కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

Mar 24 2026 6:54 AM | Updated on Mar 24 2026 6:54 AM

నల్లగొండ టౌన్‌ : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లగొండలోని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అంగన్‌వాడీల వేతనాల పెంపుపై ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ.సలీం, దండెంపల్లి సత్తయ్య, లకపాక రాజు, సత్యనారాయణ, నాగమణి, బొందు పార్వతి, అవుట రవీందర్‌, విజయలక్ష్మి, అంబటి మన్నెమ్మ, ఫాతిమా, ఇంద్రగంటి సైదమ్మ, పి.సరిత, మనిరూప, పరిపూర్ణమ్మ, యాదమ్మ, డి.కళ్యాణి ,ఎల్లమ్మ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement