నల్లగొండ : ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాల లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2025 త్రైమాసిక లక్ష్యాల సాధనపై బ్యాంకుల నియంత్రణ అధికారులు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ రుణాలు, చిన్న మధ్యతరగతి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రుణాలు, టర్మ్ లోన్లు, డీఆర్‌డీఏ, మెప్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అందించే రుణాల గ్రౌండింగ్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు విద్యా రుణాలపై దృష్టి సారించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేసే బ్యాంకు లింకేజీ, మెప్మా,సెర్ప్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే పథకాలపై కూడా బ్యాంకర్లు ఈ నెల 30వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా బ్యాంకుల సహకారంతో జారీ చేసే కిసాన్ క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం నాబార్డ్ ఆధ్వర్యంలో 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.16,861 కోట్లతో రూపొందించిన శ్రీసామర్థ్య ఆధారిత రుణ ప్రణాళిక్ఙ (పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026– 27) బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎల్‌డీఓ గోమతి, నాబార్డ్ డీడీఎం వినయ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ శంకర్‌రావు పాల్గొన్నారు.


