సాక్షి ప్రతినిది, నల్లగొండ : పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు ముందస్తుగా జాగ్రత పడుతున్నారు. యుద్ధం కారణంగా భవిష్యత్‌లో మన దేశంలో కూడా ఇబ్బందులు తప్పవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించడంతో ఇక పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బందులు తప్పవేమోనన్న ఆలోచనల్లో ప్రజలు పడ్డారు. ఇందులో భాగంగా ముందు జాగ్రత్తగా వాహనదారులంతా పెట్రోలు, డీజిల్ కోసం బంకుల వద్ద బారులుదీరి ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారు. దీంతో వచ్చిన డీజిల్, పెట్రోల్ త్వరగా అయిపోతుండటంతో బంకుల యజమానులు నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు.
పెట్రోలు, డీజిల్‌కు ముందస్తు జాగ్రత్తలు
యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందన్న విషయం ఆందోళనకు కారణమవుతోంది. ప్రస్తుతం ఇంధన కొరత లేకున్నా యుద్ధం కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు ఏర్పడవుతాయని ప్రజలు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి నుంచి జిల్లాలో బైక్‌లు, ఆటోలు, కార్లు, ఇతరత్రా వాహనాలు పెట్రోలు, డీజిల్ కోసం బంక్‌ల వద్ద బారులుదీరాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పరిస్థితి కనిపించింది. ప్రతి వాహనదారుడు ఫుల్ ట్యాంక్ చేయాలంటూ బంక్ సిబ్బందిని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దీంతో బంకుల్లోని పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి.
జిల్లాలో 180 పెట్రోలు, డీజిల్ బంక్‌లు ఉన్నాయి. వీటికి బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ కంపెనీల ద్వారా పెట్రోలు, డీజిల్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఇందన కొరత లేదు. వాహనదారులు భయంతో వాహనాలను ఫుల్‌ట్యాంక్ చేయించుకుంటున్నారు. దీనివల్ల పెట్రోలు, డీజిల్ నిల్వలు అయిపోతున్నాయి. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు. వాహనదారులు గమనించి అవసరం ఉన్నంత వరకే పెట్రోల్ పోయించుకోవాలి.
– వెంకటేశం, డీఎస్‌ఓ, నల్లగొండ
ఫ యుద్ధ ప్రభావంతో వాహనదారుల ముందు జాగ్రత్త
ఫ పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద తంటాలు
ఫ క్రెడిట్ విధానం తొలగించడంతో ట్యాంకర్ల రాకలో జాప్యం
ఫ ఫలితంగా బంకుల్లో నోస్టాక్ బోర్డులు


