ప్రజావాణిలో వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో వినతుల వెల్లువ

Mar 24 2026 6:54 AM | Updated on Mar 24 2026 6:54 AM

నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో బాధితలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు సమర్పించారు. సోమవారం గ్రీవెన్స్‌ డే సందర్భంగా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కార నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 83 ఫిర్యాదులు రాగా.. రెవెన్యూ శాఖకు సంబంధించినవి 40, ఇతర శాఖలకు 43 వచ్చాయని తెలిపారు.

లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి

ప్రజావాణి అనంతరం కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 2న నిర్వహించనున్న గ్రామసభలో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలు, ఆరు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి సీపీఓకు సమర్పించాన్నారు. మండల ప్రత్యేక అధికారులు మున్సిపాలిటీలు, పంచాయతీలను సందర్శించి ‘ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు చురుకుగా సాగేలా చూడాలన్నారు. జనగణనకు ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లను నిర్ణయించడంతోపాటు, సూపర్‌వైజర్ల తుది జాబితాను రూపొందించాలని ఆదేశించారు. జంతు సంరక్షణలో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబీసీ స్టెరిలైజేషన్‌ కేంద్రం పనులను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement