మునుగోడు : తన పదవీకాలం పూర్తయ్యేలోగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి పక్కా బీటీ రోడ్లు వేయిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు మండలంలోని చల్మెడ, కల్వకుంట్ల, మునుగోడు, ఎల్గలగూడెం, సోలిపురం, కిష్టాపురం గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, దుబ్బకాల్వ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు కేవలం 12 ఫీట్ల వెడల్పుతో రోడ్లు నిర్మించేందుకు నిధులు చేసిందని.. ఆ రోడ్లను తాను 18 ఫీట్ల వెడల్పుతో నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించానని చెప్పారు. పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగుపడితేనే గ్రామాలె అభివృద్ధి చెందుతాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వంతో కొట్లాడైనా సరే నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ శ్రీదేవి, పంచాయతీరాజ్ డీఈ నాగేశ్వర్‌రావు, తహసీల్దార్ ఎన్.నరేష్, ఎంపీడీఓ యుగేందర్‌రెడ్డి, పంచాయితీరాజ్ ఏఈ సతీష్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు కొండ శ్రీను, బండమీది యాదయ్య, మురళి, బొల్లం రమేష్‌యాదవ్, పాలకూరి రమాదేవి, గోపగోని పాపయ్య, మాలుగు శ్రీను పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి
రాజగోపాల్‌రెడ్డి


