సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి పదవి ఉన్నా.. లేకున్నా.. ఒక్కటే.. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు. అధి ష్టానం హామీ ఇచ్చింది. ఇస్తుందో లేదో తెలియదు. వారికి ఉండే సమీకరణాలు ఏమిటో?’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదవి లేకున్నా తనకు ప్రజల్లో తగిన గౌరవం ఉందన్నారు. మంగళవారం శాసనసభ లాబీల్లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. మంత్రి పదవి ఇవ్వడం వల్ల తనకు వచ్చే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, అది పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందన్నారు.
తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు తాము ఇద్దరం సోదరులమని తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్య మకారుల సేవలు అవసరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేద ని, తాను సోమవారం సీఎంతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయని, ఆయన ఎదురుపడితే పలకరించుకున్నామే తప్ప ఎలాంటి భేటీ జరగలేదన్నారు. పదేళ్లపాటు తానే సీఎం అని రేవంత్‌రెడ్డి అంటేనే తాను అభ్యంతరం చెప్పానని, అలా అనడం శాసనసభ్యులను అవమానించడమే అవుతుందని మాత్రమే తాను గతంలో వ్యాఖ్యానించానని చెప్పారు.
బీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే వారి పతనం ప్రారంభమైందని తాను కేటీఆర్‌తో అన్నట్లు చెప్పారు. కాగా భోజన సమయంలో రెండుగంటలపాటు కేటీఆర్‌తో భేటీలో సాధారణ విషయాలే మాట్లాడుకున్నామని, ఎలాంటి రాజకీయ ప్రాధా న్యత లేదని, ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూ నాయక్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నా రని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.


