నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మట్లాడుతూ పెన్షనర్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. అనంతరంకలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి.దామోదర్‌రెడ్డి, నాయకులు యుగేందర్‌రెడ్డి, వెంకటరెడ్డి, మోహన్‌రావు, రంగయ్య, శ్రీశైలం, యాదగిరి, ఆంజనేయులు ఉన్నారు.


