నల్లగొండ : పోలీస్‌స్టేషన్లలో గ్రంథాలయాల ఏర్పాటు శుభ పరిణామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘స్టార్ట్ లైబ్రరీ – సేవ్ లైబ్రరీ’ నినాదంలో భాగంగా నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని 20 పోలీస్ స్టేషన్లలో గ్రంథాలయాలకు సంబంధించిన పుస్తకాలను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. సమయం దొరికితే మొబైల్ ఫోన్లలో మునిగిపోతున్న వారికి పుస్తక పఠనం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్న తరుణంలో విపంచి ఫౌండేషన్ ముందుకు గ్రంథాలయాలు ఏర్పాటుకు సహకరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ గాదె వినోద్‌రెడ్డి, విపంచి ఫౌండేషన్ గౌరవ సలహాదారుడు అందోజు నాగభూషణం, ఫౌండేషన్ సభ్యులు గడ్డం సత్యనారాయణ, డాక్టర్ బావన రుషి, నడిగోటి శ్రీనివాస్, పోలోజు వెంకటాచారి, మేకల ప్రదీప్‌రెడ్డి, స్వామి పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్రపవార్


