మున్సిపల్‌ అధికారులకే పన్నులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ అధికారులకే పన్నులు చెల్లించాలి

Mar 19 2026 8:44 AM | Updated on Mar 19 2026 8:44 AM

నల్లగొండ టూటౌన్‌ : వివిధ పన్నులను మున్సిపల్‌ అధికారులకు మాత్రమే చెల్లించాలని నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది సైబర్‌ నేరగాళ్లు నల్లగొండలో ప్రజలకు ఫోన్‌ చేయడం, క్యూఆర్‌ కోడ్‌ సెండ్‌ చేసి ఇంటి, వాణిజ్య పన్నులు కట్టమని అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మోసాలను ప్రజలు గమనించాలని మున్సిపల్‌ కార్యాలయంలో, మున్సిపల్‌ అధికారులకు మాత్రమే పన్నులు చెల్లించాలని సూచించారు. అప్రమతంగా లేకపోతే ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని పేర్కొన్నారు.

గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026

నల్లగొండలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌

విందులో పాల్గొన్న

కలెక్టర్‌

చంద్రశేఖర్‌

చెర్వుగట్టులో లక్షపుష్పార్చన

అర్హులంతా ఓటరుగా నమోదు కావాలి

నల్లగొండ : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై బుధవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమానికి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సవరణ కార్యక్రమాన్ని సవ్యంగా నిర్వహించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈఆర్వోలు, మండల స్థాయిలో ఏఈఆర్‌ఓ, సూపర్‌వైజర్లు, బూత్‌ స్థాయి అధికారులు ఉంటారని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు మ్యాపింగ్‌ కాని వారందరూ మ్యాపింగ్‌ అయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముంతాజ్‌ అలీ, లింగస్వామి, రఫీ, అద్దంకి రవి, నర్సిరెడ్డి, యాదగిరి, పిచ్చయ్య, బషీరుద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement