డప్పు చాటింపు చేయిస్తాం
రెడ్ నోటీసులు అందుకున్న తర్వాత కూడా బకాయిలు చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్, నల్లా కనెక్షన్లు కట్ చేయడంతో పాటు, ఆయా నిర్మాణాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆస్తి పన్నుల వసూళ్ల నిమిత్తం విధుల్లో ఉన్న మున్సిపల్ సిబ్బందిపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై నాన్–బెయిల
బుల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే విధులకు ఆటంకం కలిగించిన పట్టణానికి చెందిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మిర్యాలగూడ టౌన్ : ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పన్ను చెల్లింపునకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండటంతో వసూళ్లను ముమ్మరం చేశారు. పన్నులు కట్టని వారి ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీర్ఘకాలికంగా పన్నులు ఎగవేస్తున్న దాదాపు 500 మందికి ఇప్పటికే అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారి ఇళ్ల వద్దకు నేరుగా ఈ జప్తు వాహనాన్ని పంపి చర్యలు తీసుకోనున్నారు.
34 బ్లాక్‌లుగా విభజన
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఖాళీ స్థలాలకు సంబంధించి మొత్తం 26,518 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.20 కోట్ల 53 లక్షల మేర పన్నులు వసూలు కావాల్సి ఉండగా.. ఈ నెల 22వ తేదీ నాటికి రూ.7 కోట్ల 30 లక్షల 63 వేలు మాత్రమే ఖజానాకు చేరింది. ఇంకా రూ.13 కోట్ల 22 లక్షల 67 వేల మేర బకాయిలు పేరుకుపోయాయి. మార్చి 31 నాటికి వంద శాతం ఆస్తి పన్ను వసూలైతే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.15 కోట్ల వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల వసూళ్ల కోసం 48 వార్డులను 34 బ్లాక్‌లుగా విభజించారు. మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్‌ఓ), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ల(ఆర్‌ఐ) పర్యవేక్షణలో బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు నిరంతరం శ్రమిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల
నుంచే రూ. 2 కోట్లు..
మున్సిపాలిటీ పరిధిలో ఎన్‌ఎస్‌పీ, రైల్వే తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యాలయాలు సుమారు 520 వరకు ఉన్నాయి. వీటి నుంచే మున్సిపాలిటీకి రూ.2 కోట్లకు పైగా పన్నులు రావాల్సి ఉంది. మరోవైపు, బకాయిలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ కల్పిస్తుందనే ఆశతో కొందరు పన్నుల చెల్లింపును దాటవేస్తున్నారు. దీంతో వార్డు అధికారులు ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నారు.
ఫ మొండి బకాయిదారుల ఇళ్ల ముందుకు ‘జప్తు వాహనం’
ఫ మిర్యాలగూడలో 500 మందికి రెడ్ నోటీసులు
ఫ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తే కేసులే
మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్లకు ఇప్పటికే జప్తు వాహనం ఏర్పాటు చేశాం. ఆస్తి పన్నులు చెల్లించాలంటూ వార్డుల్లో డప్పు చాటింపు చేయిస్తున్నాం. పన్నుల వసూళ్లకు 9 మందితో కూడిన టీమ్ వేయగా.. ఒక ఆర్‌ఓ, ముగ్గురు ఆర్‌ఐలు పర్యవేక్షిస్తున్నారు. వంద శాతం ఆస్తి పన్నులు వసూలైతేనే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉంది. బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేయక తప్పదు.
– శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్


