వైద్యులు అలర్ట్ అయ్యి రోగి రాగానే సకాలంలో వైద్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కూడా అందించలేని పరిస్థితి ఉంటే వారిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేసిన వెంటనే రాష్ట్ర స్థాయిలో ఎంసీహెచ్ వాట్సప్ గ్రూప్‌లో రోగి వివరాలు నమోదు చేస్తున్నారు. వెంటనే ఆయా ఆసుపత్రుల అధికారులను అప్రమత్తం చేసి సకాలంలో వైద్యం అందేలా చూస్తున్నారు. సత్ఫలితాలిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలు గర్భం దాల్చిన నుంచి తల్లీబిడ్డ ఇల్లు చేరేవరకు పర్యవేక్షణ వాట్సప్ గ్రూప్‌లో రెఫరల్ కేసుల వివరాలు తగిన చికిత్స అందిస్తున్న వైద్యులు మాతా, శిశు మరణాల వివరాలు.. సంవత్సరం మాత శిశు 2018–19 14 3352019–20 18 3952020–21 08 3292021–22 26 3102022–23 13 3172023–24 12 2162024–25 10 221గర్భిణుల నమోదు నుంచే పర్యవేక్షణ మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం తర్వాత తల్లిబిడ్డలను ఇంటికి చేర్చే వరకు వైద్య ఆరోగ్య శాఖ నిత్యం పర్యవేక్షిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు.. గర్భిణుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వారిని పరీక్షల నిమిత్తం ప్రతినెలా ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. టీకాలు వేయించడం రక్తహీనత అధికమించేందుకు మందులను ఇప్పించడం పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నెలలు నిండగానే 102 వాహనంలో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళుతున్నారు. కాన్పు జరిగిన అనంతరం తల్లిబిడ్డను ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేరుస్తున్నారు. నిత్య పర్యవేక్షణతో మాతా శిశుమరణాల సంఖ్య తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. -
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
నల్లగొండ : ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం సమాజ సేవలో భాగస్వాములు కావాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కోరారు. మంగళవారం నల్లగొండలో నార్కట్‌పల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.ఇస్మాయిల్ పదవీవిరమణ సన్మానసభలో ఆయన మాట్లాడారు. 42 సంవత్సరాలుగా ఇస్మాయిల్ అధ్యాపక వృత్తిలో అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. వృత్తిపై నిబద్ధత గల వ్యక్తి ఎండి ఇస్మాయిల్ అని కొనియాడారు. అనంతరం ఇస్మాయిల్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో డీఐఈఓ దస్రూనాయక్, టీజీఓ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎండీ.ముజుముద్దీన్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ముగిసిన రేషన్ పంపిణీ
నల్లగొండ : మూడు మాసాల రేషన్ పంపిణీ సోమవారంతో ముగిసింది. జిల్లాలో 85 శాతం మంది రేస్షాపుల ద్వారా సన్న బియ్యం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనివిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంత ప్రజలు రేషన్‌షాపులకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్‌లోనే ఇచ్చింది. ఆ కోటా పంపిణీ ముగియడంతో రెండు నెలలపాటు రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 1న మళ్లీ ఓపెన్ జూన్, జులై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం కోటా జూన్ మాసంలోనే రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేశారు. ఆ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. జిల్లాలో 85 శాతం కార్డుదారులు జిల్లాలో రేషన్ తీసుకున్నారు. అయితే బియ్యం పంపిణీలో పోర్టబులిటీ ఉన్నందున ఇతర జిల్లాల్లో కూడా నల్లగొండ జిల్లాకు సంబంధించిన కార్డుదారులు 10 శాతం వరకు బియ్యం తీసుకుని ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల కోటా జూన్‌లో ఇచ్చినందున జూలై, ఆగస్టు నెలల్లో రేషన్‌షాపుల్లో మూత పడనున్నాయి. సెప్టెంబరు 1 నుంచి మళ్లీ రేషన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఫ సన్న బియ్యం తీసుకున్న 85 శాతం లబ్ధిదారులు ఫ రెండు నెలలపాటు మూతపడనున్న రేషన్ షాపులు రేషన్ పంపిణీ ఇలా.. రేషన్ దుకాణాలు 994మొత్తం కార్డులు 4,84,210 బియ్యం తీసుకున్నవారు 4,10,284 -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్‌డేలో సందర్భంగా కలెక్టరేట్‌కు బాధితులు తరలి వచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ వినతులు స్వీకరించారు. మొత్తం 122 మంది ఫిర్యాదులు అందించగా 67 రెవెన్యూ శాఖకు, మిగతావి ఇతర శాఖలకు సంబంధించినవి వచ్చాయి. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖలకు పంపారు.ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఫ గ్రీవెన్స్‌డేలో వినతుల స్వీకరణ -
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారు
నల్లగొండ : సాగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు అనర్హులకు ఇస్తున్నారని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పథకాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ డేలో ఆయన అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ అనర్హులకే అందుతున్నాయన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కలుగడం లేదన్నారు. అధికారులు ఏకపక్షంగా కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు. సాగర్ నియోజక వర్గంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఫోన్ చేసినా స్పందించడం లేదని.. నాయకులతో కలిసి నేరుగా మొర పెట్టుకుందామని వచ్చినా కలెక్టర్ అదుబాటులో లేరని అన్నారు. ప్రభుత్వం ఎవరిదైనా.. పేదల న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆయన వెంట అనుముల శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్‌సుందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ -
పేదల డాక్టర్.. రంగారెడ్డి
ఫ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఆయన తపన ఫ సూర్యాపేటలో ఆస్పత్రి నెలకొల్పిన తొలుత రూ.5కే వైద్య సేవలు ఫ ప్రస్తుతం రూ.20లకే ఓపీ ఫ పూర్వవిద్యార్థుల సేవాసమితి ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలునేడు డాక్టర్స్‌డే సూర్యాపేట అర్బన్: పేద రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి కష్టపడి చదవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పేదలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఆస్పత్రి ఏర్పాటు చేసుకొని నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ పేదల వైద్యుడిగా పేరుగాంచారు. పూర్వ విద్యార్థుల సేవా సమితి ఏర్పాటు చేసి వైద్య శిబిరాలతో పాటు అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ రంగారెడ్డి. నేడు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యుడి జీవిత విశేషాలు, వైద్య రంగంలో చేస్తున్న సేవలు ఆయన మాటల్లోనే.. -
మా కూతురి నుంచి రక్షించండి
నా కుమార్తె సామ అరుణ, భర్త ఆనంద్‌రెడ్డికి గిప్టుడీడ్ కింద 5 ఎకరాల 20 గుంటల భూమి ఇచ్చాం. అందులో ఇల్లు నిర్మించుకుని నివాసముంటూ మూడేళ్ల నుంచి మాపై దాడులు చేస్తూ.. మానసికంగా, శారీరకంగా బాధలు పెడుతోంది. మా తోటలో ఉన్న మమ్మల్ని కొట్టి చంపుతానని బెదిరిస్తోంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. నా చిన్నల్లుడికి అమ్మిన భూమిని కూడా సాగు చేయకుండా అడ్డుకుంటోంది. మా కూతురు నుంచి రక్షణ కల్పించి గిఫ్ట్‌డీడ్ రద్దు చేయాలి. – నారాయణరెడ్డి–మణెమ్మ దంపతులు, ఎరెడ్లగూడెం, గుర్రంపోడు మండలం -
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2025 సంవత్సరానికి అర్హత గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు natio nalawardstoteachers.education.gov.inలో వెబ్సైట్ ద్వారా నెల 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలు వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ చేసిన కాపీని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఏడాదిలో డీసీసీబీ టర్నోవర్ పెరిగింది నల్లగొండ అగ్రికల్చర్ : డీసీసీబీలో తమ పాలకవర్గం ఏర్పడిన సంవత్సరం కాలంలో ఎన్నడూ లేని విధంగా రూ.598.16 కోట్లుకు టర్నోవర్ పెరిగి మొత్తం రూ.2940.29 కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలకవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం డీసీసీబీలో కేక్ కట్‌చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన వెంటనే పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచామన్నారు. పంట రుణాల బడ్జెట్‌ను రూ.100 కోట్లకు తెచ్చామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు, సొసైటీలకు గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న పాలకవర్గం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, కొండా సైదయ్య, ఇరిగినేని అంజయ్య, గుడిపాటి సైదయ్య, దనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, సుష్మ, కొమ్ము కరుణ, కె.వీరస్వామి, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, డీజీఎంలు, ఏజీఎంలు సిబ్బంది పాల్గొన్నారు. మతోన్మాద విధానాలపై పోరాడాలిహాలియా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హాలియా పట్టణంలో నిర్వహించిన సీపీఎం సాగర్ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల జీవితాలను నడిరోడ్డుకు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును అమలు చేయాలన్నారు. అనంతరం ‘మతం – మతతత్వం’ అనే క్లాసును పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, ‘పార్టీ నిర్మాణం, పని పద్ధతులు, శాఖల నిర్మాణం’ అనే క్లాసును సీపీఎం జిల్లా వర్గసభ్యుడు చిన్నపాక లక్ష్మినారాయణ బోధించారు. కార్యక్రమంలో కొండేటి శ్రీను, అవుతా సైదయ్య, దైద శ్రీను, కందుకూరి కోటేష్, రామచంద్రయ్య, జటావత్ రవినాయక్, కత్తి లింగారెడ్డి, బషీర్, సోమయ్య, కొప్పు వెంకన్న, వేములకొండ పుల్లయ్య, చంద్రశేఖర్, కారంపూడి ధనమ్మ, కోరె రమేష్, వెంకటేశ్వర్లు, యశోద, రాజమ్మ తదితరులు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఖమ్మంపాటి శంకర్ నల్లగొండ: కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 18వ మహాసభలకు కేంద్ర కమిటీ సభ్యుడిగా జిల్లాకు చెందిన ఖమ్మంపాటి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ జిల్లా నుంచి ఆలిండియా మహాసభలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
నల్లగొండ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్‌పై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరాధరణకు గురైన, వెట్టి చాకిరికి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని చేరదీయడానికి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్ల పరిధిలో మూడు బృందాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ ముష్కాన్ నిర్వహించాలన్నారు. సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కృష్ణవేణి, ఏహెచ్‌టీయూ ఎస్ఐ రంగారెడ్డి పాల్గొన్నారు. -
మూడేళ్లుగా.. ఫీజులివ్వలే!
నల్లగొండ : పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) లక్ష్యం నీరుగారుతోంది. మూడేళ్ల నుంచి ఆ స్కీం కింద నిధులు విడుదల చేయకపోవడంతో రూ.రూ.6,81,58,732 బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బెస్ట్ అవైలబుల్ కింద ఎంపికై న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులకు బుక్స్, నోట్‌బుక్స్, యూనిఫాం ఇవ్వలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు దాపురించింది. జిల్లాలో 12 పాఠశాలలు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద జిల్లాలో 12 ప్రైవేట్ పాఠశాలలు విద్యనందిస్తున్నాయి. వీటిలో 5 నుంచి 10వ తరగతి వరకు 1,325 మంది విద్యార్థులకు చదువుకుంటున్నారు. ప్రభుత్వం డే స్కాలర్ కింద ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.28 వేలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42 వేలు చెల్లిస్తుంది. విద్యార్థులకు యూనిఫాం, నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, షూ కూడా సదరు పాఠశాలలే ఇవ్వాలి. ప్రతి విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం పాఠశాలలకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ మూడేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఆయా ప్రైవేట్ పాఠశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూనిఫాం, నోట్‌బుక్స్, షూ ఇవ్వలేమని వాటిని పిల్లలే తెచ్చుకోవాలని చెబుతున్నాయి. ధర్నాకు దిగిన తల్లిదండ్రులు బెస్ట్ అవైలబుల్ కింద ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం మూడేళ్ల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా ప్రైవేట్ పాఠశాలలు షూ, యూనిఫాం, నోట్‌బుక్స్ విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. నేటికీ నిధుల విడుదల విషయంలో స్పష్టత లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఫ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం ఇవ్వలేమంటున్న ప్రైవేట్ పాఠశాలలు ఫ ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులుబెస్ట్ అవైలబుల్ స్కూళ్లు 12చదివే విద్యార్థులు 1,325డే స్కాలర్‌కు ఏడాదికి చెల్లించేది రూ.28 వేలు రెసిడెన్షియల్‌కు రూ.42 వేలు 2022–23లో బకాయి రూ. 70,70,852 2023–24లో రూ.2,91,67,8802024–25లో రూ.3,19,20,000 మొత్తం బిల్లులు రూ.6,81,58,732బిల్లులు ట్రెజరీకు పంపాం బెస్ట్ అవైలబుల్ స్కీంకు సంబంధించి ఆయా ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించాల్సిన బిల్లులను ట్రెజరీకి పంపాం. రాష్ట్రస్థాయిలో ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు త్వరలోనే విడుదలవుతాయి. తల్లిదండ్రులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఈ విషయంపై వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని పైఅధికారులకు పంపుతాం. – శశికళ, ఎస్సీ అభివృద్ధిశాఖ డీడీ, నల్లగొండ -
కమలం చీఫ్ మనోడే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో ఆయనొక్కరే రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మంగళవారం ఆయన ఎన్నిక లాంఛనేమే కావడంతో జిల్లాలోని ఆయన బంధువులు, కోదాడ ప్రాంతంతోపాటు జిల్లా బీజేపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో స్థిర నివాసం రాంచందర్‌రావు తల్లిదండ్రులు కోదాడ ప్రాంతానికి చెందిన వారే. తండ్రి ప్రొఫెసర్ ఎన్వీఆర్ లక్ష్మీనారాయణరావు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందినవారే. లక్ష్మీనారాయణరావు బాల్యం ఇక్కడే గడిచింది. ఉన్నత విద్యాభ్యాసం తరువాత ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. రాంచందర్‌రావు చిన్నతనంలోనే తండ్రి లక్ష్మీనారాయణరావు, తల్లి రాఘవసీతమ్మ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దీంతో రాంచందర్‌రావు బాల్యం, చదువు అంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న సమయంలో నల్లబండగూడెంలో వారి కుటుంబం నివసించిన ఇల్లు ప్రస్తుత శిథిలావస్థకు చేరుకుంది. రాంచందర్‌రావు అమ్మమ్మ ఊరు కూడా కోదాడ పక్కనే ఉన్న అనంతగిరి మండల కేంద్రమే. అక్కడ రాంచందర్‌రావు తరఫు బంధువులు ఉన్నారు. కుటుంబంలో పెద్దవాడు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు ఇద్దరు సోదరులు. వారిలో పెద్ద తమ్ముడు ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు. ఆయన జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా, వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాయపూర్ ఎన్ఐటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీకి ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రెండో తమ్ముడు హేమచందర్ అమెరికాలో స్ధిరపడ్డాడు. రాంచందర్‌రావు బాబాయి కుమారుడు రాఘవరావు కోదాడలో చిన్న పిల్లల వైద్యశాలను నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రాంచందర్‌రావు ఫ ఆయన సొంతూరు కోదాడ మండలం నల్లబండగూడెంఅంచెలంచెలుగా ఎదిగిన రాంచందర్‌రావు రాంచందర్‌రావు విద్యార్థి దశనుండే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించిన ఆయన 1980–85 కాలంలో యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. న్యాయ విద్య పూర్తయిన తరువాత హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే బీజేపీ నాయకుడిగా ఎదిగారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కాబోతున్నారు. ఆయనకు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో మంచి వక్తగా పేరుపొందారు. ఇప్పటికీ కోదాడ ప్రాంతంలో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆయన తరచుగా హజరవుతుంటారు. -
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
నేరేడుచర్ల(నల్గొండ): ప్రియుడికి వీడియో కాల్ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్‌రెడ్డి కూడా ఎల్బీనగర్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అశ్విని, సురేష్‌రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్‌రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్‌రెడ్డికి వీడియో కాల్ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్‌రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్‌రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతదేహంతో ఆందోళన..అశ్విని మృతికి సురేష్రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్‌రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్‌రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
ఆర్ఎంపీ వివాహేతర సంబంధం.. జ్యోతిని కారులో తీసుకెళ్లి..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను పక్కాగా ప్లాన్ ప్రకారం ఓ ఆర్ఎంపీ హత్య చేశాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే పూడ్చిపెట్టేందుకు యత్నం చేశాడు. కానీ, పోలీసులు రంగం ప్రవేశం చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడ్ మండలంలో మహేష్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక జునూతలలో జ్యోతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో, ఒత్తిడికి గురైన మహేష్.. జ్యోతిని అడ్డుతొలంగిచుకోవాలని చూశాడు. తాజాగా ఆమెతో మాట్లాడిన మహేష్.. బయటకు తీసుకెళ్లే నెపంతో దేవరకొండ నుంచి బాధితురాలిని తీసుకుని కారులో బయలుదేరాడు.అనంతరం, మార్గ మధ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఆగ్రహానికి లోనైన మహేష్.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును బలవంతంగా ఆమెతో తాగించాడు. జ్యోతిని హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్.. ఆమెకు విషపు ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. జ్యోతి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే.. ఆమెను మట్టిలో పూడ్చిపెట్టాలని అనుకున్నాడు. అయితే, మహేష్ వెళ్తున్న కారుపై అనుమానం వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు.. అతడిని వెంబడించారు. కారును ఆపి పరిశీలించగా.. కొన ఊపిరితో ఉన్న జ్యోతిని చూసి వెంటనే.. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే జ్యోతి మృతి చెందింది. అనంతరం, నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. -
కార్మిక చట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
హాలియా : ఎందరో బలిదానాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా సంస్కరణలు చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు. ఆదివారం హాలియా పట్టణంలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సాగర్ నియోజకవర్గ సీఐటీయూ విస్తృత జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోరాడి సాఽధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి 44కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడులుగా కుందించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తగ్గిస్తూ సామాజ్యవాదులు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు అవుతా సైదులు, నాయకులు ఎస్కె బషీర్, వెంకటమ్మ, లక్ష్మమ్మ, నర్సారెడ్డి, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, సయ్యద్ హుసెన్, చిరంజీవి, వేణుగోపాల్, సైదిరెడ్డి, నన్నే సాహెబ్, శ్రీను, అనూష తదితరులు ఉన్నారు. -
నిరుపేదలకు వరంలా ప్రజా ప్రభుత్వం
మాడుగులపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వరంలా మారిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మాపురం, కన్నెకల్, గోపాలపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం స్థానిక అధికారులు, నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. నిరుద్యోగులకు 60వేల ఉద్యోగాలు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ చేశారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదవాడికి ఇళ్లు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ఎవరూ అఽధైర్య పడవద్దన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, బోడ యాదయ్య, కొత్త దశరధ, గద్దల శేఖర్, రామాంజిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కొండ భాస్కర్, కొండేటి శంకర్, హౌసింగ్ ఏఈ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు హరికృష్ణ, నాగరమణి, ఇందిరమ్మ, లబ్ధిదారులు యాదయ్య, శంకర్, రేణుక, నాగయ్య పాల్గొన్నారు. -
పేదల పక్షాన సీపీఐ నిరంతర పోరాటం
డిండి : దేశంలో పేదరికం ఉన్నంత కాలం ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఈడెన్ గార్డెన్లో నిర్వహించిన సీపీఐ మండల 15వ మహాసభకు ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సీపీఐ నాయకత్వం వహించిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్మరించి పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తుందని ఆయన ఆరోపించారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటరమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మైనొద్దిన్, జిల్లా సమితి సభ్యుడు తూం బుచ్చిరెడ్డి, మండల కార్యదర్శి కనకాచారి, మండల సహాయ కార్యదర్శులు విజేందర్‌రెడ్డి, శైలేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మిర్యాలగూడ వాసికి గౌరవ డాక్టరేట్
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని హనుమాన్‌పేటకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పగిడిమర్రి గోవ ర్ధనాచారి చేస్తున్న సామాజిక వైద్య సేవలను గుర్తించిన ఏషియా వేదిక ఇంటరర్నేషనల్ కల్చర్ అండ్ రిసేర్చ్ స్ఫూర్తి అకాడమి సంస్థ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ మేరకు ఈనెల శనివారం హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రముఖ డాక్టర్ సుదర్శన్‌గౌడ్, గూడూరు చెన్నారెడ్డి, వందేమాతరం బృందం నుంచి గోవర్ధనాచారి ఈ వార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను 40ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నానని, పేదలకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తాను చేస్తున్న వైద్య సేవలను గుర్తించిన ఏషియా వేదిక ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రిసేర్చ్ స్ఫూర్తి ఆకాడమి సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. -
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
హాలియా : మండలంలోని నాయుడుపాలెంలో ఆదివారం సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి లబ్దిదారుడు ఓగిరాల శ్రీధర్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఓగిరాల శ్రీధర్ తల్లి ఓగిరాల లీలావతికి మంజూరైన రూ. 90వేల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె కుమారుడు ఓగిరాల శ్రీధర్‌కు ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ రామారావు, డాక్టర్ శ్రీధర్, మాజీ ఎంపీటీసీ అంజమ్మ, సర్ధార్, యడవెల్లి రాంబాబు, తేరా హనుమంతు, మున్సుబ్ తదితరులు ఉన్నారు. విద్యాశాఖ కమిషనర్‌కు వినతిమిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడలోని ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడీని నియంత్రించాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్‌లో పాఠశాలల విద్యాశాఖ కమిషనన్ నవీన్ నికోలస్‌ను కలిసి బీసీ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పలు పాఠశాలలు విద్యా హక్కు చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీడయ్య యాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమల గిరి అశోక్, ఉపేందర్, శ్రీనివాస్, రాజు, సైదయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నికచింతపల్లి : మండలంలోని నరసర్లపల్లి గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు నల్ల కాశయ్య మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల సురేందర్ మాదిగ, ఉపాధ్యక్షుడు నల్ల మధు మాదిగ, పల్లె మొగులాన్ మాదిగ, ప్రధాన కార్యదర్శులు నల్ల సైదులు మాదిగ, నల్ల విష్ణు మాదిగ, కార్యదర్శి ఎలిమినేటి సైదులు మాదిగ, నల్ల వెంకటయ్య మాదిగ కార్యవర్గసభ్యుడు నక్క శివ మాదిగ, కోశాధికారి నల్ల రమేష్, మాదిగ, గౌరవ అధ్యక్షుడు పల్లె కృష్ణ మాదిగ, సహాయ కార్యదర్శి నల్ల గణేష్ మాదిగ, సంస్కృత కార్యదర్శి నక్క నరేందర్ మాదిగ, సోషల్ మీడియా గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల, గిరి మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పదినల్లగొండ టౌన్: ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పదని ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి కన్వీనర్, న్యాయవాది పాశం నరేష్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లారు. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు బానిసలుగా బతకాల్సిన రోజులు వస్తాయన్నారు. సనాతన ధర్మం అంటూ మనిషిని మనిషిగా చూడని మనుధర్మాన్ని అమల్లోకి తెచ్చే కుట్ర జరుగుతోందన్నారు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గాదె లింగస్వామి, వంటెపాక యాదగిరి, కత్తుల జగన్‌కుమార్, కె.పర్వతాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి, ఎండీ కుతుబుద్దిన్, పందుల సైదులు, కొండ లలితక్క, ఎండి రఫీ, వెంకులు, షరీఫుద్దీన్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం
కొండమల్లేపల్లి : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎదుళ్ల ఎల్లయ్య మాదిగ అన్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చింతకుంట్ల గ్రామంలో 400 మంది ఓటర్లు ఉన్న మాదిగలకు కనీసం ఒక్క ఇల్లు రాకపోవడం శోచనీయమన్నారు. మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ అగ్రకుల నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ మేరకు ఎస్సీ కమిషన్‌ను సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షులు వస్కుల శ్రీనివాస్‌మాదిగ, ఎదుళ్ల భిక్షమయ్య, మారపాక రాములు, పంది అంజయ్య, పంది యాదయ్య పాల్గొన్నారు. -
వీధుల్లో పారుతున్న మురుగు
పెద్దవూర : మండలంలోని జయరాంతండాలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. తండాలోని చాలా వీధుల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ మురుగు కాల్వలను నిర్మించలేదు. దీంతో ఇళ్ల నుంచి వ్యర్థాలతో కూడిన నీరు వీధుల వెంట పారుతూ చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా సీసీ రోడ్లపై మోకాళ్లలోతులో నీరు నిల్వ ఉంటుంది. మురుగు కాల్వలను నిర్మించకపోవడంతో సీసీ రోడ్లపై నీరు నిలిచి మురికికూపంగా తయారై వీధులన్ని కంపుకొడుతున్నాయి. ఇవి దోమలకు నిలయాలుగా మారి విషజ్వరాలకు కారణభూతం అవుతున్నాయి. వర్షాలు లేని సమయంలోనే ఇలా ఉంటే వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికి కష్టంగా ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సీసీ రోడ్ల వెంట మురికి కాల్వలను నిర్మించి వీధులలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని తండావాసులు కోరుతున్నారు.పాఠశాలలోకి వెళ్లేదెలా..నిడమనూరు : మండలంలోని ఆదర్శ పాఠశాల ప్రధాన గేటు ఎదుట మురుగునీరు ప్రవనిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుంది. దీంతో విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కొన్ని మీటర్ల దూరంలో ఆదర్శ పాఠశాల హాస్టల్ ఉంది. దీంతో విద్యార్థులు వాసన భరించలేకపోతున్నారు. వర్షం వస్తే మురుగు ప్రవాహం పెరిగిపోయి పాఠశాలలోకి ప్రవాహించే అవకాశం ఉంది. హాస్టల్ మెస్ కూడా పరిసరాల్లోనే ఉంది.పలు కాలనీల్లో నుంచి వచ్చే డ్రెయినేజీ మరుగు, వర్షపు నీరంతా ఆ పాఠశాల ముందునుంచే సమీపంలోని వాగులో కలుస్తాయి. కాల్వకు సీసీ లైనింగ్ లేకపోవడంతో మురుగు అంతా నిలిచిపోయి తీవ్ర దుర్గంధంగా మారింది. ఇప్పటికై న అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
రోడ్డు పక్కన దుర్గంధం
కొండమల్లేపల్లి : పారాబాయిల్డ్ రైస్ మిల్లు నుంచి విడుదలైన మురుగు నీరు మొత్తం కూడా రోడ్డు పక్కన నిలవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామపంచాయతీలో ఓ రైస్ మిల్లు నుంచి విడుదలైన మురుగు నీరు మొత్తం నిల్వ ఉండడంతో కొండమల్లేపల్లి నుంచి నల్లగొండకు వెళ్లే వాహనదారులకు విపరీతమైన దుర్వాసన రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వడ్లను ఉడకబెట్టిన నీరు మొత్తం కూడా ఇలా బయటికి వదలడంతో ఆ దుర్గందాన్ని భరించలేక వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి సదరు మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిచేయాలి
త్రిపురారం : రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వీరపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం త్రిపురారం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రెండో మండల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రైతుల పక్షాణ చేస్తున్న పోరాటాలను అనచివేస్తు రైతలకు నష్టం చేసే నల్ల చట్టాలను తీసుకవచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం మండల రైతు సంఘం అధ్యక్షుడు కొప్పు వెంకన్న, సీపీఎం మండల కార్యదర్శి దైద శ్రీను, కందిమళ్ల వీరారెడ్డి, వెంకటయ్య, రాములు, రామచంద్రు కోటయ్య పాల్గొన్నారు. -
సోములు విగ్రహావిష్కరణ
మిర్యాలగూడ : పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉబ్బపల్లి సోములు కాంస్య విగ్రహాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉబ్బపల్లి సోములు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. వ్యక్తిగతంగా సోములు తనకు దగ్గరి మిత్రుడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, మగ్ధుమ్పాషా, మట్టపల్లి సైదయ్యయాదవ్, ఇలియాస్‌ఖాన్, మెరుగు రోశయ్య, మాజీద్, రామలింగయ్యయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, రామస్వామి, దైవ వెంకటేష్, పీసీకే ప్రసాద్, విష్ణు, సోముసుందర్ పాల్గొన్నారు. -
‘కస్తూరిబా’లో ప్రవేశాల జోరు
తిరుమలగిరి(నాగార్జునసాగర్): ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలంటే తల్లిదండ్రులు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ప్రశ్నార్థకమేనా? అనే పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కానీ అందుకు బిన్నంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు మాత్రం రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆ పాఠశాలలు విద్యార్థులతో నిండపోతుండటంతో అక్కడ అడ్మిషన్ కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సిందే. పాఠశాలలు ప్రారంభమైన మూడు రోజులకే అడ్మిషన్లు పూర్తవ్వడంతో అధికారులు అడ్మిషన్లు పుల్..అడ్మిషన్లు లేవు అని బోర్డు పెడుతున్నారంటే కేజీబీవీ పాఠశాలలకు ఏ స్థాయిలో ఆదరణ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ పాఠశాలలో అడ్మిషన్ మాదిరిగా ఇక్కడ పేరున్న నాయకులతో పైరవీలు చేయిస్తున్నా సీటు మాత్రం దొరకట్లేదు. ప్రభుత్వం తరగతికి 40మంది విద్యార్థులే అని పరిమితి విధించడంతో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. ఆంగ్లమాధ్యమంలో బోధన తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 265 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐదు కొత్త మండలు తిరుమలగిరి(సాగర్), నేరేడుగొమ్ము, మల్లేపల్లి, మాడుగులపల్లి, అడవిదేవులపల్లి మండలాల్లోని పాఠశాలల్లో పూరి ్తస్థాయిలో ఆంగ్లమాధ్యమంలో బోధన అందిస్తున్నారు. జిల్లాలోని మిగతా 22 పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లమాధ్యమంలో బోధన కొనసాగుతుంది. దీంతో ఈ పాఠశాలలకు బాగా డిమాండ్ పెరిగింది. పదో తరగతి ఫలితాల్లో కూడా వందశాతం ఉత్తీర్ణతతో పాటు, ఉత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో కస్తూరిబా గాంధీ విద్యాలయాలకు విద్యార్థులు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. నాణ్యమైన పౌష్టికాహారం పేద విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం మెస్ చార్జీల కింద రూ. 1225 చెల్లిస్తుండగా, ఈ ఏడాది రూ. 1740 చొప్పున చెల్లిస్తుంది. నెలకు రెండుసార్లు మాంసం, ఐదు సార్లు చికెన్, వారం రోజులు గుడ్లు, శాఖహారులకు మిల్మేకర్ అందిస్తున్నారు. రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు. నమ్మకంతోనే ఆదరణ ఉత్తమ ఫలితాలు రావ డం, సక్రమంగా మెనూ ను అందిస్తుండటంతో కేజీబీవీ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. దీనికి తోడు ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. సీట్లు పూర్తయినా విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం వస్తుండటంతో అయిపోయినట్లు బోర్డు పెట్టాం. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తున్నాం. – కవిత, ఎస్ఓ, తిరుమలగిరి కేజీబీవీ తిరుమలగిరి కేజీబీవీలో నో అడ్మిషన్ బోర్డు కొన్నేళ్లుగా ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధన పూర్తిస్థాయిలో ఆంగ్ల బోధన అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల పైరవీలు -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
మిర్యాలగూడ అర్బన్ : జూలై 9న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లు గౌతమ్‌రెడ్డి, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రామ్మూర్తి కోరారు. ఆదివారం స్థానిక ఎప్సీఐ వద్ద సివిల్ సప్లయ్ హమాలి కార్మికులకు సార్వత్రిక సమ్మె కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను తుంగలో తొక్కి నాలుగు నల్ల లేబర్ చట్టాలను తీసుకవచ్చిందని ఆరోపించారు. ఈ నాలుగు చట్టాల వలన కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు. ఈ సమ్మెలో పాల్గొనేందుకు కార్మికులందరు పనులను బంద్ చేసి సమ్మెలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమలో యూనియన్ నాయకులు అంజన్‌రావు, బాలకృష్ణ తదితరులున్నారు. -
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పెద్దవూర : మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో 2009–10 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా పదహేను ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఒకరికొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అపురూప క్షణాలను సెల్ఫోన్లో బందించుకున్నారు. అనంతరం నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాటి హెచ్ఎం సలికంటి వెంకటయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాసచారి, కర్ణ సైదిరెడ్డి, పాకాల నర్సింహ్మా, కర్ణ రాణి, షర్ఫుద్దీన్, నరేందర్, విద్యార్థులు కేతావత్ రంగానాయక్, హనుమా, వేణు, నరేష్, సత్యనారాయణ, నగేష్, కృష్ణమూర్తి, గణేష్, సీతారామయ్య, లావణ్య, సరిత, అనిత, మౌనిక, స్వాతి, రోజా, రవికుమార్, నరహరి, నాగు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం
నల్లగొండ: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆది వారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగం పటిష్ట పరచడంలో టీఎస్ యూటీఎఫ్ సభ్యులు ముందుండాలని పిలుపునిచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు సకాలంలో అందించినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పీఆర్సీ గడువు తీరినందున పీఆర్సీ రిపోర్టు వెంటనే తెప్పించుకొని అమలు పరచాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి , ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు, ప్రతినిధులు నర్రా శేఖర్‌రెడ్డి, బి.అరుణ, వడ్త్యా రాజు, ఎడ్ల సైదులు, రామలింగయ్య, గేర నరసింహ, యాట మధుసూదన్‌రెడ్డి, రమాదేవి, నలపరాజు వెంకన్న, చినవెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, మధుసూదన్‌రెడ్డి, నర్సింహమూర్తి, భానుప్రకాష్, గిరి యాదగిరి, యరనాగుల సైదులు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఫ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి -
జనగణనకు సన్నద్ధం
నల్లగొండ: జనగణనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 మార్చి ఒకటి నాటికి రెండు దశల్లో జిల్లాలో జనాభా లెక్కలు సేకరించనున్నారు. తొలి దశలో ఇళ్ల జాబితాను వెలువరించి రెండో దశలో జనగణన చేపట్టనున్నారు. చివరగా 2011లో దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టారు. మరలా 2021లో నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా జనగణన చేపట్టలేదు. దీంతో పదేళ్లకు ఒకసారి చేపట్టాల్సిన జనగణన ప్రక్రియ నాలుగేళ్లు ఆలస్యమైంది. జనగణన చేపట్టేందుకు ఇటీవల ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం జనగణనకు సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈసారి జనగణనతోపాటే కులగణన, జాతీయ పౌర పట్టిక (నేషనల్ సివిల్ రిజిస్టర్) ఒకేసారి చేపట్టాలని నిర్ణయించింది. కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ.. జనగణనకు సంబంధించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీఆర్ఓ, సీపీఓతో సహా రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరో అధికారితో జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్ జనగణన అధికారిగా వ్యవహరిస్తే అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ సహాయకుడిగా ఉంటారు. ఎన్యుమరేటర్లను ఉపాధ్యాయులనే నియమిస్తారు. అయితే నియమించిన ఎన్యుమరేటర్లంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రశ్నావళి ఆధారంగా జనగణన చేపట్టనున్నారు. వచ్చే ఏడాదే ఎన్యుమరేటర్ల నియామకం అయితే 2026లోనే ఎన్యుమరేటర్లను నియమించి వారికి శిక్షణనివ్వనున్నారు. 150 గృహాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున నియమించి శిక్షణ ఇవ్వనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమిస్తారు. వీరంతా మొదట వారికి అప్పగించిన గ్రామాల్లో ఇళ్లను గుర్తిస్తారు. వారి పరిధిలో ఎన్ని గృహాలున్నాయి. ఆ గృహాల్లో ఎన్ని కుటుంబాలు నివశిస్తున్నాయనేది పూర్తి డేటాను మొదట సేకరిస్తారు. ఆ తర్వాత ఇంటింటికీ తిరిగి జనాభా వివరాలు సేకరిస్తారు. 2027 సంవత్సరంలో పూర్తికానున్న ప్రక్రియ 2026లో ఎన్యుమరేటర్ల నియామకంతో పాటు జనగణన ఏ విధంగా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 2027 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇంటింటికీ వెళ్లి జనగణన నిర్వహిస్తారు. 2027 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి 12గంటలలోపు పుట్టిన వారిని లెక్కలోకి తీసుకుంటారు. ఆ తర్వాత జన్మించిన వారిని పరిగణనలోకి తీసుకోరు. మార్చి 1 వరకు జనగణన ప్రక్రియ ముగియనుంది. గతంలో నేరుగా ఇంటింటికి వెళ్లి మాన్యువల్‌గా జనగణన చేపట్టగా ఈసారి జనగణన వివరాలు మొత్తం మొబైల్ యాప్‌లో నమోదు చేయనున్నారు. ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఫ కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు ఫ రెండు దశల్లో కొనసాగనున్న ప్రక్రియ ఫ తొలి విడతలో ఇళ్ల జాబితా గుర్తింపు ఫ మలి దశలో జనాభా వివరాల సేకరణ ఫ ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులుజిల్లా వివరాలు ఇలా.. భౌగోళిక విస్తీర్ణం 7,128 కి.మీ. రెవెన్యూ గ్రామాలు 566మండలాలు 33మున్సిపాలిటీలు 08పంచాయతీలు 869జనాభా (2011లెక్కల ప్రకారం) 16,18,416పురుషులు 8,18,306మహిళలు 8,00,110 కుటుంబాలు 4,01,728 -
శుభాన్షు శుక్లాకు సెల్యూట్
చిట్యాల: అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండవ భారతీయుడుగా రికార్డు సృష్టించిన శుభాన్షు శుక్లాకు గురువారం చిట్యాలలోని ఆక్స్‌ఫోర్ట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ జాతీయ పతాకం చేతపూని సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పెద్ది నరేందర్ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శుభాన్షు శుక్లా నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు నర్రా భిక్షంరెడ్డి, నమ్ముల ఆనంద్‌కుమార్, షేక్ షెమీమున్సిసా బేగం, పుల్లెంల సంతు, గణేష్, జ్యోతి, ధనలక్ష్మి, ఆసియా, మాధవి, మౌనిక, కీర్తి, లింగస్వామి పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
నల్లగొండ : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పోలీస్, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు చేపట్టిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రకాశం బజార్లో డిజిటల్ తరగతులతోపాటు, అన్ని సౌకర్యాలతో నూతన పాఠశాల నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయాల గురించి తెలిసివారు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు ఎస్పీ రమేష్, డీఈఓ భిక్షపతి, డీఎస్పీ శివరాంరెడ్డి, సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ నల్లగొండలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ -
తనిఖీలతో బోధనకు ఆటంకం
బాధ్యతలు వీరికే.. పాఠశాలల తనిఖీలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో పదేళ్లు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. వీరిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు రోజుకు రెండు పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల్లో 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయించాలనేది విద్యా శాఖ నిర్ణయం. అయితే అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఎంపిక చేయనుంది. ఇదిలా ఉంటే ఓ ఎస్జీటీ మరో ఎస్జీటీ మీద, ఒక స్కూల్ అసిస్టెంట్.. మరో స్కూల్ అసిస్టెంట్ మీద తనిఖీలు చేయడం సరైంది కాదని ఉపాధ్యాయులు గొనుక్కుంటున్నారు. నల్లగొండ: ఒకపక్క గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల ఏర్పాటు అవడం..మరోపక్క పట్టణాల్లోని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రతి గ్రామానికి బస్‌లు పంపుతూ ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తుండడంతో అధిక శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితిని అధిమించేందుకు రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలను రోజూ తనిఖీ చేయడం ద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతాయని భావించింది. అందుకు తనిఖీల బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిటీతో తనిఖీ బాధ్యతలకు ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. అయితే విద్యా శాఖ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయులు తనిఖీలు చేసేందుకు వెళ్తే బోధన కుంటుపడుతుందని అంటున్నారు. ఫ స్కూళ్ల పర్యవేక్షణకు టీచర్లకు బాధ్యతలు ఫ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ ఫ ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని సర్కారు యోచన ఫ వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు జీహెచ్ఎంలు 178 ఎల్ఎఫ్ఎల్ 164ఎస్ఏలు 2,278 ఎల్పీలు 97ఎస్జీటీలు 2,729 పీఈటీలు 151ఇతరులు 15 మొత్తం 5,612 -
భూభారతి అర్జీలను వెంటనే పరిష్కరించాలి
నల్లగొండ: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులపై సమీక్షిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో 45,313 దరఖాస్తులు వచ్చాయని వీటిని ఆగస్టు 14లోపు పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుదారుకు నోటీసు జారీచేసి విచారణ చేసిన తర్వాత వారం సమయం ఇచ్చి ఆ తర్వాత పరిష్కరించాలన్నారు. అదనపు ఇన్చార్జి కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల్లో 15వేలు మిస్సింగ్ సర్వే నంబర్లవే ఉన్నాయన్నారు. ఆర్డీఓలు అర్హత ఉన్న దరఖాస్తుల వివరాలు మాత్రమే భూభారతిలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఎమ్మార్వోలు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి
నార్కట్‌పల్లి : ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలోని బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌కు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌ను సందర్శించి మాట్లాడారు. కాల్వ పనులను వేగవంతంగా పూర్తి చేస్తే రిజర్వాయర్ కింది లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పానగల్ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌లోకి రెండు రోజులుగా నీరు విడుదలవుతుందని, మరో రెండు రోజుల్లో రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండనుందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూములను అప్పగించిన రైతులకు పరిహారం చెల్లింపులలో జాప్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె, శ్రీనివాస్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి, శ్రీనివాస్‌రెడ్డి,డిఈ వీఠలేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, వడ్డే భూపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, దామెర ఉదయ్‌కుమార్, బొడిగె స్వామి ఉన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
సగటు వర్షపాతం.. 8.3 మిల్లీమీటర్లు
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 8.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చందంపేట మండలంలో 37.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుండ్లపల్లిలో 31.0, నేరెడుగొమ్ములో 29.5, పెద్దవూరలో 16.1, పీఏపల్లిలో 15.4, తిప్పర్తిలో 15.9, కేతేపల్లిలో 15.9, నకిరేకల్‌లో 14.3, దామరచర్లలో 13.6, మిర్యాలగూడలో10.4, శాలిగౌరా రంలో 11.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కట్టంగూరులో 7.3, నల్లగొండలో 3.7, కనగల్‌లో 3.6, మునుగోడులో 1.1, చండూరులో 3.9, చింతపల్లిలో 1.5, నాంపల్లిలో 0.2, గు ర్రంపోడు 3.0, అనుముల హాలియా 3.1, నిడమనూరులో 2.2, త్రిపురారంలో 3.4, మాడుగులపల్లిలో 4.7, వేముపల్లిలో 4.0, అడవిదేవులపల్లిలో 4.1, తిరుమలగిరి సాగర్‌లో 2.9, కొండమల్లెపల్లిలో 1.9, దేవరకొండలో 8.0 గుడిపల్లిలో 2.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దేవరకొండ డివిజన్లో అధిక వర్షం కురిసింది. ప్రతి పేషెంట్‌కు ‘ఆభా’ ఐడీ క్రియేట్ చేయాలి దేవరకొండ : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రతి పేషెంట్‌కు తప్పనిసరిగా ఆయుస్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఆభా) ఐడీ క్రియేట్ చేయాలని డీసీహెచ్ఎస్ మాతృనాయక్ అన్నారు. గురువారం దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆరోగ్యశ్రీ సిబ్బందితో వేర్వేరుగా సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చేవారి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రి ముందుందన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాష్, సిబ్బంది ఉన్నారు. రాజీవ్ యువ వికాసాన్ని ప్రారంభించాలినల్లగొండ టౌన్: ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే ప్రారంభించి అర్హులకు ఇవ్వాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అన్నారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉపాధి కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. సమావేశంలో రవినాయక్, మల్లం మహేష్, పతని శ్రీను, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, మహ్మద్ ఆక్రమ్, పాలది కార్తీక్, వంశీ, ఏడుకొండలు, బొడ్డుపల్లి నరేష్, బూర్గు గోపి కృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
విద్యార్థులు ‘ఇన్స్పైర్’ పొందేలా..
నల్లగొండ: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక ఆలోచనలు, సృజనాత్మకత వైపు మళ్లించి భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) మనక్ అవార్డు(2025–26)కు సంబంధించి.. పాఠశాలల్లోని విద్యార్థుల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తోంది. ఈ నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 15 వరకు కొనసాగనుంది. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, రెసిడెన్షియల్, ఎయిడెడ్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇన్స్పైర్ మనక్ అవార్డుల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసేదిలా.. ఇన్స్పైర్ మనక్‌పై ఆసక్తి కలిగిన పాఠశాల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ కోరుతోంది. www.inspireawards.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాఠశాలలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళుతుంది. జిల్లా అథారిటీ ఆమోదిస్తే 24 గంటల్లోపు విద్యార్థికి సంబంధించిన మెయిల్ ఐడీకీ యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. అప్పుడు యూజర్ ఐడీకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. విద్యార్థి తన సమాచారం, బ్యాంకు అకౌంట్, ఐఎప్ఎస్సీ కోడ్, ఆధార్, విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టు సంక్షిప్త రిపోర్టు వెబ్సైట్లో నమోదు చేయాలి. విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం ఉంది. అయితే విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్లో ప్రాజెక్టు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఐడియా బాక్సు ఏర్పాటు చేసుకోవాలి అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు వినూత్న ఆలోచనలను ఉపాధ్యాయులు గుర్తించేందుకు ఐడియా బాక్సు ఏర్పాటు చేసుకోవాలి. పరిసరాల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ వేదిక ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా 5 ప్రాజెక్టులు నామినేషన్ చేసుకోవాలి. – వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి ఇన్స్పైర్ మనక్ ఒక వరం ఇన్స్పైర్ మనక్ విద్యార్థులకు ఒక వరం లాంటిది. శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకునే విద్యార్థులకు ఎంతగానో దోహదం పడుతుంది. సామాజిక సమస్యలకు శాసీ్త్రయ రూపంలో పరిష్కారాలు చూపగలిగే సృజనాత్మక ప్రాజెక్టులను నమోదు చేయాలి. అందుకు సైన్స్ ఉపాధ్యాయులు సహకరించాలి. – భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారిఫ ఇన్స్పైర్ మనక్ అవార్డులకు మొదలైన దరఖాస్తులు ఫ చిన్నారులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు కార్యక్రమం ఫ 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అవకాశం ఫ సెప్టెంబర్ 15 వరకు గడువు గతంలో ఎంపికై నవి సంవత్సరం ప్రాజెక్టులు 2022–23 1432023–24 1392024–25 131 జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలు విద్యార్థులకు తమకు వచ్చిన ఆలోచనలతో తయారు చేసిన ప్రాజెక్టులు ప్రదర్శించేందుకు ఎంపికై తే వారి అకౌంట్లలో రూ.10 వేలు జమచేస్తారు. అయితే వాటిని జిల్లా స్థాయి పోటీల్లో ప్రదర్శిస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికై తే రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించిన ఆరు ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి జాతీయ స్థాయి పంపుతారు. జాతీయ స్థాయి ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రదర్శించడంతోపాటు రాష్ట్రపతి భవన్లో కూడా ప్రత్యేక ప్రదర్శిస్తారు. అనంతరం సకురా ప్రోగ్రామ్ ద్వారా జపాన్ దేశంలోని పరిశోధన కేంద్రాలను సందర్శించేందుకు ఎంపికై న విద్యార్థులను పంపుతారు. -
చినుకు లేక.. మొలకెత్తక..
ఈయన పెద్దవూర మండలం గర్నెకుంటకు చెందిన చిట్టిమళ్ల సత్యం. ఈయన ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశారు. అప్పటినుంచి సరైన వర్షం పడకపోవడంతో చాలా విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తినవి కూడా ఎండలకు ఎండిపోతున్నాయి. ఎకరాకు మూడు ప్యాకెట్ల చొప్పున ఐదెకరాలకు 15 ప్యాకెట్ల పత్తి గింజలు వేశాడు. వాటితోపాటు అరక, కూలీలు మొత్తంగా రూ.22 వేలు వెచ్చించాడు. వర్షాల్లేక ఇప్పుడు నష్టపోయే పరిస్థితి వచ్చిందని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నాకు ఎకరంన్నర పొలం ఉంది. గ్రామంలోని మరో రైతుకు చెందిన 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఈనెల మొదట్లో వర్షాలు పడడంతో పత్తి విత్తనాలు నాటాను. ముందు మురిపించిన వాన తరువాత మొఖం చాటేసింది. దీంతో ఆ విత్తనాలు మొలకెత్తలేదు. ఇందుకోసం ఇప్పటికే రూ.2.30 లక్షలు అప్పు చేశాను. ఇప్పుడు మళ్లీ విత్తనాల పెట్టాలంటే మరో రూ.50 వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. – జినుక సైదులు. ఆకారం, శాలిగౌరారం పత్తి విత్తనాలు సగమే మొలకెత్తాయి ఆరెకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాం. అందులో సగమే మొలకెత్తాయి. మిగతా సగం భూమిలో తేమలేక మొలవలేదు. 15 రోజుల నుంచి వర్షం లేదు. దున్నడం నుంచి విత్తనాలు విత్తే వరకు ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మొలవని చోట్ల మళ్లీ విత్తనాలు పెట్టాల్సి వస్తుంది. ఈ ఏడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – ఐతగోని జంగమ్మ, రాంరెడ్డిపల్లి, మర్రిగూడ ఫ పత్తి విత్తనాలు వేసిన రైతుల్లో ఆందోళన ఫ చాలాచోట్ల మొలకె త్తని విత్తనాలు ఫ మొలకెత్తిన చోట వాడుబడుతున్నయ్ ఫ కాపాడుకునేందుకు కర్షకుల పాట్లు -
సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతి చెందారు. మరో పోలీసులకు గాయాలు కావడంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దుర్గాపురం వద్దకు రాగానే ఒక్కసారిగా లారీ అదుపు తప్పి పోలీసులు ప్రయాణిస్తున్ను కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారులోకి ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కారులో ముందు కూర్చోవడంతో ఎస్ అశోక్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సిన్ చనిపోయారు. ఇదిలా ఉండగా.. అంతకుముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన కారు ఆపినట్టు క్షతగాత్రులు తెలిపారు. అనంతరం, బయలుదేరిన పదిహేను నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
బాల్య వివాహాలతో అనర్థాలు
మిర్యాలగూడ : బాల్య వివాహాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలంలోని దుబ్బతండా బాలికల గురుకుల పాఠశాలను ఆమె సందర్శించి బాలికా సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ ఆడపిల్లలు 18 సంవత్సరాలు, అబ్బాయిలు 21 సంవత్సరాలు నిండాకే వివాహాలు చేసుకోవాలన్నారు. సమాజంలో ఎదురయ్యే స్యలను ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. బాలికలు రుతుక్రమ సమస్యలపై అవగాహన కలిగి ఉండి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కృష్ణవేణి, సీడీపీఓ మమత, ఆయుర్వేధిక్ డాక్టర్ హేమాంజలి, జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత, ఎంఈఓ బాలు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ సరస్వతి, వెంకన్న, వైద్యులు రవికుమార్, మోయిద్, ప్రిన్సిపాల్ ఉమాదేవి, గణేష్, అశ్రిత, కవిత, చినరాయుడు, కవిత, సక్కు, భవాని తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం త్రిపురారం : వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం త్రిపురారం ఎన్నెస్పీ క్యాంప్ ఆవరణలోని బాలికల వసతి గృహన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ భవనాన్ని పరిశీలించి కొన్ని గదుల పైకప్పు పెచ్చులు ఊడి ఉండడాన్ని గమనించి.. సురక్షితమైన భవనానికి మార్చాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, ఎస్ఐ నరేష్ ఉన్నారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
యాంటీ డ్రగ్ సోల్జర్‌గా పనిచేయాలి
నల్లగొండ : మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్‌గా పనిచేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. డ్రగ్స్‌పై పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని కోరారు. యువత డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదు అయితే భవిష్యత్‌లో ఉద్యోగాలకు, ఏ ఇతర దేశాలకు కూడా వెళ్లే అవకాశం దొరకక జీవితం అంధకారం అవుతుందన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నెంబర్ (8712670266)కు తెలియజేయాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ సైదులు, వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఎన్ఎస్పీ భూముల సర్వే పరిశీలన
హాలియా : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ పరిధిలో జరుగుతున్న ఎన్ఎస్పీ భూముల సర్వేను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అదనపు కలెక్టర్ నారాయణ అమిత్‌తో కలిసి ఆమె ఇబ్రహీంపేట గ్రామ పరిధిలోని ఎడమ కాల్వ యూటీ వద్ద, గ్రామ చివరలో ఎంత ఎన్ఎస్పీ భూమి ఉంది? ఏఏ సర్వే నంబర్లలో ఎన్ఎస్పీ భూములు ఉన్నాయి? అనే వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, మండల ఇన్చార్జి తహసీల్దార్ రఘు, కమిషనర్ రామదుర్గారెడ్డి, సర్వేయర్ పోకల విజయ్‌కుమార్, ఆర్ఐ నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
పంచాయతీలా.. పరిషత్లా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తప్పనిసరైంది. ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి.. తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ.. పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పాలక వర్గాలు పూర్తయి ఏడాదిన్నర అవుతుండగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయి సంవత్సరం దాటింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తారనేది చర్చనీయంశంగా మారింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులోనే ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కోర్టును ఆశ్రయించిన మాజీ సర్పంచ్‌లు పంచాయతీల్లో పాలక వర్గాల గడువు పూర్తయి ఏడాదిన్నర కావస్తోంది. దీంతో పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని, ఎన్నికలు నిర్వహించే వరకు పాత సర్పంచ్‌లను కొనసాగించాలంటూ నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మాజీ సర్పంచ్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం గతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారిగా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దాంతో పాటు పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించనున్నందున ఇప్పటికే బ్యాలెట్ పేపర్లను ముద్రించి నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని షెడ్లలో భద్రపరిచారు. పోలింగ్ కోసం ఏపీ నుంచి తెప్పించిన బ్యాలెట్ బాక్సులకు మరమ్మతు చేయించి సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన వెంటనే సిబ్బందికి శిక్షణ ఇస్తే సరిపోనుంది. ముందుగా ఏ ఎన్నికలు? ఫ మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం ఫ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తర్జనభర్జన ఫ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జిల్లా యంత్రాంగం కసరత్తు ఫ ఇంకా తేలని బీసీ రిజర్వేషన్ల అంశం ఫ ఎన్నికలపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కోర్టులోనే బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోర్టు పరిధిలో ఈ సమస్య ఉన్నందున అది తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనేది వారి వాదన. అయితే విషయం కోర్టులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎన్నికలు పోతుందో అనేది వేచి చూడాల్సిందే. బీసీ రిజర్వేషన్ విషయంలో తీర్పు రాకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసైనా ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. మొదటిసారిగా నాలుగెకరాలకు పైబడి భూమి కలిగిన రైతులకు కూడా రైతుభరోసాను జమ చేసింది. దీన్ని అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులకు శిక్షణ కూడా పూర్తి పార్లమెంట్ ఎన్నికల తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సంకేతాలు రావడంతో జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా నిర్వహించనున్నందున బ్యాలెట్ పేపర్లు తెచ్చి ఇప్పటికే ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు. పీఓ, ఏపీఓలకు శిక్షణ కూడా ఇచ్చారు. షెడ్యూల్ వస్తే మాత్రం ఓపీఓలకు కూడా డివిజన్ల వారీగా శిక్షణనివ్వడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు. -
రాష్ట్రానికి.. కేంద్రం రూ.11 లక్షల కోట్లు ఇచ్చింది
నల్లగొండ టూటౌన్ : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం 11 ఏళ్లల్లో రూ.11 లక్షల కోట్లు ఇచ్చిందని మహబూబ్‌నగర్ ఎంపీ, మాజీమంత్రి డి.కె.అరుణ అన్నారు. బుధవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, యూనివర్సిటీలు, రోడ్లు తదితర వాటి కోసం మోదీ ప్రభుత్వం అధిక నిధులు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నరేంద్రమోదీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. స్థానికసంస్థల ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడంలేదని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ తన పదవిని నిలుపుకోవడానికి ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఆ కాలంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి, పత్రికలను అణచి వేశారని, అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిజిటల్ మీడియాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 60 ఏళ్లు కుటుంబ పాలన కొనసాగిన దేశం అభివృద్ధి చెందలేదన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, దర్శనం వేణు, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, రావెళ్ల కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.ఫ మహబూబ్‌నగర్ ఎంపీ డికె.అరుణ -
యాదగిరీశుడికి మరింత భద్రత
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మరింత భద్రత కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. - 8లోనార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామివారికి లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ఆవరణలో నిద్ర చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. పూజల్లో ప్రధాన అర్చకులు రామలింగేశ్వరశర్మ, సతీష్‌శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్‌శర్మ, ఈఓ నవీన్‌కుమార్ పాల్గొన్నారు. -
పెదా్దసుపత్రిలో వైద్య పరీక్షల్లేవ్!
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో రక్త పరీక్షలు నిలిచిపోయాయి. ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో సుమారు 45 రకాల రక్త పరీక్షలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం కొన్నిరకాల పరీక్షలను మాత్రమే చేస్తున్నారు. పరీక్షల కోసం రక్తంలో కలిపే రీఏజెంట్స్(కెమికల్స్) సరఫరా నిలిచిపోయిన కారణంగా పరీక్షలు చేయడం లేదు. ప్రస్తుతానికి కేవలం సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్షర్)తో పాటు మలేరియా తదితర పరీక్షక్షలు మాత్రమే చేస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌లో వేల రూపాయలు వెచ్చించి టెస్టులు చేయించుకుంటున్నారు. ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకోవాల్సిందే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే వారి రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు ప్రధానం. కానీ, తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో పరీక్షలు నిలిచిపోవడంవతో రోగులు బయటి డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలను చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుత సీజన్లో డెంగీ పరీక్షలను నిర్ధారించడానికి అవసరమైన ఎలిసా పరీక్షలను చేయాల్సిన మిషన్ గత కొన్ని రోజులుగా మరమ్మతుకు గురైంది. దీంతో డెంగీ నిర్ధారణకు చేయాల్సిన ఎలిసా టెస్టులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. పీహెచ్‌సీల నుంచి నిలిచిన రక్త నమూనాలు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి రోజూ రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి టెస్ట్‌ల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి వాహనాల ద్వారా తీసుకొస్తారు. అక్కడ రక్త నమూనాలు ఇచ్చిన రోగులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరీక్షల ఫలితాలను సెల్‌ఫోన్‌కు పంపిస్తారు. రక్త పరీక్షల ఆధారంగా మెడికల్ ఆఫీసర్లు రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఇలా రోజూ వందల సంఖ్యలో రక్త నమూనాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి వస్తాయి. ప్రస్తుతం టెస్టులు నిలిచిపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమూనాలు పంపించడం లేదు. రక్త పరీక్షలకు అంతరాయం ఏర్పడి రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ జీజీహెచ్‌లోని తెలంగాణ హబ్‌లో నిలిచిన బ్లెడ్ టెస్ట్‌లు ఫ రీఏజెంట్స్ సరఫరా లేకపోవడమే కారణం ఫ మరమ్మతుకు గురైన ‘ఎలీసా’ మిషన్ ఫ కొన్ని పరీక్షలు మాత్రమే చేస్తున్న సిబ్బందిత్వరలో అన్ని రకాల టెస్టులు చేస్తాం రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన రీఎజెంట్స్ అయిపోయినందున కొన్ని పరీక్షలను చేయలేకపోతున్నాం. ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. అవి సరఫరా కాగానే అన్ని రకాల టెస్టులు చేస్తాం. ఎలీసా పరీక్ష చేసే మిషన్ మరమ్మతుకు గురైంది. త్వరలో దాన్ని కూడా బాగు చేయించి టెస్టులు చేస్తాం. – డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ఇన్చార్జి -
నల్లగొండకు నేడు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం నల్లగొండకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయానికి ఉదయం 10 గంట లకు చేరుకుంటారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళతారు.దరఖాస్తుకు నేడు చివరి గడువునల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్టు పద్ధతిన పీడియాట్రీషియన్(1), మెడికల్ ఆఫీసర్(4) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 26 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీడియాట్రిషన్ పోస్టుకు ఎండీ పీడియాట్రిషన్, మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అర్హత కలిగి ఉండాలలని.. 27న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించాలిత్రిపురారం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్ సూచించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. మండల వ్యాప్తంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లపై ఆరా తీశారు. ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయకుమారి, ఇన్చార్జి ఎంపీఓ కోడిరెక్క రాజేంద్రకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలిదేవరకొండ : యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని దేవరకొండ ఏఎస్పీ మౌనిక కోరారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకొండ మండల పరిధిలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయన్నారు. విద్యార్ధులు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం వివిధ చట్టాలపై విద్యార్థులకు ఆమె అవగాహన కల్పించారు. సమావేశంలో సీఐ నర్సింహులు, ఎస్ఐ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.30వ తేదీ వరకు ఆసరా పింఛన్ల పంపిణీనల్లగొండ : ఆసరా పింఛన్లను ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసరా పింఛన్లను ఆయా పోస్టాపీస్‌లలో పొందాలని సూచించారు. పింఛనుదారులు మధ్య దళారీలను నమ్మవద్దని పేర్కొన్నారు.ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా శ్రీనివాస్నల్లగొండ టూటౌన్: ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం అధికారిగా అధ్యాపకుడు డి. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి బుధవారం శ్రీనివాస్‌కు నియామక పత్రం అందజేశారు. -
రేషన్ షాపుల్లో పేరుకుపోతున్న బియ్యం
నల్లగొండ: గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం పోర్టబులిటీ విధానం అమలవుతుండటంతో పట్టణ ప్రాంతాలకు వలస పోయిన గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడే రేషన్ బియ్యం తీసుకుంటుండడంతో గ్రామాల్లోని రేషన్ షాపుల్లో బియ్యం మిగులుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని జూన్‌లోనే ఇస్తోంది. ఇప్పటికే రేషన్ షాపుల్లో దాదాపు 15 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. వాటిని వెనక్కి తీసుకుపోయే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో డీలర్లు దుకాణాల్లో స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. పాత బియ్యంతో పాటు మిగిలిన సన్న బియ్యం కూడా పురుగుపట్టే ప్రమాదం ఉందని వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మిగులుతున్న బియ్యం జిల్లాలో 994 రేషన్ షాపులున్నాయి. వాటి ద్వారా జిల్లాలో 4,84,216 కుటుంబాలకు ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. 3 నెలలకు సంబంధించి సన్న బియ్యం కోటాను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ షాపులకు అలాట్ చేశారు. పంపిణీ ప్రక్రియ కూడా దాదాపు 80 శాతం పైచిలుకు పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఒక్కో షాపులో దాదాపుగా 10 నుంచి 20 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వచ్చే 2 నెలలు రేషన్ షాపులు బంద్ ఉంటుండడంతో బియ్యం పురుగు పట్టే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో షాపులకు మొత్తం కోటా కాకుండా తగ్గించి పంపాలని డీలర్లు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో షాపులకు కోటా తగ్గించి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ డీఎస్ఓ వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. ఫ గ్రామీణ రేషన్‌షాపుల్లో అత్యధిక నిల్వలు ఫ వలస వెళ్లినవారు పట్టణాల్లో తీసుకోవడమే కారణం ఫ మూడు నెలల సన్నబియ్యం కోటా కూడా మిగిలే అవకాశం ఫ పురుగు పడుతుందని డీలర్ల ఆవేదన ఫ అవసరాన్ని బట్టి పంపించాలని కోరుతున్న డీలర్లు -
మమ్మల్ని చులకనగా చూస్తున్నారు!
నల్లగొండ టూటౌన్ : పట్టణాల్లో సమభావన సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించేందుకు వార్డుల్లో నియమించిన మెప్మా రిసోర్స్ పర్సన్లపై మెప్మా కార్యాలయంలో పని చేస్తున్న సీఓ (కమ్యూనిటీ ఆర్గనైజర్లు)లు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆర్పీలు మనోవేదన చెందుతున్నారు. నెలకు రూ.6వేల గౌరవ వేతనంతో పనిచేసే వారిపై చులకన భావంతో మాట్లాడుతూ హేళన చేయడం పరిపాటిగా మారిందని పలువురు ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలగిరి మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగం ఉద్యోగులు కార్యాలయం గడప దాటకుండా అన్ని పనులూ ఆర్పీలతోనే చేయిస్తూ వారిని ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల కర్ర పెత్తనం మెప్మా ఉద్యోగులు పట్టణాల్లో మహిళలను సమావేశ పర్చడం, వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడం, ఇప్పించిన రుణాలను తిరిగి చెల్లించేలా చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ అన్ని పనులు వార్డుల్లో ఉన్న మహిళా ఆర్పీలపై నెట్టివేసి మెప్మాలోని ఇద్దరు ఉద్యోగులు వారిపైనే కర్ర పెత్తనం చెలాయిస్తూ సూటి పోటి మాటలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలపై మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి ఐదు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా చిన్న పిల్లలను నిలబెట్టినట్లు నిలబెట్టి కారణాలు చెప్పండంటూ వికృత చేష్టలకు దిగుతున్నట్లు సమాచారం. మెప్మా కార్యాలయంలోని ఓ కీలక ఉద్యోగి మహిళా ఆర్పీలను ‘బొంద పెట్ట, దినం చెయ్య.. పిండాలు పెట్ట’ అని వ్యాఖ్యలు చేస్తూ వారిని మానసికంగా వేధిస్తున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెప్మా కార్యాలయంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపాలిటీలోని ఓ ఇద్దరు, ముగ్గురు మెప్మా ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.పద్ధతి ప్రకారం వ్యవహరించాలి ఆర్పీలపై అమార్యాదగా మాట్లాడినా, పద్ధతి ప్రకారం వ్యవహరించకున్నా సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలి. తదుపరి విచారణ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – సయ్యద్ ముసాద్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఫ అన్ని పనులూ మాతోనే చేయిస్తున్నారని మెప్మా మహిళా ఆర్పీల మనోవేదన ఫ ఉద్యోగులు.. మాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణ ఆర్పీపై పేపర్లు విసిరేసిన మెప్మా ఉద్యోగి.. ప్రతి పది మంది మహిళలు గ్రూపుగా ఏర్పడి బ్యాంకులో ఖాతా తెరుస్తారు. వారిని గ్రూప్‌గా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మెప్మా ఉద్యోగులదే. సీఓలే వార్డులకు వెళ్లి వారికి రుణం ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. కానీ బ్యాంకు రుణం కోసం టూటౌన్ పరిధిలోని ఓ ఆర్పీ మెప్మా కార్యాలయానికి 8 మంది సభ్యులను తీసుకువచ్చి పేపర్లపై సంతకం చేయాలని కోరగా ఇద్దరు సభ్యులు తక్కువగా వచ్చారని, ఆలస్యంగా వచ్చారనే కారణంతో ఆర్పీపై సదరు సీఓ పేపర్లు విసిరికొట్టినట్లు చర్చ జరుగుతోంది. దాంతో ఆమె విలపిస్తూ వెళ్లిపోయినట్లు తెలిసింది. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీలో కూడా రికార్డు అయినట్లు ఆర్పీలు చెబుతున్నారు. ఇటీవల టూటౌన్ పరిధిలోనే ఓ ఆర్పీకి తెలియకుండా సీఓ ఒక సంఘానికి బ్యాంకు రుణం ఇప్పించి చేతివాటం ప్రదర్శించినట్లు తెలిసింది. తన ప్రమేయం లేకుండా బ్యాంకు రుణం ఇప్పించడంతో సదరు ఆర్పీ మరో 20 మంది ఆర్పీలతో కలిసి విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా సీఓను మందలించినట్లు తెలిసింది. దాంతో సదరు సీఓ ఆ 20 మంది ఆర్పీలను టార్గెట్ చేసి బ్యాంకు రుణాల మంజూరు విషయంలో కొర్రీలు పెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సంక్షేమం.. గాడిన పడేనా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఏళ్ల తరబడి ఇన్చార్జి అధికారులతో నెట్టకొచ్చిన సంక్షేమ వసతిగృహాలకు ప్రభుత్వం కొత్తగా హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 13 హాస్టళ్లు మినహా అన్ని వసతి గృహాలకు అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పూర్తిస్థాయిలో లేక ఉన్నవారిలో ఒకొక్కరు రెండు మూడు హాస్టళ్లకు ఇన్చార్జిగా వ్యవహరించాల్సి వచ్చింది. వారు రోజూ హాస్టళ్లకు వెళ్లలేకపోవడంతో వంట మనుషులపైనే ఆధారపడాల్సి వచ్చేంది. దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడింది. వారు ఏమి చదువుతున్నారో కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయేది. హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రావడంతో వసతి గృహాలు గాడిలో పడతాయని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత నియామకాలు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రిటైర్డ్ అవ్వడమే తప్ప 20 ఏళ్లుగా కొత్తగా రిక్రూట్మెంట్ కాలేదు. దీంతో ఇప్పటి వరకు హాస్టళ్లు ఇన్చార్జిలతో కొనసాగాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 హాస్టళ్లు ఉండగా.. ఇప్పటివరకు 29 మంది మాత్రమే వార్డెన్లు ఉండేవారు. వారిలో ఒకొక్కరికి 2 నుంచి 3 హాస్టళ్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. బీసీ, ఎస్టీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉండేది. ప్రతి వార్డెన్ రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం సమయాల్లో హాస్టల్‌కు వెళ్లి అన్నీ చూసుకోవాలి. మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో ఉండడంతో.. రెండు పూటల మాత్రం హాస్టల్‌కు వెళ్లాల్సిందే. కానీ ఒక్కో అధికారికి మూడు హాస్టళ్లను అప్పజెప్పడంతో ఆయన విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్మెంట్తో పోస్టులను భర్తీ చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు చాలా వరకు కొత్తగా అధికారులు వచ్చారు. ఎస్సీలో 31 మంది కొత్తగా అలాట్.. జిల్లాలో 61 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉండగా గతంలో 29 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉండేవారు. ప్రస్తుతం కొత్త రిక్రూట్మెంట్ ద్వారా 5వ జోన్‌కు ప్రభుత్వం 54 మంది అలాట్ చేసింది. వారిలో నల్లగొండ జిల్లాలో 31 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వారు జోన్ 5 పరిధిలోని యాదాద్రి, సూర్యాపేట, జనగాం జిల్లాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం దామరచర్ల మినహా అన్ని హాస్టళ్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. బీసీలో 13 మంది నియామకం జిల్లాలో 46 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉండగా మొన్నటి వరకు 27 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. కొత్తగా 13 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులు రావడంతో 40 హాస్టళ్లకు అధికారులు ఉన్నారు. ఆరు హాస్టళ్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో ఐదుగురి చేరిక జిల్లాలో 42 గిరిజన సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 14 ఆశ్రమ పాఠశాలలు. అయితే వీటి పరిధిలో ఆశ్రమ పాఠశాలల హెడ్మాస్టర్లే వార్డెన్లుగా వ్యవహరిస్తారు. మరో 17 హాస్టళ్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు. 11 హాస్టళ్లకు అధికారులు లేరు. కొత్త రిక్రూట్మెంట్తో జిల్లాకు ఏడుగురిని అలాట్ చేయగా అందులో ఐదుగురు మాత్రమే విధుల్లో చేరారు. ఇద్దరు ఇప్పటికే ఇతర ఉద్యోగాల్లో ఉన్నందున వారు విధుల్లో చేరలేదు. దీంతో ఇంకా ఆరు హాస్టళ్లకు ప్రస్తుతం అధికారులు లేరు. ఏళ్ల తరబడి ఇన్‌చార్జిలతోనే సగం వసతిగృహాలు ఫ ప్రస్తుతం 13 మినహా అన్ని హాస్టళ్లకు సంక్షేమ అధికారుల నియమాకం ఫ పర్యవేక్షణ పెరుగుతుందని తల్లిదండ్రుల ఆశాభావం వంట మనుషులతోనే నిర్వహణ.. ఇన్చార్జి బాధ్యతలు ఉన్న చోట వెల్ఫేర్ అధికారి వంటకు సరిపడా బియ్యాన్ని, కిరాణా సామగ్రిని వంట మనుషులకు అప్పగించి వచ్చేవారు. దాంతో వారు వండి విద్యార్థులకు పెట్టేవారు. అధికారి రోజూ ఒక చోటకు వెళ్లాల్సి వచ్చేది. దీంతోపాటు కార్యాలయాల్లో సమావేశాలు, బిల్లులు పెట్టుకునేందుకు కూడా తిరగాల్సిందే. దీంతో వంట మనుషులే హాస్టల్ నిర్వహణ చూసేవారు. -
క్రీడా పాఠశాలల్లో ప్రవేశంతో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : క్రీడా పాఠశాలల్లో ప్రవేశం పొందితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి మంగళవారం నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించడం ద్వారా ఎంతో పేరు వస్తుందన్నారు. ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఓ అక్బర్ అలీ, పీడీలు కుంభం నర్సిరెడ్డి, విమల, కవిత, నజీర్ పాల్గొన్నారు. -
పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
రామగిరి(నల్లగొండ) : పాలిసెట్ – 2025 కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైందని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.నరసింహ అన్నారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని.. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్ 26 నుంచి జూలై 1వ తేదీ వరకు కాలేజీ ఎంపికకు ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. మహిళలు పొదుపుపై దృష్టి పెట్టాలిమునుగోడు : మహిళలు సమాఖ్య సంఘాల్లో చేరి తమ ఆదాయంలో కొంత నగదుని పొదుచేసుకోవాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మునుగోడులోని మహిళా సమాఖ్య భవనంలో నూతనంగా ఎన్నికై నా మహిళ సమాఖ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కోశాధికారులకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్ధిక అభివృద్ధికి అనేక ప్రోత్సహాకాలు అందిస్తోందన్నారు. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ ఈ.విజయభాస్కర్, ఏపీఎం మేసేశ్వరావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు పంతంగి రాధ, కార్యదర్శి బోయపర్తి యాదమ్మ, సీసీలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలినాగార్జునాసాగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి కోరారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ సంస్థాగత జిల్లాస్థాయి సమావేశం మంగళవారం సాగర్‌లోని విజయవిహార్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలమైన నిర్మాణానికి పునాదులు వేయాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు చెల్లని నాణానికి బొమ్మాబొరుసు లాంటివని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కంకణాల నివేదితారెడ్డి, పిల్లి రామరాజుయాదవ్, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, చనమోని రాములు, ఎస్కే బాబా, వీరారెడ్డి, రామదాసు, తంగరాజు, రాజు పాల్గొన్నారు. బాలికాసాధికారిత సాధించాలి గుర్రంపోడు : కేజీబీవీ విద్యార్థినులు బాగా చదువుకుని ప్రయోజకులై స్వశక్తితో ఎదిగి బాలికా సాధికారికతను సాధించే దిశగా ముందుకు సాగాలని జీసీడీఓ కె.అరుందతి ఆకాంక్షించారు. మంగళవారం గుర్రంపోడు కేజీబీవీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థిని కనీస సామర్థ్యాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధించాలని టీచర్లకు సూచించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని.. విద్యార్థినులకు ఇబ్బంది కలగితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. కేర్ టేకర్ రోజూ స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఓ విజయశ్రీ, సిబ్బంది రాధా, సులోచన, కవిత, ఉమాదేవి, ధనలక్ష్మి, నేహదీప్తి, నీలవేణి, జ్యోతి, కేర్ టేకర్ స్వాతి, ప్రమీల పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ : 2025–26 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడేళ్ల శిక్షణ కోసం జిల్లాలోని ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ శశికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31వ తేదీలోగా telanganaepass.cgg.gov.inలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. హార్డ్ కాపీని వారి బయోడేటా కుల, ఆధాయ ధ్రువీకరణపత్రాలు, డిగ్రీ మార్కుల జాబితా, బార్ కౌన్సిల్ నమోదు పత్రాలు జత చేసి ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. సందేహాలు, పూర్తి వివరాల కోసం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఇరాన్‌పై దాడిని ఖండించాలి
మిర్యాలగూడ అర్బన్ : ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు. ఇరాన్‌పై దాడులను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మండలంలోని యాద్గార్‌పల్లిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమెరికా ఇంటిలిజెన్స్ నిఘా వర్గాలు ఇరాన్ వద్ద అణుబాంబులు లేవని స్పష్టంగా చెప్పినప్పటికీ అమెరికా తమ ఆధిపత్యం కోసం ఇరాన్‌పై యుద్ధం చేస్తోందని మండిపడ్డారు. అనంతరం ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు వస్కుల మట్టయ్య, బంటు వెంకటేశ్వర్లు, డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్‌నాయక్, వరలక్ష్మి, పరశురాములు, శ్రీనివాస్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు ఎకరాలున్నా.. రైతు భరోసా రాలే!
ఫ మహిళా రైతు ఆవేదన చందంపేట : చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన తుమ్మల మల్లమ్మకు 4 ఎకరాల భూమి ఉండగా పత్తి విత్తనాలు విత్తింది. గతంలో రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందింది. కానీ తాజాగా ఆమెకు రైతు భరోసా అందలేదు. తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని అందులో కూడా పత్తి సాగు చేస్తోంది. ఈ విషయమై ఆమె వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పకుండా.. ఆన్లైన్ నుంచి భూమి తొలగించారని చెబుతున్నారని మల్లమ్మ వాపోతోంది. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
నకిరేకల్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆమె నకిరేకల్‌లోని ఏరియా ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శోభారాణి అందుబాటులో లేకపోవడం, పలు గదులకు తాళాలు వేసి ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. క్వాజువాలిటీ, పురుషలు, మహిళ అత్యవసర వార్డులు, మందుల స్టాక్‌ను తనిఖీ చేశారు. ఇది పీహెచ్సీ కాదని ఏరియా ఆస్పత్రి అని.. డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం రూ.32 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మిస్తున్నందున, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వైద్య సేవలందించాలని సూచించారు. ఆమె వెంట నల్లగొండ ఆర్డీఓ యానాల అశోక్‌రెడ్డి ఉన్నారు. టీబీ నివారణపై దృష్టి పెట్టాలి నల్లగొండ : టీబీ (క్షయ) నివారణపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్న్ఫామె అధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శ్రద్ధ పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు టైపాయిడ్, డెంగీ తదితర వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని చెప్పారు. రైతులు ఎరువులకు ఇబ్బంది పడకుండా చూడాలని వ్యవసాయ అధికారిని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, జిల్లా అటవీశాఖాధికారి రాజశేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఏఓ శ్రవణ్‌కుమార్, డీపీఓ వెంకయ్య, హార్టికల్చర్ డీడీ అనంతరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
చదువుకోవాలని ఉంది.. కానీ పేదరికం అడ్డొచ్చింది!
యాదగిరిగుట్ట: ఆ బాలికకు చదువుకోవాలని ఉంది.. కానీ పేదరికం అడ్డొచ్చింది. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో అమ్మమ్మతో కలసి భిక్షాటన చేస్తోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో భిక్షాటన చేస్తున్న ఆ బాలికను యాదగిరిగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ పలకరించి, చదివించేందుకు ప్రయత్నం చేశారు. మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లోని టైలర్ కాలనీకి చెందిన పార్వతమ్మ, ఆమె 12 సంవత్సరాల మనుమరాలు శిరీషలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. శిరీషకు చదువుకోవాలని ఉన్నా పేదరికంతో చదువుకు దూరమైంది. పొట్టకూటికోసం కొంత కాలంగా తన అమ్మమ్మ పార్వతమ్మతో కలసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వైకుంఠద్వారం వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ క్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి సోమవారం అటుగా వెళ్తూ బాలికను గమనించి ఆమె వద్దకు వెళ్లారు. చదువుకోకుండా భిక్షాటన ఎందుకు చేస్తున్నావని శిరీషను అడిగారు. దీంతో శిరీష ఏడుస్తూ.. తనకు చదువుకోవాలని ఉన్నా డబ్బులు లేవని, పూటగడవడం కోసం అమ్మమ్మతో కలసి భిక్షాటన చేసేందుకు వచ్చానని చెప్పింది. దీంతో చలించిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి.. భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు.. శిరీషకు, ఆమె అమ్మమ్మకు కౌన్సెలింగ్ చేసి భువనగిరి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. బాలికకు సాయం చేసిన కానిస్టేబుల్ కోటిని ట్రాఫిక్ సీఐ కృష్ణ అభినందించారు. -
26 సార్లు ఫోన్‌చేసినా కలెక్టర్ స్పందించలే..!
నల్లగొండ: నకిరేకల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంపై కలెక్టర్‌తో చర్చించేందుకు 26 సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ప్రజావాణికి వచ్చానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై ఫోన్ చేసినా కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయవాని శ్రీను అర్జీలను కలెక్టర్ చూసి దాటవేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే ప్రదీప్‌రెడ్డిపై అధికారులు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారన్నారు. తప్పుడు రిపోర్టులతో కేతేపల్లి పంచాయతీ సెక్రటరీపై వేటు వేశారన్నారు. చిన్నకాపర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలోని భవనాలను నేలమట్టం చేశారని ఆరోపించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ నాయకులకే ఇస్తున్నారన్నారు. ఫ అందుకే ప్రజావాణికి వచ్చా.. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు
నల్లగొండ : యువతీ యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్య సాధనకు కృషిచేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం నల్లగొండలోని ఆదిత్య పాఠశాల విద్యార్థులతో కలిసి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతిఒక్కరూ డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల సమాజ నిర్మూలనే లక్ష్యం అనే అంశంపై ముద్రించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాజశేఖర్‌రెడ్డి, రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్ హరిబాబు, ఎస్ఐలు సైదులు, సైదాబాబు, శంకర్, విద్యార్థులు తదితరలుఉ పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ శరత్చంద్ర పవార్ పోలీసు వృత్తి నైపుణ్యాలపై డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారుల, సిబ్బంది నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. డ్యూటీ మీట్లో గెలుపొందిన వారిని రేంజ్ మీట్‌కి పంపుతామన్నారు. కేసుల దర్యాప్తులో ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాలలో పట్టు సాధించాలని సూచించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలి బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌లో ఆయన పాల్గొని 52 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఆదరించట్లేదు.. ఆదుకోండమ్మా
నల్లగొండ : కనిపెంచి పెద్ద చేశాం.. ఆస్తులు పంచిచ్చాం.. వృద్ధాప్యంలో ఉన్న మమ్ములను కన్న కొడుకులు సరిగా చూసుకోవడం లేదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి పలువురు వృద్ధులు తమ గోడు వినిపించారు. కన్నకొడుకులు ఆదరించట్లేదు.. మమ్ములను ఆదుకోండమ్మా అంటూ కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించారు. వృద్ధులతోపాటు వివిధ సమస్యలను విన్నవించేందుకు జనం కూడా భారీగా వచ్చి ఫిర్యాదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ అశోక్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డిలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫ ఆస్తులు పంచిచ్చినా కొడుకులు అన్నం పెట్టట్లేదు ఫ ప్రజావాణిలో గోడు వినిపించిన పలువురు వృద్ధులు ఫ కలెక్టర్‌కు ఫిర్యాదుల వెల్లువ -
రైతు భరోసా సంబరాలు నిర్వహించాలి
నల్లగొండ : ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు రైతు భరోసా ఇస్తున్నారని, దీనిపై పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సంబరాలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. సోమవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు రుణ మాఫీ, సన్న బియ్యం అందిస్తూ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేశామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పనికిరాని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తున్నందుకు ముఖ్యమంతి, జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి, మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలిమిర్యాలగూడ : గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరగనుందని, దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో ఎస్ఎన్డీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సీపీఎం నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు సోమవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమస్యలు తిష్టవేశాయని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్‌నాయక్, శశిధర్‌రెడ్డి, రొండి శ్రీనివాస్, చౌగాని సీతారాములు, అయూబ్, గాదె పద్మ, సత్యనారాయణ పాల్గొన్నారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేవైఎం నాయకులు విద్యా రంగ సమస్యలు, మౌలిక సదుపాయాలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో బాలికలకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయకుండా విద్యార్థుల పట్ల వివక్ష చూపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం బీజేవైఎం కార్యకర్తలు పోరాడాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ సవరణ చట్టాన్ని రద్దుచేయాలినల్లగొండ టౌన్ : కేంద్రం తీసుకొచ్చిన పెన్షనర్స్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవరణ చట్టం వల్ల పెన్షనర్స్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసా
రైతులతో మాట్లాడనున్న సీఎం ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. రైతు వేదికల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించే వీడియో కాన్పరెన్స్‌లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలోని 93 రైతు వేదికల ద్వారా రైతులు ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని 93 రైతు వేదికల పరిధిలోని రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రతి రైతు వేదికకు ఒక నోడల్ అధికారిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.