పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారించాలి

Mar 19 2026 8:45 AM | Updated on Mar 19 2026 8:45 AM

కనగల్‌ : రైతులు పట్టుపురుగుల పెంపకం చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ అన్నారు. కనగల్‌ మండలంలోని నర్సింహాపురం గ్రామంలో రైతు పుండరీకం చేపట్టిన పట్టు పురుగులు పెంపకం, మల్బరీ తోటలను బుధవారం కలెక్టర్‌ సందర్శించారు. 2017లో పట్టు పురుగుల సాగు చేపట్టి నేటి వరకు నిరంతరాయంగా కొనసాగిస్తున్నానని రైతు పుండరీకం కలెక్టర్‌కు వివరించారు. ఎకరాకు పెట్టుబడి కింద రూ.8లక్షల నుంచి రూ.10 లక్షల మేర ఖర్చు వస్తుందని వివరించారు. ప్రతి ఏటా ఎనిమిది పంటలు తీస్తున్నానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్బరీ పట్టు పురుగుల సాగుకు సబ్సిడీలు ఇచ్చాయని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. మల్బరీ పట్టుపురుగుల పెంపకానికి ఈ ప్రాంత వాతావరణం చాలా అనుకూలమన్నారు. రైతులు పట్టుపురుగుల పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందాలన్నారు. రైతులు పట్టు పురుగుల పెంపకం వైపు మళ్లేఆ అధికారులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం తేలకంటిగూడెంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్‌ పరిశీలించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఇళ్ల గృహప్రవేశాలకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇళ్లకు నీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ తక్షణమే బోరు మోటారు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉధ్వాన శాఖ డీడీ సుభాషిని, హార్టికల్చర్‌ అధికారి అనంతరెడ్డి, సర్పంచ్‌ బైరు నాగమణినాగయ్య, కార్యదర్శి క్రాంతి, ఏఈఓ అభిలాష్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

దావత్‌ ఏ ఇఫ్తార్‌ విందులో

పాల్గొన్న కలెక్టర్‌..

రామగిరి (నల్లగొండ) : రంజాన్‌ మాసం సందర్భంగా నల్లగొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం ముస్లింలకు ఏర్పాటు చేసిన దావత్‌ ఏ ఇఫ్తార్‌ విందులో కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విందును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పేద మైనార్టీలకు రంజాన్‌ పండుగ రోజు తోఫా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వై. అశోక్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ హఫీజ్‌ఖాన్‌, డీఎస్పీ శివరాంరెడ్డి, డిప్యూటీ మేయర్‌ అమేర్‌ అలీ, తహసీల్దార్‌ పరశురాములు, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు ఎండీ బషీరుద్దీన్‌, ఎంఏ ఖాన్‌ పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement