నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి చెందిన పాత సామగ్రిని బుధవారం వేలం వేవారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ టెండర్‌దారుల సమక్షంలో పారదర్శకంగా వేలం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, మోటర్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ సూరప్ప నాయుడు, వెల్ఫేర్ ఆర్‌ఐ సంతోష్, అడ్మిన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బీఈడీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ ఒకటి, మూడవ సెమిస్టర్ ఫలితాలు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డిలు బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 2,601 మందికి 1,982 మంది ఉత్తీర్ణత సాధించారు. 619 మంది ప్రమోట్ అయ్యారు. మూడవ సెమిస్టర్‌లో 2,713 మంది విద్యార్థులకు 2,440 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 269 మంది ప్రమోటయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు.


