నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 35 మంది భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీకి విన్నవించారు. వారి ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ వాటిని పరిశీలన నిమిత్తం సంబంధిత పోలీస్ అధికారులకు పంపి.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.


